Saturday, 10 November 2012

లఘు చిత్రాల దర్శకులకు సూచనలు...

రోజుకి సగటున సుమారు వంద వరకు తెలుగు షార్ట్ ఫిల్మ్స్ యు ట్యూబ్ లో అప్ లోడ్ అవుతూ ఉండొచ్చని నా ప్రదిమిక అంచనా. కానీ వాటిలో సగానికి పైగా నాసిరకం గానూ, immature గాను ఉంటున్నాయి. ఎందుకలా?
1. తెలియని తనం
2. సరైన పరికరాలు లేకపోవడం
3. ఉన్నంతలో ఏదొకటి తిసేద్దాం అనుకోవడం.
ఇవి పక్కన పెడితే మన వాళ్ళు రెగ్యులర్ గా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. నేను చెప్పదల్చుకున్నది ఎక్కువ సాగదీయకుండా చేయకూడనివి, తప్పకుండా చేయవలసినవి అని విడగొట్టి మీకు కిందన తెలియచేస్తున్నాను.
చేయకూడనివి:
1.  ఆరంభంలో వచ్చే టైటిల్స్ కి ఎక్కువ ఎఫ్ఫెక్ట్స్ ఇవ్వకండి మరియు ఎక్కువ నిడివి ఉంచకండి. సినిమాలో కి నేరుగా వెళ్ళిపోయి చివర్న మీ టైటిల్స్ వేసుకోవడం ఉత్తమం. చాల షార్ట్ ఫిల్మ్స్ లో గమనిస్తే అయిదు నిమిషాల నిడివి గల దానికి కూడా నిమిషానికి పైగా టైటిల్స్ ఆరంభం లోనే వచ్చేస్తాయి. అలా చేయడం వలన ప్రేక్షకుడు చూడకుండా మొదట్లోనే వదిలివేసే ప్రమాదం ఉంది.
2.  ఎడిటింగ్ లో transitions ఎక్కువ వాడకండి. కొందఱు ప్రతి షాట్ కి dissolves, fade-in/out వేస్తుంటారు. అలాంటివి చేయకండి.
3.  కష్టమో నష్టమో ఎవరో ఒకర్ని పట్టుకుని సంగీతం చేయించుకోండి కానీ సినిమాలోని సంగీతాన్ని కాపీ కొట్టకండి.
4.  కామెడీ షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు సాధారణంగా ఒక కామెడీ క్యారెక్టర్ని పెట్టుకుని తను రాగానే ఏ పులి, ఖలేజ లాంటి సినిమాలలో పాటలు వేసి నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలంటి వాటి వలన ప్రేక్షకులు నవ్వడం అయితే నవ్వుతారు కానీ ఆ మూసలో పడిన మీరు ఇంకెప్పుడు సినిమాలలో నవ్వించలేరు. కామెడీ అనేది టైమింగ్ తో వచ్చేది. ఒక పాట వేసో, వెనకాతల హహ లాంటి సౌండ్స్ పెట్టి రప్పించేది కాదు. నా ఉద్దేశం అలా చేసే వారిని కించ పరచడం కాదు కానీ ఒక దర్శకుడు అవ్వాలనుకునే వాడు చేయాల్సిన ప్రాక్టీసు అది కాదు.
5.  ఇది మేము చేసాము అని చెప్పుకోడానికి అన్నట్టు మూవీ అయిపోయాక ఊరకనే making ఫొటోస్, వీడియోస్ వేసుకుంటూ ఉంటారు. ఇది Professionalism అనిపించుకోదు. మీరు మీ శ్రమను తెలియచేయాలనుకుంటే making ఫొటోస్ ని ఏదైనా సోషల్ నెట్వర్క్ సైట్ లో పోస్ట్ చేసుకోండి. ఒక దర్శకుడి నిజమైన శ్రమ సినిమా లో కనిపిస్తుంది. ఫొటోస్ లో కాదని గుర్తుంచుకోండి.
చేయవలసినవి:
1.  ముందు మంచి స్క్రిప్ట్ రాసుకోండి. “To have a best idea, u should have 100 ideas” అని ఎవరో అనట్టు, ఐడియా ఒచ్చినదే తడువుగా సినిమా తీయడానికి రెడీ అయిపోకుండా కొన్నాళ్ళు ఆగి, అంత కన్నా మంచి ఐడియా వస్తుందేమో చూడండి.
2.  షాట్ డివిజన్ ముందుగా చేసుకోండి. దాని వలన ఎడిటింగ్ లో అడ్డమైన transitions వేసి కవర్ చేసుకొని దుస్థితి తప్పుతుంది.
3.  Orkut, Facebook లాంటి social networking సైట్స్ ద్వార మీకు కావాల్సిన crew ని ఏర్పరుచుకోండి.
4.  మీ సినిమాలలో సమాజానికి పనికొచ్చే అంశం ఏదైనా ఉన్నటైతే అది ఫిలిం ఫెస్టివల్స్ కి పంపించుకోడానికి మరియు మీడియా చూపు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించడానికి ప్రయత్నించండి.
5. మీకు YouTube లో views ముఖ్యం అనుకుంటే Comedy, Love అన్నవి అందరు ఎక్కువగా చూసేవి అని గుర్తు పెట్టుకోండి

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .