అల్లు శిరీష్ హీరోగా 'గౌరవం' చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి కానుకగా విడుదల చేసారు. అళగియ దీయే,
మొళి, అభియుమ్ నానుమ్, పయనం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన
దర్శకుడు రాధామోహన్ తాజాగా రూపకల్పన చేస్తున్న చిత్రం గౌరవం. నటుడు
ప్రకాష్‌రాజ్ డ్యూయెట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంతో పాటు
తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కుతోంది. జనవరిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో విగ్రహం చూపటంతో ఈ చిత్రం మరో కాంట్రావర్శికి దారి తీస్తుందా అనే సందేహాలు టాలీవుడ్ లో చుట్టుముడుతున్నాయి. అందులోనూ గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ నిత్యం ఏదో ఒక వివాదంలో మునిగితేలుతోంది. తమ చిత్రాలతో సమాజంలోని ఏదో ఒక వర్గం మనోభావాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు అన్ని చోట్ల నుంచి వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఈ పోస్టర్ అందరనీ ఆశ్చర్యపరిచి హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రెండవ కొడుకు శిరీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన ‘విక్కీ డోనర్' లోనూ హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం...ఈ చిత్రంలో మెగా అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయి అని దర్శకుడు చెప్తున్నారు.
ప్రేమ, సెంటిమెంట్, వినోదం కలిసిన ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని నవ హీరో అల్లు శిరీష్ అంటున్నారు. ఈ చిత్రం కచ్చితంగా విజయాన్ని ఇస్తుందని అల్లు శిరీష్ ఆశిస్తున్నారు.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .