నన్ను ఉరి తీయండి-గ్యాంగ్ రేప్ నిందితుడు
తాను తీవ్రమైన తప్పు చేశానని, తనను ఉరి తీయండని ఢిల్లీ బస్సులో
గ్యాంగ్ రేప్ కేసులో ఓ నిందితుడు బుధవారం కోర్టులో అన్నాడు. ఢిల్లీ గ్యాంగ్
రేప్ ఘటనలో నిందితులను పోలీసులు ఈ రోజు కోర్టులో హాజరు పర్చారు. తాను
దారుణమైన తప్పు చేశానని పవన్ గుప్తా అనే నిందితుడు కోర్టులో చెప్పాడు. తనను
ఉరి తీయమన్నాడు. మరో నిందితుడు వినయ్ శర్మ కూడా ఈ తప్పు చేసినందుకు తాము
ఘోరంగా సిగ్గుపడుతున్నామన్నాడు.
తాము అబ్బాయిని మాత్రమే కొట్టామని, అమ్మాయిని కొట్టలేదని వినయ్ చెప్పాడు.
ముగ్గురిని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. అమ్మాయిపై తాము అత్యాచారం
మాత్రం చేయలేదని వారు చెప్పారు. మరో నిందితుడు ముఖేష్ మాత్రం ఏమీ
చెప్పలేదు. కోర్టు పవన్‌కి, వినయ్‌కి నాలుగు రోజుల రిమాండును విధించింది.
కోర్టులో ఏమీ మాట్లాడని ముఖేష్‌కు పద్నాలుగు రోజుల రిమాండు విధించింది. ఈ
కేసులో ముఖేష్ ప్రధాన నిందితుడి సోదరుడు.
ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ను కూడా కోర్టులో హాజరు పర్చారు. కాగా వీరు
ఐడెంటిఫికేషన్ పరేడ్ వద్దని కోరారు. మరోవైపు ఇప్పటికే నలుగురిని అరెస్టు
చేసిన పోలీసులు మరో నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్
ఠాకూర్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బీహార్‌లోని ఔరంగాబాద్ వద్ద అరెస్టు
చేశారు. కాగా గ్యాంగ్ రేప్ పైన ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న
విషయం తెలిసిందే. (ఫోటోలో.. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు)......courtesy by .....www.oneindia.com
మన న్యాయ వ్యవస్థకి అంత సీనుందని అనుకుంటే ఈ వెధవలు ఇంత ధైర్యంగా ఈ మాట అని ఉండే వాళ్ళా?
ReplyDeletethank u bro...
ReplyDelete