Monday, 5 November 2012

పెళ్లయినట్లు అనిపించడం లేదు;సానియా మీర్జా


English summary
Indian tennis star, belongs to Hyderabad, told in an interview to an English daily that She feels like Shoaib and she were still dating. The married life is wonderful, she told.                                                                 సానియా మీర్జాకు ఇంకా షోయబ్ మాలిక్‌తో డేటింగ్ చేస్తున్నట్లే ఉందట. పెళ్లయినట్లు అనిపించడం లేదట. టెన్నిస్ క్రీడలో భారత నెంబర్ వన్ సానియా మీర్జా తన అందాలతోనూ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను పోగేసుకుంది. ఇద్దరు కూడా క్రీడాకారులు కావడంతో ఎక్కువగా పర్యటనల్లో ఉంటామని, కలిసి ఉండే రోజులు తక్కువగా ఉంటాయని, దాంతో ఇంకా డేటింగ్ చేస్తున్నట్లే ఉందని ఆమె అంటోంది. దాంతో మ్యారేజీ లైఫ్ వండర్‌ఫుల్‌గా ఉందని అంటోంది.ఆ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాల గురించి మాట్లాడింది. తనకు బాలీవుడ్‌లోనూ మిత్రులున్నారని చెప్పింది. సోనాక్షి సిన్హా తనకు మంచి స్నేహితరాలని చెప్పింది. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా తనకు మిత్రులున్నారని, అయితే తాను వారితోనే సరిపెట్టుకోవడం లేదని అంది.
బాల్య మిత్రులనూ పాఠశాలలోని సహధ్యాయులనూ తాను కలుస్తుంటానని చెప్పింది. షోయబ్ తాను ఏ రియాల్టీ షోలోనూ కలిసి డ్యాన్స్ చేయడం లేదని, రియాల్టీ షోలోనే కాదు, ఎక్కడా డ్యాన్స్ చేయడం లేదని స్పష్టం చేసి, నవ్వేసింది. తన మరీ అంతగా ఫ్యాషన్ దుస్తులు ప్రత్యేకంగా ధరించబోనని చెప్పింది. అందరు ఆడపిల్లల మాదిరిగానే తాను డ్రెస్ చేసుకుంటాని అంటోంది.
స్టయిల్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా తాను దుస్తులను డిజైన్ చేయించుకోవడం లేదని, అయితే తనకు ఇండియాలోని ఉత్తమ డిజైనర్లు దొరికారని, వారు సృష్టించిన దుస్తులు ధరించే అవకాశం రావడం తనకు అవకాశం లభించిందని ఆమె చెప్పుకొచ్చింది. ఏదైనా సౌకర్యంగా ఉండాలని అనుకుంటానని, అదే తన స్టయిల్ అని చెప్పింది. ఏమైనా, ఆమెలో ఏదో మత్తు ఉందని మాత్రం ప్రపంచం ఇప్పటికీ భావిస్తూనే ఉంది.
                                                                      

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .