నాగార్జున, అనుష్క జంటగా నటించిన చిత్రం 'డమరుకం'. దసరా సంబరాల్లో
వస్తుందని భావించిన 'డమరుకం' దీపావళి ముందు తెరపైకి వస్తోంది. ఈ నెల 9న
చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. శనివారం
రాత్రి హైదరాబాద్‌లో విడుదల విషయాన్ని నిర్మాతలు ధ్రువీకరించారు. విడుదల
తేదీ తో పోస్టర్స్ విడుదల చేసారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం లో ఆర్.ఆర్.
మూవీస్ వెంకట్ నిర్మించారు. సోషియో ఫాంటసీ తరహాకు చెందిన చిత్రమిది.భగవంతుడికీ మనిషికీ మధ్య సాగే కథ. గోదావరి ప్రాంతానికి చెందిన
మల్లికార్జునకీ కైలాసంలో ఉండే శివుడికీ ఉన్న బంధం చిత్రాన్ని ముందుకు
నడిపిస్తుంది. శివుడి పాత్రను ప్రకాష్‌రాజ్ పోషించారు. విలన్ గా రవిశంకర్
కనిపిస్తారు. ఛార్మి ప్రత్యేక గీతంలో నర్తించింది. దేవిశ్రీప్రసాద్
స్వరాలు సమకూర్చారు అన్నారు.
శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ తరహా అంశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దాం. మనవైన ఆచారాలు, సంప్రదాయాలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటే వాటిని కాపాడేందుకు ఒకరు ఉద్భవిస్తారనే విషయాన్ని అంతర్లీనంగా ఇందులో చెబుతున్నాం. నాగార్జున నటన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు.
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇండియన్ స్క్రీన్‌పై ముందెన్నడూ చూడని విధంగా గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూడొచ్చని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చెప్పారు. నాగార్జున కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా వెంకట్ అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .