జాకీచాన్ అంటే యాక్షన్...యాక్షన్ అంటే జాకీ చాన్. అలా యాక్షన్ చిత్రాలకు
బ్రాండ్ అంబాసిడ్ లా మారిపోయిన ఇంటర్నేషనల్ హీరో జాకీచాన్. ఆయన అభిమానులు
నిరాశపరిచే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై భారీ యాక్షన్ చిత్రాల్లో
నటించకూడదని నిర్ణయించుకున్నారట. యాక్షన్ ప్రేమికులకు ఈ వార్త తీవ్ర
నిరాశను కలిగించేదే.
ఇక ఈ విషయాన్ని జాకీచాన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన ఇండో ఓవర్‌సీస్ ఫిలింస్ అధినేత ఫిరోజ్ ఆలీ బుధవారం రాత్రి వెల్లడించారు. దీంతో జాకీచాన్ నటించిన ఆఖరి మేజర్ యాక్షన్ చిత్రంగా డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న 'సీజెడ్ 12' మిగిలిపోనుంది.
ఎన్నో కష్టనష్టాలతో సినీ ప్రస్థానం ఆరంభించిన జాకీచాన్ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఆక్రోబాటిక్ ఫైటింగ్ స్టయిల్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు, వినూత్న స్టంట్స్‌కు మారుపేరు జాకీచాన్,ఆయన పేరు చెబితే చాలు మార్షల్ ఆర్ట్స్ అభిమానులు పులకరించిపోతారు. 1960 నుంచి నటనారంగంలో ఉన్న జాకీచాన్ ఇటీవలే తన 100వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. గాయకుడు కూడా అయిన జాకీచాన్ ఎన్నో ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. తాను నటించిన చిత్రాల్లోనూ ఎన్నో థీమ్ సాంగ్స్ పాడారు.
ఎనిమిదేళ్ళ వయస్సులోనే జాకీచాన్ 'బిగ్ అండ్
లిటిల్ వాంగ్ టిన్ బార్' (1962)లో నటించాడు. అలా ఆయన సినిమా కేరీర్
ప్రారంభమైంది. 17 ఏళ్ళవయస్సులో బ్రూస్‌లీ సినిమాల్లో స్టంట్‌మాన్‌గా
నటించాడు. ఆ తరువాత 'లిటిల్ టైగర్ కాంటన్' లో ప్రముఖ పాత్ర లభించింది.
1973లో అది హాంకాంగ్ ప్రాంతంలో మాత్రమే విడుదలైంది. మొదట్లో నటించిన
సినిమాలు ఫెయిల్ కావడం, స్టంట్ పనులు దొరకడం కష్టం కావడంతో 1975లో
జాకీచాన్ పెద్దలకు మాత్రమే అనదగ్గ 'ఆల్ ఇన్ ది ఫ్యామిలీ' సినిమాలో
నటించాడు. జాకీచాన్ నటించిన వాటిల్లో ఒక్క ఫైట్ లేదా స్టంట్ సీన్ లేని
చిత్రం అదొక్కటే కావడం విశేషం.

No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .