Thursday, 8 November 2012

ఒరిజినాలిటీ కోసం మణిరత్నం తుపాను రిస్క్‌??

భారతదేశం గర్వించదగిన దర్శకులలో మణిరత్నం ఒకరు. కథ.. కథనం..చిత్రీకరణ విషయంలో ఆయన ఎంతో ప్రత్యేకతను కనబరుస్తారు. ప్రతి సన్నివేశానికి సహజత్వాన్ని ఆపాదించడానికి ఆయన ఎంత కష్టమైనా పడతారు. తాజాగా జరిగిన ఓ సంఘటన, సహజత్వం కోసం ఆయన పడే ఆరాటాన్ని మరోమారు నిరూపించింది. 'నీలం' తుపాను ఇటు ఆంధ్రప్రదేశ్‌ను, అటు తమిళనాడును గడగడలాడించింది. దాంతో చాలామంది తమ సినిమాల షూటింగ్స్‌ వాయిదా వేసుకున్నారు. మణిరత్నం మాత్రం తన కెమెరామెన్‌ రాజీవ్‌మీనన్‌ను వెంటబెట్టుకుని చెన్నై-రాయపురం సమీపంలోని కాశిమేడుకి చేరుకున్నారు. అక్కడ సముద్రంలోని కెరటాల ఉధృతిని, గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులను చిత్రీకరించారు. ప్రస్తుతం తాను తెరకెక్కిస్తోన్న 'కడల్‌' (తెలుగులో 'కడలి') చిత్రంలో ఈ దృశ్యాలను వాడనున్నట్టు చెబుతున్నారు. ఒరిజినాలిటీ కోసం మణిరత్నం తీసుకున్న ఈ రిస్క్‌, ఆయన సినిమా పట్ల అంకితభావానికి అద్దం పడుతోందని అంటున్నారు. .

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .