ప్రియమణి కత్తి పట్టుకుని యుద్ధానికి సిద్ధమౌతోంది. శత్రువుల్ని చీల్చి చెండాడేందుకు ఆయుధాన్ని పదును పెడుతోంది. పోయిన రాజ్యాన్ని దక్కించుకునేందుకు సమరభేరి మోగించబోతోంది. పాయింట్ కి వచ్చేద్దాం.... ప్రియమణి ప్రధాన పాత్రగా ఓ సినిమా సెట్స్ మీదికి వెళ్లేందుకు రంగం సిద్ధమైందట. ఇందులో యువరాణి గెటప్ లో ప్రియమణి కనిపించనుంది. కథ నాలుగు వందల ఏళ్ల కిందట జరుగుతుందట. రాజ్యాన్ని దక్కించుకునే యువరాణిగా ప్రియమణి పోరాటం సాగిస్తుందట. ఈ మేరకు ఇప్పటికే ప్రియమణి కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుందిట. అంతేకాదు... డిసెంబర్ లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. తమిళంలోనూ దీన్ని విడుదల చేస్తారని కూడా అంటున్నారు. ఏమో... అనుష్కకి అరుంధతిలాగా... ప్రియమణికి ఈ చిత్రం కలిసొస్తుందేమో? మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో? రావాలనే ఆశిద్దాం
nijjama...chala manchi news
ReplyDelete