ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాను. ఆమెతో ప్రేమలో పడినమాట వాస్తవమే.
మధ్యలో పెటాకులైనదీ నిజమే. అందుకే ఆ సంగతిపై మాట్లాడదల్చుకోలేదు. ఆ విషయం
గురించి ఏదైనా మాట్లాడితే ప్రచారం పెంచుకునేందుకని విమర్శిస్తారు. అందుకే
సైలెంట్ గా ఉన్నాను అన్నారు విశాల్. అప్పట్లో రీమాసేన్ తో లవ్ ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఆయన తాజా చిత్రం 'సమర్' విడదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే వరలక్ష్మితో లవ్ ఎఫైర్ నడుపుతున్నాడంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ... వరూ(వరలక్ష్మి) నాకు చిన్నప్పటి నుంచే స్నేహితురాలు. ఇప్పటికీ చాలా సన్నిహితురాలు. మా మధ్య ఉన్నది 20 ఏళ్ల స్నేహానికి మించి మరేం లేదు అని తేల్చి చెప్పారు. వరలక్ష్మి.. శరత్ కుమార్ కూతురు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్యన ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.
తమిళతెరపై విశేషంగా రాణిస్తున్న తెలుగుతేజం విశాల్.
పందెం కోడి, పొగరు, భరణితో వరుస మాస్ విజయాలు అందుకుని యాక్షన్
కథానాయకుడిగా ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నాడు. మాస్ పాత్రలకు తప్ప
మిగతావాటికి పనికిరాడన్న విమర్శకులకు సరైన సమాధానం చెబుతూ 'వాడు-వీడు'లో
మెల్లకన్నుతో, 'కిలాడి'లో రొమాంటిక్ హీరోగా సత్తా చాటాడు. ప్రస్తుతం ఆయన
నటించిన సమర్, మదగజరాజా (ఎమ్‌జీఆర్)లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
'సమర్'గురించి మాట్లాడుతూ.. అప్పటి సినిమాల్లో ఏదైనా రెండు మూడు సన్నివేశాలకే ట్విస్ట్ లు పరిమితం. ఇప్పుడు అలాంటివి మొదటి నుంచి చివరిదాకా లేకుంటే జనం ఆదరించడంలేదు. 'వాడు-వీడు' తర్వాత వైవిధ్యంగా కనిపించాలని ఆశపడ్డాను. అప్పుడే తిరు వినిపించిన 'సమర్' కథ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథాపరంగా వూటీలో ప్రారంభమై 15 నిమిషాల్లోనే బ్యాంకాక్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి నడిచే సన్నివేశాలు ప్రేక్షకులకు మరిన్ని మలుపుల్ని అందిస్తాయి అన్నారు.
సమర్ లో తనతో నటించిన త్రిష గురించి చెపుతూ... వాస్తవానికి 'భరణి'లోనే మేమిద్దరం కలసి నటించాల్సింది. ఆపై కూడా పలు సినిమాలకు ఆమె పేరును పరిశీలించినా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు 'సమర్'లో ఆడిపాడాం. ఇందులో మా ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిందనే చెప్పాలి. ఇద్దరినీ మంచి మిత్రులను చేసిన చిత్రం కూడా ఇదే అన్నారు. అలాగే ప్రేమలో ఇక్కట్లు ఎదుర్కొంటున్న త్రిష, నయనతారలకు ఎలాంటి సలహా ఇవ్వను. వ్యక్తిగతంగా చాలా విషయాలే మాట్లాడుకుంటాము. అందుకుని వాటిని బయటకు చెప్పమంటారా? అని అన్నారు.
అలాగే వరలక్ష్మితో లవ్ ఎఫైర్ నడుపుతున్నాడంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ... వరూ(వరలక్ష్మి) నాకు చిన్నప్పటి నుంచే స్నేహితురాలు. ఇప్పటికీ చాలా సన్నిహితురాలు. మా మధ్య ఉన్నది 20 ఏళ్ల స్నేహానికి మించి మరేం లేదు అని తేల్చి చెప్పారు. వరలక్ష్మి.. శరత్ కుమార్ కూతురు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్యన ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.
'సమర్'గురించి మాట్లాడుతూ.. అప్పటి సినిమాల్లో ఏదైనా రెండు మూడు సన్నివేశాలకే ట్విస్ట్ లు పరిమితం. ఇప్పుడు అలాంటివి మొదటి నుంచి చివరిదాకా లేకుంటే జనం ఆదరించడంలేదు. 'వాడు-వీడు' తర్వాత వైవిధ్యంగా కనిపించాలని ఆశపడ్డాను. అప్పుడే తిరు వినిపించిన 'సమర్' కథ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథాపరంగా వూటీలో ప్రారంభమై 15 నిమిషాల్లోనే బ్యాంకాక్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి నడిచే సన్నివేశాలు ప్రేక్షకులకు మరిన్ని మలుపుల్ని అందిస్తాయి అన్నారు.
సమర్ లో తనతో నటించిన త్రిష గురించి చెపుతూ... వాస్తవానికి 'భరణి'లోనే మేమిద్దరం కలసి నటించాల్సింది. ఆపై కూడా పలు సినిమాలకు ఆమె పేరును పరిశీలించినా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు 'సమర్'లో ఆడిపాడాం. ఇందులో మా ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిందనే చెప్పాలి. ఇద్దరినీ మంచి మిత్రులను చేసిన చిత్రం కూడా ఇదే అన్నారు. అలాగే ప్రేమలో ఇక్కట్లు ఎదుర్కొంటున్న త్రిష, నయనతారలకు ఎలాంటి సలహా ఇవ్వను. వ్యక్తిగతంగా చాలా విషయాలే మాట్లాడుకుంటాము. అందుకుని వాటిని బయటకు చెప్పమంటారా? అని అన్నారు.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .