Monday, 5 November 2012

‘కెమెరామెన్ గంగతో రాంబాబు' వివాదం పై దగ్గుపాటి రానా కామెంట్

"Jagan is a good director who uses his wit in a film. No director would make a film to hurt people’s sentiments. And, films are a form of art — if a director uses any topic of relevance, what’s the harm in that? Furthermore, there is the Censor Board, which is present to certify a film. Jagan had told me that he would be borrowing my name for the villain in the film. If anyone should be offended by the film, it should be me!!" Said Daggupati Rana. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' పై తెలంగాణాలో నిరసనలు వ్యక్తం అయి వివాదంలో ఇరుక్కుని బయిటపడిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఏ తెలుగు హీరో కూడా సాహసించి ఈ చిత్రం వివాదంపై మాట్లాడటానికి సాహసించలేదు. అయితే పవన్ కళ్యాణ్ అభిమని అయిన దగ్గుపాటి రానా మాత్రం స్పందించారు. తన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురం చిత్రం విడుదల సందర్బంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంపై తన అభిప్రాయాలు తెలియచేసారు.రానా మాటల్లో... ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై వచ్చిన వ్యతిరేకత ఏమాత్రం బాలేదు. జగన్‌ (పూరీ జగన్నాథ్‌) మంచి దర్శకుడు, సాధారణంగా తన చిత్రాల్లో తనదైన ఫన్ తో పంచ్ లు వేస్తారు. ఏ దర్శకుడూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి సినిమాలు తీయరు. చిత్రాలనేవి ఓ కళారూపం. దర్శకుడు ఏదైనా సమకాలీన అంశాన్ని చిత్రంలో స్పృశిస్తే అందులో తప్పేంటి? ఇంకాచెప్పాలంటే దాని మంచిచెడ్డల్ని నిర్ణయించి సర్టిఫీకెట్‌ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డు వుంది. ఆ చిత్రంలో విలన్ పాత్రకు నా పేరు పెడుతున్నట్టు జగన్‌ నాతో చెప్పారు. ఆ చిత్రం వల్ల ఎవరైనా బాధప డాల్సి వస్తే ముందది నేనే అవాలి మరి!! అన్నారు.....

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .