Thursday, 29 November 2012

కొత్తదనం ప్రేక్షకుల కు కాదు.. మాకూ కావాలి: కాజల్

నాకు హిట్స్ కొత్త కాదు, వాటి ద్వారా లభించే ఆనందం అంతకన్నా కొత్త కాదు. అయితే... ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించానన్న తృప్తి ఇప్పుడు నాకు కలుగుతోంది అంటోంది కాజల్. ఈ ముద్దుగుమ్మ ఇటీవల 'తుపాకి' చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకొంది. ఆ అనుభూతి గురించి చెప్పమని మీడియా వారు కాజల్‌ని అడిగితే ఇలా స్పందించింది. అలాగే ''ప్రేక్షకులు కొత్తదనం కోరుకొంటున్నారనే మాట పరిశ్రమలో తరచూ వినిపిస్తుంటుంది. ఆ కొత్తదనం ప్రేక్షకులకే కాదు.. మాకూ కావాలి'' అని చెబుతోంది కాజల్‌.
ఇక కారణాలేవైనా... తొలినాళ్లలో ఒకే తరహా పాత్రల్లో నటించాను. ఇప్పుడు మాత్రం నా దృష్టంతా కొత్త పాత్రలవైపే. ఉదయం లేవగానే... తొందరగా సెట్‌కి వెళదాం అనేంత ఉత్సాహాన్ని ఆ పాత్రలు నాకు కలిగించాలి. చిత్ర పరిశ్రమలో ఆరేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు కూడా మూస పాత్రలతోనే సరిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పింది.
అంతేకాదు తెరపై హాస్యం పండించడం నాకు చేతకాదేమో అనుకొనేదాన్ని. కానీ ఇటీవల అక్షయ్‌ కుమార్‌తో కలిసి 'స్పెషల్‌ ఛబ్బీస్‌' చిత్రంలో నటిస్తున్నప్పుడు నేనూ వినోదం పండించగలనని అర్థమైంది''అని చెప్పుకొచ్చింది. కాజల్‌ ప్రస్తుతం తెలుగులో 'నాయక్‌', 'బాద్‌షా', 'సారొచ్చారు' చిత్రాలతో బిజీబిజీగా గడుపుతోంది.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .