సినీ నటి భువనేశ్వరిపై మరోసారి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పూర్వపరాలు బయిటకు వచ్చాయి. ఆమె ఆదివారం రాత్రి చెన్నైలోని ప్రార్ధనా థియోటర్ వద్ద తాగి, తనతో పాటు వచ్చిన హై కోర్టు లాయిర్ దామోదర్ కృష్ణన్ తో కలిసి డాన్స్ వేయటంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో సినిమాకు వచ్చిన కుమార్ అనే వ్యక్తి కారును వీరు తమ కారుతో ఢీ కొట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. సేలయూరుకు చెందిన కుమార్ తన కుటుంబంతో ఆదివారం రాత్రి ఈజంబాక్కంలోని ఓ థియేటర్‌కు వచ్చారు. నటి భువనేశ్వరి కూడా దామోదరకృష్ణన్ అనే వ్యక్తితో సినిమా చూసేందుకు చేరుకున్నారు. అక్కడ దామోదరకృష్ణన్‌కు, కుమార్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో మరికొందరు వచ్చి కుమార్‌పై దాడి చేశారు.
సమాచారం తెలియడంతో సంఘటన స్థలికి నీలాంగరై ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చేరుకున్నారు. ఆయనపైనా కొందరు దాడి చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు భువనేశ్వరితోపాటు మిగతావారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయమై తన తప్పేమీ లేదని భువనేశ్వరి అంటోంది. అయితే ఆమె మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు.
గతంలో కూడా భువనేశ్వరి వ్యభిచారం కేసులో అరెస్టు అయింది. అయితే అప్పుడు తానేమీ బ్రోతల్ హౌస్ రన్ చేయటం లేనది స్నేహితులుతో కలిసి ఉండగా రైడ్ చేసి అరెస్టు చేసారని ఆరోపించింది. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటంతో ఆమె అప్పట్లో బయిటపడింది. అయితే మరో సారి విటులతో రెడ్ హ్యాండెడ్ గా సహా పట్టుబడటంతో కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై సిటీ ఏంటీ ప్రాసిట్యూషన్ వింగ్ తమకు అందిన సమాచారాన్ని ఆధారం చేసుకుని రైడ్ చేసారు. అలాగే ఈ బ్రోతల్ నెట్ వర్క్ లో మరికొందరు సినిమావాళ్ళు ఉన్నారని ఆమె ప్రకటించి సంచలనం రేపింది.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .