Thursday, 8 November 2012

జీవా, నానిలపై సమంతాకు వెరైటీ రొమాంటిక్ ఫీలింగ్ ??


సమంతాకు హాస్యచతురత కాస్త ఎక్కువని ఆమెతో పనిచేసిన సహ నటులు చెబుతారు. సినిమా సెట్స్‌లో చక్కటి ఛలోక్తులు విసురుతూ సెట్‌లో అందరినీ నవ్విస్తుందట ఈ సుందరి. తాజాగా ఈ భామ ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని తనతో హీరోలుగా నటిస్తున్న జీవా, నానిలపై సరదాగా కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఈ భామ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాని సరసన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రమిది. తమిళంలో జీవా కథానాయకుడు.ఈ మధ్యనే చెన్నైలో ఓ యుగళగీతాన్ని చిత్రీకరించారు. ఆ సమయంలో జీవా, నానిలిద్దరూ జలుబు, జ్వరంతో బాధపడుతున్నారట. పాట చిత్రీకరణలో భాగంగా ఇద్దరు హీరోల సరసన సమంతా కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసింది. తదనంతరం ఈ భామ ట్విట్టర్‌లో స్పందిస్తూ- ‘దగ్గు, జలుబుతో బాధపడుతున్న హీరోలతో రొమాన్స్ చేయడం భలేగా అనిపించింది. ఇదొక వెరైటీ రొమాంటిక్ ఫీలింగ్’ అంటూ సందేశాన్నిచ్చింది. అయితే ఈ భామ కామెంట్‌కు హీరో జీవా కూడా అంతే సరదాగా ప్రతిస్పందించాడు..‘మా కొచ్చిన జలుబు, జ్వరం రొమాంటిక్ సీన్స్ వల్ల సమంతాకు వస్తే మేము కొంచెం రిలాక్స్‌గా ఫీలవొచ్చు’ అని కామెంట్ చేశాడు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .