దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ మరో అరుదైన
రికార్డును తన ఖాతోలో వేసుకుంది. ప్రతినెలా సుమారు ఐధు లక్షలకు పైగా
ద్విచక్ర వాహనాలను విక్రయించే హీరో మోటోకార్ప్ కేవలం ఒక్క రోజులోనే లక్షకు
పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఆదివారం ధన్‌తేరస్ (ధనత్రయోశది)
రోజున లక్షకు పైగా టూవీలర్లను విక్రయించామని హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో
పేర్కొంది. పండుగ సీజన్‌లో కొనుగోళ్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో అమ్మకాలు
జోరందుకున్నాయని కంపెనీ తెలిపింది.
ఈ మొత్తం అమ్మకాల్లో ఒక్క స్ప్లెండర్ వాహనాలే 40,000ల యూనిట్ల వరకూ అమ్ముడయ్యాయని, మిగిలిన 60,000 యూనిట్లలో ప్లెజర్ స్కూటర్, ప్యాషన్, ఇగ్నైటర్ తదితర ఇతర ద్విచక్ర వాహనాలు ఉన్నాయని హీరో మోటార్ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ దువా చెప్పారు. గత నెలలో మొత్తం 1.8 లక్షలు స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయని, ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి విక్రయాలు 14 లక్షలకు చేరాయని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమకు అత్యంత ప్రముఖమైన బ్రాండ్ హీరో ప్యాషన్ మోడల్ బైక్‌లను ఇప్పటి వరకూ 8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశామని అనిల్ దువా తెలిపారు.
కాగా.. కంపెనీ ఇటీవలే 110 సీసీ విభాగంలో సరికొత్త హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో
మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం రూ. 46,800
(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను
విక్రయిస్తోంది. ఇందులో అమర్చిన 109.1సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్
సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్ గరిష్టంగా 8.7 పిఎస్‌ల శక్తిని, 9.36
ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ హీరో ప్యాషన్
ఎక్స్‌ప్రో 110సీసీ బైక్ డిస్క్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్
ఆప్షన్‌తో లభిస్తుంది.హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో - రివ్యూ
హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 8 ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ప్రారంభంలో భాగంగా ప్యాషన్ ఎక్స్‌ప్రో ఎంపిక చేసిన మార్కెట్లలో లభ్యం కానుంది. అనంతరం దీనిని దశల వారీగా, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 110సీసీ బైక్ ఈ సెగ్మెంట్లోని సుజుకి హయాటే, హోండా డ్రీమ్ యుగ వంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలువనుంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
ఈ మొత్తం అమ్మకాల్లో ఒక్క స్ప్లెండర్ వాహనాలే 40,000ల యూనిట్ల వరకూ అమ్ముడయ్యాయని, మిగిలిన 60,000 యూనిట్లలో ప్లెజర్ స్కూటర్, ప్యాషన్, ఇగ్నైటర్ తదితర ఇతర ద్విచక్ర వాహనాలు ఉన్నాయని హీరో మోటార్ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ దువా చెప్పారు. గత నెలలో మొత్తం 1.8 లక్షలు స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయని, ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి విక్రయాలు 14 లక్షలకు చేరాయని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమకు అత్యంత ప్రముఖమైన బ్రాండ్ హీరో ప్యాషన్ మోడల్ బైక్‌లను ఇప్పటి వరకూ 8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశామని అనిల్ దువా తెలిపారు.

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 8 ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ప్రారంభంలో భాగంగా ప్యాషన్ ఎక్స్‌ప్రో ఎంపిక చేసిన మార్కెట్లలో లభ్యం కానుంది. అనంతరం దీనిని దశల వారీగా, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 110సీసీ బైక్ ఈ సెగ్మెంట్లోని సుజుకి హయాటే, హోండా డ్రీమ్ యుగ వంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలువనుంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, కిక్ స్టార్ట్, స్పోక్ వీల్స్) - రూ. 46,800
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, కిక్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 47,800
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, స్పోక్ వీల్స్) - రూ. 48,800
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 49,800
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డిస్క్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 51,800
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .