

తన ప్రతి చిత్రాన్ని జాతీయ అవార్డుల వరుసలో నిలిపే ఆ సంచలన, యదార్థ,
వాస్తవిక, విలక్షణ దర్శకుడే.. బాలా. విక్రం, సూర్య, ఆర్య, విశాల్‌ను
మునుపెన్నడూ చూడనట్లు తెరపైకి తీసుకొచ్చి వారి కెరీర్‌ను మలుపు తిప్పారాయన.
ప్రస్తుతం అధర్వ హీరోగా 'పరదేశి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆడియో
విడుదల కార్యక్రమం చెన్నై నగరంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో నటుడు
అధర్వ, హీరోయిన్లు వేదిక, దన్షిక, పాటల రచయిత వైరముత్తు, చేరన్, శీను
రామస్వామి తదితరులు పాల్గొన్నారు...విక్రమ్ మాట్లాడుతూ... నాకు ఎప్పటికీ సూపర్‌స్టార్ బాలానే. గతంలో నేను
నటించిన సినిమాలన్నీ కమర్షియల్‌గా, కామెడీగా వెళ్లినవే. కానీ తొలిసారిగా
నాలోని నటుణ్ని బయటకు తెచ్చింది బాలానే. 'ఇలా నటిస్తోంది నేనేనా?'.. అన్న
ఆశ్చర్యాన్ని నాలో కలుగజేశారు. అంతేకాదు.. ఈ పోటీ సినీపరిశ్రమలో
నిలదొక్కుకోగలమన్న ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నాకు, సూర్య, ఆర్య, విశాల్‌కు
నటులుగా గుర్తింపు ఆయన చలవే. ఇప్పుడా వరుసలో అధర్వ కూడా చేరుతున్నాడు
అన్నారు.
.jpg)

సూర్య
మాట్లాడుతూ... 'సేతు' సినిమాను చూసి ఆశ్చర్యపోయా. ఆ తర్వాతి చిత్రమే నాతో
చేస్తానని బాలా చెప్పారు. ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడు.. చూసి
ఆశ్చర్యపోయా. ఇంత సింపుల్‌గా ఉండే బాలా.. ఎంతటి ప్రభంజనాలు
సృష్టిస్తున్నారో అనుకున్నా. ఆయనతో 'నంద', పితామగన్' చేస్తున్నప్పుడు అసలు
నటన అంటే ఏంటో నేర్చుకున్నా. నాకు ప్రస్తుతం తెలిసిన విషయాలన్నీ బాలా వద్ద
నేర్చుకున్నవే అన్నారు.ప్రముఖ దర్శకుడు బాలుమహేంద్ర మాట్లాడుతూ..గురువు స్థానంలో నన్ను మనసులో
పదిలంగా దాచుకున్న బాలాను చూస్తుంటే గర్వంగా ఉంది. తన సినిమాలకు సంబంధించిన
వేడుకలే అయినా నేను వేదికపై ఉన్నప్పుడు అతడు కిందే ఉండటం బాధగా ఉంది.
ప్రారంభంలో నా జట్టులో నాకు తెలియకుండానే పనిచేసేవాడు. అతణ్ని చూసి
ఆశ్చర్యమేసింది. దగ్గరకు పిలిచి.. 'ఎవరుబాబు నువ్వు. ఏ పనైనా చెకచకా
చేస్తున్నావ్. అందులో వైవిధ్యం ఉందే' అని చెప్పా. అనంతరం అతడి కోరిక
మేరకు అసిస్టెంట్‌గా చేర్చుకున్నా. అంతేకాదు.. నా ఇంట్లో పెరిగిన వాడు
బాలా. అందుకే నా పెద్దకొడుకుగా భావిస్తున్నా అన్నారు.పరదేశి చిత్రం హీరో అధర్వ మాట్లాడుతూ.. ఓ సారి బాలా ఫోన్ చేసి 'నీతో ఓ
సినిమా తీయాలి. రేపు వస్తే ఫొటో షూట్ చేద్దాం' అన్నారు. అందరికీ తెలుసు
బాలా సినిమాలో నటించే అవకాశమంటే ఎంత అదృష్టమో. ఆ మాట వినగానే నన్నెలా
మార్చుతారోనని ఆలోచన మొదలైంది. హెయిర్‌స్త్టెల్ ఎలా ఉంటుందనే విషయమై
అంతర్జాలంలో వెదికా. పలు రకాలు చూసి.. ఇలా మార్చుతారేమో అనుకున్నా. ఆఖరుకు
నాకు అతిపెద్ద షాక్ ఇచ్చారు. ఇంటర్నెట్‌కే అంతుచిక్కని ఈ హెయిర్‌స్త్టెల్
పెట్టారు. పెద్ద సన్నివేశాలను సైతం చాలా సింపుల్‌గా 'ఇలా దూకేయాలి..
అక్కడి పడి లేచిరావాలి..' అని చెప్పేస్తారు. వాస్తవానికి అలా చెప్పడం వల్లే
ఎంత శ్రమనైనా ఓర్చుకోగలం. ఈ సినిమా నిజంగానే ఓ అత్యద్భుతంగా నిలుస్తుందని
నమ్ముతున్నా అన్నారు.దర్సకుడు బాలా మాట్లాడుతూ.. 'మీ నటుల్లో నచ్చిన హీరో ఎవరు?' అంటూ చాలామంది
నన్ను అడుగుతున్నారు. వాస్తవానికి వాళ్లందరి కన్నా.. అదిపెద్ద నటుణ్ని నేనే
(నవ్వుతూ..). లేకుంటే మీ అందరిముందు మంచివాడిలా ఎలా నటిస్తున్నానో చూడండి.
'పరదేశి'లో అధర్వను హీరోగా ఎంచుకున్నందుకు కూడా కారణం అడుగుతున్నారు. ఏం
అతడు హీరో కాదా? అతణ్ని ఈ సినిమాకు ఎంచుకోవడానికి అసలైన కారణం.. బాధ్యత
అన్నారు.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .