రామ్ చరణ్ హిందీలో ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘జంజీర్'. ఈ చిత్రం
మొదలైన దగ్గరనుంచి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఈ చిత్రం రైట్స్
విషయమై లీగల్ సమస్యలు మొదలయ్యాయి. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని టెర్మినేట్
చేస్తూ హక్కుదారులు లీగల్ నోటీసులు పంపిచారు.
ముందుగా అనుకున్న డబ్బు
సెటిల్ చేసి ఇవ్వకపోవటం వల్ల జంజీర్ రైట్స్ కాన్సిల్ చేస్తున్నట్లు
హక్కుదారులు తేల్చి చెప్పి కోర్టు కెక్కారు. ఇక ఈ వివాదం మొదలైంది చిత్రం
రైట్స్ కి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మధ్యనే కావటం విశేషం. తమ తండ్రి
నిర్మించిన జంజీర్ రైట్స్ కొడుకులకు రాగా, అందులో ఒకతను ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నాడు. మిగతా ఇద్దరు సోదరులకు హక్కులు తాలుకు డబ్బులిస్తానని
చెప్పాడు.
కానీ మొదట అనుకున్న ప్రకారం ఇవ్వకపోవటంతో వారు కోర్టుకు
ఎక్కారు. ఇప్పుడు వ్యవహారం కోర్టుకు వెళ్లింది. సినిమా షూటింగ్ కి ఇది ఏ
విధమైన ఇబ్బంది ఎదురౌతుందో అనే సందేహంలో ఇప్పుడు హీరో, దర్శకులు పడ్డారు.
ముఖ్యంగా ఇప్పుడెలా ఉన్నా విడుదల సమయంలో ఏ విధమైన లీగల్ తలనొప్పులూ
ఉండకూడదు. అప్పుడు క్లియరెన్స్ రాకపోతే చాలా పెద్ద సమస్య. ఈ లోగా సెటిల్
చేసుకుంటారనే అనుకుంటున్నారు.
ఇక ఇంతకుముందు కూడా ఈ రీమేక్ హక్కులకు
సంభందించిన వ్యవహారం కోర్టుకు వెళ్లింది. తమ అనుమతి లేకుండా,తమకు రాయల్టి
చెల్లించకుండా ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యటానికి వీల్లేదంటూ ఒరిజనల్
సినిమాకు రచన చేసిన సలీం ఖాన్,జావేద్ లు అభ్యంతరం వ్యక్తం చేసి లీగల్
నోటీసులు పంపారు. అయితే ఈ సమస్యను దర్శక,నిర్మాతలు జాగ్రత్తగా డీల్ చేసి
సాల్వ్ చేసుకున్నారు.
జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్..
విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా, తేజగా ప్రకాష్ రాజ్
చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సోనూసూద్(తెలుగు వెర్షన్ కి), సంజయ్
దత్(హిందీ వెర్షన్ కి), మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్
మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది