ఈ డిసెంబర్ 21 న దబాంగ్ -2 త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో ఉన్న సల్మాన్ ఖాన్ దబాంగ్ కు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమా హిట్ అయితే దబాంగ్ -3 ని కూడా రూపొందిస్తానని సల్మాన్ తెలిపాడు. దబాంగ్ తొలి వెర్షన్ బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంతో సల్మాన్ శరవేగంగా సీక్వెల్ ను పూర్తీ చేశాడు. ఇక మూడో దబాంగ్ విషయంలో సల్మాన్ ప్రకటన చూస్తే… ఆ విషయంలో ఆయన అజిత్ ను ఫాలో అవుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఇటీవలే అజిత్ కూడా బిల్లాకు ప్రీక్వెల్ పేరుతో ఒక సినిమారూపొందిచాడు.
ఆ సినిమా ఫలితాన్ని పక్కన పెడితే… ‘బిల్లా’ ఎలా తయారయ్యాడు అనే అంశాన్ని చూపారు. ఇది భారతీయ సినిమా వరకూ ఒక కొత్త ప్రక్రియ. కొనసాగింపు కథ గా కాకుండా, ఇంతకు ముందు జరిగిన కథగా ఇండియాలో వచ్చిన తొలిసినిమా అది. ఇక ఈ ఫార్ములాను దబాంగ్ -3 విషయంలో సల్మాన్ ఫాలో కానున్నాడు. దబాంగ్ -2 ప్రమోషన్ లో భాగంగా ఆయనే స్వయంగా ప్రీక్వెల్ విషయాన్ని ప్రకటించాడు. దబాంగ్ -3 ప్రీక్వెల్ గా ఉంటుందని సల్మాన్ చెప్పాడు. చుల్ బుల్ పాండే పరిణామ క్రమం గురించి ఆ సినిమా ఉంటుందని వివరించాడు. మరి ఇది కేవలం పబ్లిసిటీ స్టంటో, లేక నిజంగానే సల్మాన్ దబాంగ్ కు ప్రీక్వెల్ తీస్తాడో…కాలమే సమాధానం చెప్పాలి.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .