Tuesday, 4 December 2012

బ్యాంకాక్ లో నాగార్జున ‘లవ్ స్టోరీ’?


నాగార్జున-నయనతార జంటగా రూపొందుతున్న ‘లవ్ స్టోరీ' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపకుంటోంది. ఇటీవలే యూరఫ్ లో ఓ షెడ్యూల్ పూర్తి కాగా త్వరలో బ్యాంకాక్ లో షూటింగుకు రెడీ అవుతోంది. ఇక్కడ ఓ సాంగు చిత్రీకరణతో పాటు కొన్ని సీన్లు, యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. దాదాపు 30 రోజు పాటు బ్యాంకాక్‌లో షూటింగ్ నిర్వహించనున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘లవ్ స్టోరీ'లో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సదరు చానల్ ముందుకు వచ్చినట్లు సమాచారం.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .