Saturday, 24 November 2012

మెగా ఫ్యామిలీ నుండీ మరో మూవీ ! .

మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో తొలి సన్నివేశానికి కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి క్లాప్ ఇవ్వగా, పవన్ కళ్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, రామానాయుడు, సురేష్ బాబు, వినాయక్, కె.ఎస్. రామారావు, శ్యాంప్రసాద్ రెడ్డి, నాగబాబు, అల్లు అర్జున్, దిల్ రాజు, తదితరులు హాజరయ్యారు. కాగా, సాయి ధర్మ తేజ నటిస్తున్న ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. గీతా ఆర్ట్స్- దిల్ రాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గా వ్యవహరిస్తున్నారు. సాయి ధర్మ తేజ హీరోగా వై.వి.ఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో రేయ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .