Thursday, 22 November 2012

ప్రపంచానికి ఆఖరి రోజు 2012 డిసెంబర్ 21 అవుతుందా!?

ఈ భూమి మీద ఏ జీవరాశులు కూడా శాశ్వతం కాదు. అలాగే ఈ సృష్టి కూడా ఏదో ఒకరోజు నాశనం కాక తప్పదు అని పురాణ గ్రంథాలు, పూర్వీకులు చెబుతున్నారు. ఈ మాటల సంగతి ఎలా ఉన్నా... ఇటీవలి కాలంలో భూగోళం అంతం గురించి పుంఖానుపుంఖాలుగా సినిమాలు గట్రా వచ్చాయి. వాటి సారాంశం ఏంటయా.. అంటే మనకింకా ఈ భూమి మీద 30 రోజులతో నూకలు చెల్లనున్నాయన్నది. అవును.. డిసెంబరు 21తో భూగోళం అంతం తథ్యమంటూ ఎన్నో సినిమాలు వచ్చాయి.

ఈ సినిమాల గోలతోపాటు గత కాలజ్ఞానులు కూడా ఇదే నిజమంటూ వాదించారు. దాని ప్రకారం డిసెంబర్ 21, 2012తో సృష్టి అంతరించబోతోందట. ప్రముఖ భవిష్యత్ దార్శనికుడు నోష్ట్రడామస్, మాయన్స్ కాలెండరు మొదలైనవి కూడా ఈ విషయాలను నిజమని చెబుతున్నాయి. డిసెంబర్ 21, 2012 డూమ్స్ డే లేదా యుగాంతంగా పిలువబడుతోంది.


ఈ రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయట. అందువలన వివిధ గ్రహాల ఆకర్షణ, వికర్షణల ఫలితంగా భూగోళం అల్లకల్లోలానికి గురవుతుందని అవుతుందని కొందరు చెపుతున్నప్పటికీ దీనితో పరిశోధకులు ఏకీభవించడం లేదు. ఐతే గత కాలజ్ఞానుల ప్రకారం గ్రహాలన్నీ ఒకే సరళ రేఖపైకి వస్తే భూమి మీద ఏ ప్రాణీ బ్రతికి ఉండే అవకాశం ఉండదన్నది వారి వాదన.


అంతేకాకుండా అదేరోజున "పోలార్ షిప్మెంట్" అనగా ధ్రువాల మార్పిడి కూడా జరుగుతుందన్నది కొందరి వాదన. ఫలితంగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం గాను, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం గాను మారుతాయి. ఫలితంగా ఏ ప్రాణి కూడా మనుగడ సాగించే అవకాశం కూడా ఉండదు. యుగాంతం రావడానికి చాలా కారణాలు చెబుతున్నారు.


దక్షిణ అమెరికాలో నివశించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు అని చెప్పగా ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, 2012 చివర్లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయి. అవి ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.


అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. దీనికి కారణం అది సరిగ్గా ఒక అగ్నిపర్వతం మీద నెలకొని ఉంది. ఐతే ఈ అగ్నిపర్వతానికి ప్రతి ఆరున్నర లక్షల సంవత్సరాలకొకసారి బద్ధలవుతుంటుంది.


దాని మూలంగా ఆకాశమంతా బూడిదతో కప్పబడి, సూర్యరశ్మి భూమిపై సోకదు. అప్పుడు భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. అది 2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


శ్రీ పోతులూరి వీరిబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో యుగాంతం గురించి చెప్పారు. ఐతే నిజంగా డిసెంబర్ 21,2012 నాడు ప్రళయం రాబోతోందా !? ఇది అంతు చిక్కని ప్రశ్న!.. మరి యుగాంతం అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరో 30 రోజులు వేచి చూడాల్సిందే..!

1 comment:

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .