విపరీతంగా భయపెట్టే బౌలర్లను ఎదుర్కోవడం కన్నా అప్‌సెట్ అయిన భార్యను
ఎదుర్కోవడమంటేనే తనకు భయమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జోక్
చేశాడు. భార్య తీవ్రమైన అసంతృప్తికి గురైనప్పుడు ఎదుర్కోవడమంటేనే భయమని
అతను జోక్ చేశాడు. ద్వారకా సంజ్గిరి మరాఠీలో రాసిన సంవాద్ లెజెండ్స్ షి
(లెజెండ్స్‌తో సంభాషణ) అనే పుస్తకం కోసం 20 ఏళ్లకు పైగా అంతర్జాతీయ
క్రికెట్‌లో కొనసాగుతూ తనదైన ముద్రను వేసిన సచిన్ టెండూల్కర్ క్రికెట్
మినహాయించి ఇతర విషయాల గురించి మాట్లాడాడు. ఈ పుస్తకాన్ని మెజిస్టిక్
పబ్లికేషన్స్ అచ్చేసింది.

ఈ పుస్తకం కోసం లండన్‌లో సచిన్ టెండూల్కర్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు హెల్మెట్ల గురించి మాట్లాడుతూ హాస్యంగా అతి వేగంగా బంతులు వేసే ఫాస్ట్ బౌలర్‌కు భయపడుతారా, అప్‌సెట్ అయిన భార్యకు భయపడుతారా అని అడిగితే "ఇప్పటికే నన్ను సమస్యలో పడేశారు. ఇంటికి దూరంగా ఉన్నాను కాబట్టి చెప్తాను. అప్‌సెట్ అయిన భార్యకే" అని చెప్పారు.
తండ్రి, అన్న కాకుండా తన ఎదుగుదలకు ఉపయోగపడిన ఇతర వ్యక్తుల గురించి కూడా సచిన్ టెండూల్కర్ మాట్లాడారు. తన భార్య అంజలితో పాటు ముగ్గురు మహిళలకు తనకు సహకరించారని చెప్పారు.
"మా అమ్మతో ప్రారంభిస్తాను. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నేను ఆహారం సరిగ్గా తీసుకునే విషయంపై శ్రద్ధ పెట్టేది. గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసే నాకు ఆహారపానీయాలు సిద్ధం చేసేది. నాకు ప్రాక్టీస్ చేసి తిరిగి రావడానికి గంటల కొద్దీ సమయం పట్టేది. అయినా ఆమె నా మీదనే దృష్టి పెట్టేది. మా అమ్మ వర్కింగ్ లేడీ. ఆమె కార్యాలయానికి వెళ్లాలి, గంటల కొద్దీ పని చేయాలి, ఇంటికి వచ్చి కుటుంబం అవసరాలు తీర్చాలి" అని వివరించాడు.
"మా అమ్మ చాలా స్ట్రాంగ్ లేడీ. లేకుంటే నాలాంటి వాడిని మేనేజ్ చేయడం కష్టమే. మా అమ్మ తర్వాత మా ఆంటీని చెప్పుకోవాలి. నాలుగేళ్లు నేను మా ఆంటీ, అంకుల్‌తో ఉన్నాను" అని ఆయన చెప్పారు. తాను క్రికెట్ ఆడడం ప్రారంభించిన తర్వాత బడికి వెళ్లిరావడానికి రెండు బస్సులు మారాల్సి వచ్చేదని, రెండు బస్సులు మారి వచ్చిన తర్వాత ప్రాక్టీస్‌కు వెళ్లాల్సి వచ్చేదని, దాని వల్ల విపరీతమైన వర్క్‌లోడ్ పెరిగిందని, దాంతో తాను తన ఆంటీ, ఆంకుల్‌లతో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
తాను ప్రాక్టీస్ చేసే ప్రాంతానికి నడిచి వెళ్లేంత దూరంలోనే ఆ ఇల్లు ఉంటుందని, బడికి పది నిమిషాల్లో నడిచి వెళ్లే విధంగా ఉండేదని చెప్పారు. జీవితానికి సంబంధించిన దృక్పథాన్ని తనకు ఈ ముగ్గురు మహిళలే అందించారని సచిన్ చెప్పుకున్నారు.
"చివరగానే అయినా అత్యంత ముఖ్యమైంది. నా భార్యను నేను 1990లో కలిశాను. 21 ఏళ్ల నుంచి నేను ఆమెకు తెలుసు. ఇది చాలా కాలమే. జీవితంలోని నా కెరీర్‌లోని ఎత్తుపల్లాల్లో అన్ని వేళలా నా వెంట ఉంది. గాయాలై శరీరం సహకరించిన వేళల్లో నా వెంట ఉంది" అని చెప్పారు. అంజలి తనకు జీవితంలోని మరో కోణాన్ని చూపించిందని, తాను గాయపడినప్పుడు భిన్నంగా ఎలా ఆలోచించాలో నేర్పిందని, నాకు దేవుడు ఇచ్చినదానికి కృతజ్ఞతలు చెప్పడాన్ని ఆమె బోధించిందని, ఫిర్యాదులు లేకపోవడాన్ని చూపించిందని, జీవితాన్ని భిన్నంగా చూడడం అనేదాని వల్ల తన కెరీర్‌లో మార్పు వచ్చిందని, ఆమెకు తాను కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు.
తనకు తన కుటుంబ సభ్యులు చేసిన దానికి తాను చేసింది, తాను చేసింది చాలా చిన్నగా కనిపిస్తుందని సచిన్ టెండూల్కర్ అన్నారు. తన కుటుంబ సభ్యుల త్యాగాలు చెప్పనలవి కానివని, అంతటి బలగం తన వెనక లేకపోతే తాను ఏమీ అయి వుండేవాడిని కానని అన్నారు. నిజంగా చెప్పాలంటే తన సోదరులు, తన సోదరి, తన తల్లిదండ్రులు, తన అంకుల్, ఆంటీ తన జీవితంలో పోషించిన పాత్ర మరిచిపోలేదని అన్నారు.
తన అన్న అజిత్ కారణంగానే తాను క్రికెట్ ఆడడం ప్రారంభించానని, ఎల్లవేళలా తన తల్లిదండ్రులు, అజిత్ తనను ప్రోత్సహిస్తూ ఉండేవారని, 10 -11 ఏళ్ల వయస్సులో తన సోదరుడు అజిత్ తనలోని ప్రతిభను గుర్తించి కోచ్ రమకాంత్ అచ్రేకర్ వద్దకు తీసుకుని వెళ్లాడని వివరించారు. తన క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి స్వర్గస్తులైన తన తండ్రి రమేష్ టెండూల్కర్ ఎంత స్వేచ్ఛను ఇచ్చాడో టెండూల్కర్ వివరించారు.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .