Friday, 16 November 2012

రామ్ చరణ్‌ ‘జంజీర్’ లో విలన్ ఎవరు ??

రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న ‘జంజీర్' చిత్రంలో అతుల్ కులకర్ణి నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. ‘జంజర్ రీమేక్ లో నేను నటిస్తున్నాను. ఈ చిత్రంలో పూర్తిగా సరికొత్త పాత్ర పోషిస్తున్నాను. దర్శకుడు అపూర్వ లఖియా నా పాత్రను అద్బుతంగా రూపొందించారు' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు. అతుల్ కులకర్ణి గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘పంజా' చిత్రంలో విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జంజీర్' చిత్రానికి రీమేక్.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.
సాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు తొలి రోజు 20 కోట్లపైనే వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ చిత్రం తొలి రోజు రూ. 35 కోట్ల పైచిలుకు రాబట్టింది. ఈనేపథ్యంలో రామ్ చరణ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా జంజీర్ చిత్రానికి కనీసం రూ. 25 కోట్లు తొలి రోజు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా భారీగా థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు' చిత్రంలో, వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో కూడా నటిస్తున్నారు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .