సాధారణంగా ఏ సినిమా ఓపెనింగ్ అయినా హడావుడిగా, అందరికీ తెలిసేలా,
మీడియాను ఆహ్వానించి మరీ చేస్తారు. అలాంటి దేమీ లేకుకండా మీడియా వారికి
షాకిచ్చేలా చేసింది పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్. ఈ చిత్రం
ఓపెనింగ్ ఈ రోజు(నవంబర్ 23) ఫిల్మ్ నగర్లో ప్రారంభోత్సవం జరుపుకుంది.


ఫిల్మ్
నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా ఫార్మాలిటీస్ పూర్తి చేసారు.
ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాక పోయినా ‘సరదా' పేరుతో పిలుస్తున్నారు.
త్వరలో టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉంది. రెగ్యులర్ షూటింగు మాత్రం వచ్చే నెల
నుంచి జరుగుతుందని తెలుస్తోంది. సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన
ఎంపికయింది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత
తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్
ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం
వహించనున్నారు
idi chala bhagundi
ReplyDeleteBest of Luck Pawan
ReplyDelete