వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు హీరోయిన్లకు సాధారణ విషయంగా మారింది. ఇప్పుడు ఈ కోవలోకి బాలీవుడ్ హీరోయిన్ ఇషాడియోల్ చేరింది. ప్రముఖ నటి హేమామాలిని కుమార్తె అయిన ఇషా గతంలోనే తన వీపునకు కుడివైపున గాయత్రీ మంత్రాన్ని టటూ వేయించుకుంది. సంస్కృతంలో ఉన్న ఈ టాటూతో ఫోటోలకు ఫోజులివ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. కాగా, ఇషా బుధవారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుంది. టటూ కనిపించే విధంగా ఇషా వస్ర్తధారణ చేసుకుంది. దీంతో ఈ టాటూ మళ్లీ వెలుగులోకి వచ్చింది. పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని పాశ్చాత్య ధోరణికి నిదర్శనమైన టాటూ రూపంలో ముద్రించుకోవడం దారుణమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇషా మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తన శరీరంపై గాయత్రీ మంత్రాన్ని టాటూ వేయించుకుంటే నష్టమేంటని ప్రశ్నిస్తోంది. ఇది తన వ్యక్తిగత విషయమని, గాయత్రీ మంత్రమంటే తనకు ఇష్టమని, అది ఏ ఒక్కరి సొత్తు కాదని కాస్త ఘాటుగానే సమాధానిమిస్తుంది.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .