ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడేవారు విచ్చలవిడిగా Google Play
Storeలోనూ, వేరే అప్లికేషన్ marketలలోనూ కన్పించే అప్లికేషన్లని ఇన్‌స్టాల్
చేస్తూ పోతారు.
ఒక అప్లికేషన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది కొన్ని పర్మిషన్లని మన నుండి కోరుతుంది.
ఉదా.కు…
- మీ phone calls వివరాలూ, sms వివరాలూ తాను సేకరిస్తుందనీ..
- GPS ద్వారా ప్రస్తుతం మీరెక్కడ ఉన్నారన్నది సేకరిస్తామనీ..
- మీ ఇంటర్నెట్‌ని వాడుకుంటామనీ..
- SD Card సమాచారం మారుస్తామనీ.. ఇలా మన కళ్లెదురే మనల్ని అడుగుతూనే మన నుండి పర్మిషన్లు తీసుకుంటాయి.
కొన్ని అప్లికేషన్లు వాటి పని అవి చేయాలంటే వాటికి అవసరం అయిన పర్మిషన్లని మనం ఇవ్వక తప్పదు కూడా!
కానీ… చిక్కల్లా అవసరం లేని పర్మిషన్లని కూడా అడిగే అప్లికేషన్ల విషయంలోనే తలెత్తుతుంది.
ఆండ్రాయిడ్ అప్లికేషన్లని తయారు చేసే వారు.. తమ అప్లికేషన్‌కి అవసరం లేని పర్మిషన్లని కూడా ఫోన్/టాబ్లెట్ యూజర్ల నుండి కోరుతున్నారు.
ఉదా.కు.. పైన చూపించిన “Lord venkateswara” అనే అప్లికేషన్‌నే తీసుకుంటే.. అదేం చేస్తుందంటే.. వేంకటేశ్వర సుప్రభాతంని ఆడియో రూపంలో మనకు విన్పిస్తుంది. సో ఆ అప్లికేషన్‌కి మన GPS లొకేషన్‌తో పనిలేదు.
కానీ మీరే స్వయంగా చూడండి అది GPS లొకేషన్‌నీ, ఫోన్ కాల్స్‌నీ సేకరిస్తానని మన నుండి పర్మిషన్లు కోరుతోంది.
సో ఆ అప్లికేషన్ తయారు చేసిన వ్యక్తి అలాంటి అవసరం లేని అదనపు సమాచారం తన అప్లికేషన్ ద్వారా సేకరించి… మనకు తెలీకుండా మన నెట్‌వర్క్‌ని వాడుకుంటూ మన call data, మనం ఎక్కడ ఉన్నదీ తనకి రిపోర్టులు పంపే విధంగా ఆ అప్లికేషన్‌ని తీర్చిదిద్దబడి ఉన్నా మనం పట్టించుకోం
ఇలాంటి లక్షల కొద్దీ అవసరానికన్నా ఎక్కువ పర్మిషన్లని మన నుండి కోరుతున్న అప్లికేషన్లు Google Play Storeలో ఉన్నాయి.
సో ఇకపై ఏదైనా అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోబోయే ముందు అది ఏ పర్మిషన్లని అడుగుతోందో గమనించి.. అవి నిజంగా ఆ అప్లికేషన్‌కి అవసరమా లేదా అన్నది మీకు మీరే కామన్ సెన్స్‌తో నిర్ణయించుకుని wiseగా అప్లికేషన్లని ఇన్‌స్టాల్ చేసుకోండి.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .