Monday, 24 December 2012

రాజమౌళి-ప్రభాస్ సినిమాలో విలన్ గా రానా??


రాజమౌళి కొత్త సినిమాలో రానా నటించనున్నాడు. ఈగ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా  ఒక భారీ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కీన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను తమిళ, హిందీలో కూడా రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన నెగటివ్ పాత్ర లో రానా నటించనున్నాడు. నటనకు ప్రాధాన్యత పాత్ర పైగా, రాజమౌళి సినిమా కావడంతో రానా కూడా ఈ నెగటివ్ పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  రానా హీరోగా నటించిన తాజా సినిమా కృష్ణం వందే జగద్గురం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో రానా ఇలా విలన్ వేషాలకు సై అంటున్నాడని వ్యాఖ్యలు వస్తున్నాయి.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .