ఢమరుకం' సినిమా విడుదల చాలా ఆలస్యం అయినప్పటికీ మంచి విజయం సాధించింది, నా
కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు నేను నిజమైన కింగ్ లా
ఫీలవుతున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసారు అక్కినేని నాగార్జున. మంగళవారం
ఏర్పాటు చేసిన ఢమరుకం
చిత్రం సక్సెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. సినిమాను
హిట్ చేసిన వారికి, సినిమా విజయం కోసం కృషి చేసిన వారికి ఆయన థ్యాంక్స్
చెప్పారు.
మరో వైపు సినిమా పైరసీపై నాగార్జున ఆందోళన వ్యక్తం చేసారు. పీరసీని ప్రొత్స హించ వద్దని, అలాంటివి ఎవరి దృష్టికైనా వస్తే పోలీసులకు లేదా యాంటీ పైరసీ సెల్ కు సమాచారం అందించాలని కోరారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ సినిమా ఆలస్యం అయినందుకు క్షమాపణలు చెప్పారు.
డమరుకం సినిమా నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిందని, ఈ చిత్రం 3 రోజుల్లో 18 కోట్లు వసూలు చేసినట్లుగా అచ్చిరెడ్డి తెలిపారు. హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ సినిమాకు ఓ ఆర్టిస్టుగా కాకుండా ఓ భక్తురాలిగా పని చేసానని, అరుంధతి చిత్రం తర్వాత అటువంటి తరహా చిత్రంలో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.
అన్ని విభాగాల వారు కలిసి కట్టుగా కష్టపడి పని చేయడం వల్లనే సినిమా ఈ రోజు ఇంత పెద్ద విజయం సాధించిందని, నాలాంటి చిన్న దర్శకుడికి పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారికి, నాగార్జునకు స్పెషల్ థాంక్స్, ఈ విజయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .