'ముంబై దాడుల వెనక ఉన్న నిజాలు, వాటిలో పాలు పంచుకొన్న వ్యక్తుల
భావోద్వేగాల్ని తెరపై ప్రతిబింబించడమే నా ప్రయత్నం. బాధితులైన
కొద్దిమందితో మాట్లాడాక నా కళ్లల్లో నీళ్లొచ్చాయి''అన్నారు ప్రముఖ దర్శకుడు
రామ్‌గోపాల్ వర్మ. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం '26/11'. ముంబై
మారణహోమం నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో
మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే ...''మనలో చాలా మందికి ముంబై
దాడుల గురించి తెలుసు. కానీ వాటి వెనక ఉన్న కొన్ని సంఘటనలు, వ్యక్తుల
భావోద్వేగాలు చాలా మందికి తెలియవు. వాటిని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని
తెరకెక్కిస్తున్నా. ఆ దాడుల్ని ప్రత్యక్షంగా చూసిన పలువురు పోలీసులు,
బాధితులతో మాట్లాడా. ప్రత్యేకంగా ఒక మతంపైనో, ఒక సముదాయంపైనో జరిగిన దాడులు
కావవి. మానవత్వంపైన జరిగిన దాడులుగా అర్థమైంది. ఈ ఒక్క చిత్రంతో ఆ
విషాదాన్ని, అక్కడ కొందరు చేసిన సాహసాల్ని నేను పూర్తిగా చూపించలేకపోవచ్చు.
భవిష్యత్తులో ఈ సంఘటనపై మరెవరైనా సినిమా తీసినా ఆ దాడుల్లో కొద్దిమేరకే
చూపించగలుగుతాం'' అన్నారు.
26/11 ముంబయ్ మారణహోమం నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ హిందీలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది అటాక్స్ ఆఫ్ 26/11'. ఈ సినిమాను రూపొందించడానికి గల ఉద్దేశ్యమేమిటో రామ్‌గోపాల్‌వర్మ మీడియాకు తెలిపారు. మానవ చరిత్రలో న్యూయార్క్ లో జరిగిన 9/11 తీవ్రవాదుల దాడుల కంటే భయంకరమైనవి ఎప్పుడూ జరగలేదు. కానీ జరిగిన తీరులో 26/11 ముంబయ్ దాడులు వాటికంటే భయంకరమైనవి. నా చిత్రంలో ముంబయ్ దాడుల వెనుక అసలు కథ, వాటిలో పాలుపంచుకున్న వ్యక్తుల భావోద్వేగాలను తెరకెక్కించబోతున్నాను.
ఆ ఘటనతో పరోక్షంగా సంబంధమున్న చాలా మంది వ్యక్తులతో లోతైన ఇంటర్వ్యూలు చేశాను. అప్పుడు తెలుసుకున్న కొన్ని విషయాలు నన్ను నిజంగా షాక్‌కు గురిచేశాయి. మనిషి యొక్క క్రూరత్వాన్ని, ధైర్యాన్ని ఇంత దగ్గరగా చూసిన తర్వాత మనుషుల పట్ల నాలో కొత్త దృక్పథం ఏర్పడింది. మానవ ప్రవృత్తిపై మరింత అవగాహన పెరిగింది. అందుకే భారతీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని తీశాను' అన్నారు. మానవ ప్రవృత్తిపై మరింత అవగాహన పెరిగింది. అందుకే భారతీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని తీశాను అన్నారు.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .