
ఆడియో సీడీని రామ్‌చరణ్ ఆవిష్కరించి వినాయక్‌కి ఇచ్చారు. వన్ మినిట్ టీజర్‌ని యమపాశం విదిలించి వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో అడ్డాల చంటి నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి కోటి సంగీతం అందించారు. ఈ పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. యముడి నేపథ్యంలో రూపొందిన చిత్రం కావడం వల్ల యాంకర్లు యముడు, చిత్రగుప్తుడి గెటప్స్‌లో ప్రత్యక్షమయ్యారు. విచ్చేసిన అతిథులకు యమపాశం ఇచ్చి నవ్వించారు. ఆ పాశాన్ని విదిలించి ఒక్కో పాటను ఆవిష్కరించారు.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ - ‘‘నేను మొదటిసారి సోషియో ఫాంటసీ చిత్రం చేశాను. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు. ‘‘యముడి నేపథ్యంలో వచ్చిన అన్ని చిత్రాలు రికార్డు సృష్టించాయి. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను'' అని సత్తిబాబు చెప్పారు. చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉందని చంటి అన్నారు. ఈ వేడుకలో బి.గోపాల్, భీమినేని శ్రీనివాసరావు, అశోక్‌కుమార్, చలపతిరావు, నాని, శర్వానంద్, తనీష్, వైభవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .