ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఆపత్రి పాలయ్యారు. బాలీవుడ్
వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆమె మంగళవారం అన్‌కాన్సియస్(చలనం లేని
స్థితి)అయి పడిపోయారని, వెంటనే ఆమెను ముంబైలోని జాస్లోక్ ఆసుపత్రికి
తరలించినట్లు తెలుస్తోంది.కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మనీషా కొయిలారా సన్నిహితులు అంటున్నారు. వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులు నిర్వహించారని, టెస్టు రిపోర్టులు వచ్చిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆమెకు కేన్సర్ వ్యాధి ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా 1991లో ‘సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది.
కెరీర్
సరిగా లేక పోవడం, పర్సనల్ లైఫ్ సమస్యలతో బాగా సఫర్ అయిన మనీషా.... ఆ మధ్య
మద్యానికి బానిసైంది. ఆమె అనారోగ్యానికి ఈ అల వాటుకు కూడా కారణం అని
అంటున్నారు. మనీషా చివరి సారిగా నటించిన సినిమా ఇటీవల రామ్ గోపాల్ వర్మ
దర్శకత్వంలో వచ్చిన ‘భూత్ రిటర్న్స్'.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .