
నాకు హిట్స్ కొత్త కాదు, వాటి ద్వారా లభించే ఆనందం అంతకన్నా కొత్త కాదు.
అయితే... ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించానన్న తృప్తి ఇప్పుడు
నాకు కలుగుతోంది అంటోంది కాజల్. ఈ ముద్దుగుమ్మ ఇటీవల 'తుపాకి'
చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకొంది. ఆ అనుభూతి గురించి చెప్పమని మీడియా
వారు కాజల్‌ని అడిగితే ఇలా స్పందించింది. అలాగే ''ప్రేక్షకులు కొత్తదనం
కోరుకొంటున్నారనే మాట పరిశ్రమలో తరచూ వినిపిస్తుంటుంది. ఆ కొత్తదనం
ప్రేక్షకులకే కాదు.. మాకూ కావాలి'' అని చెబుతోంది కాజల్.ఇక కారణాలేవైనా... తొలినాళ్లలో ఒకే తరహా పాత్రల్లో నటించాను. ఇప్పుడు మాత్రం నా దృష్టంతా కొత్త పాత్రలవైపే. ఉదయం లేవగానే... తొందరగా సెట్‌కి వెళదాం అనేంత ఉత్సాహాన్ని ఆ పాత్రలు నాకు కలిగించాలి. చిత్ర పరిశ్రమలో ఆరేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు కూడా మూస పాత్రలతోనే సరిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పింది.
అంతేకాదు తెరపై హాస్యం పండించడం నాకు చేతకాదేమో అనుకొనేదాన్ని. కానీ ఇటీవల అక్షయ్ కుమార్‌తో కలిసి 'స్పెషల్ ఛబ్బీస్' చిత్రంలో నటిస్తున్నప్పుడు నేనూ వినోదం పండించగలనని అర్థమైంది''అని చెప్పుకొచ్చింది. కాజల్ ప్రస్తుతం తెలుగులో 'నాయక్', 'బాద్‌షా', 'సారొచ్చారు' చిత్రాలతో బిజీబిజీగా గడుపుతోంది.










.jpg)









.jpg)
.jpg)











ఇంతకాలం భారతీయ దర్శకులు,నిర్మాతలు మాత్రమే గిన్నీస్ బుక్ ఎక్కగలిగారు.
అయితే త్వరలో ఐటం సాంగ్ లతో గిన్నీస్ కి బుక్ కి ఎక్కబోతోంది ఓ ఐటం బాంబ్.
భోజపురికి చెందిన సీమా సింగ్ త్వరలో గిన్నీస్ వరల్డ్ రికార్డులలో చోటు
చేసుకోనుంది. ఆమె ఇప్పటివరకూ రెండు వందల యాభైకి పైగా ఐటం సాంగ్ లు చేసింది.
దాంతో ఇప్పటివరకూ ప్రపచంలో అన్ని ఐటం సాంగ్ లలో చేయలేదని,గిన్నీస్
రికార్డుకి పంపుతున్నామని చెప్తున్నారు.భోజపురి చిత్రాలతో సీమా సింగ్ ది ప్రత్యేక స్ధానం. ఆమె ఐటం సాంగ్ ఉందంటే
నిర్మాతలు తమ సినిమా సగం హిట్టే అని భావిస్తారు. దాంతో ఆమె అక్కడ పూర్తిగా
ఐటం గర్ల్ గా సెటిలైపోయింది. ఆమె తను ఐటం సాంగ్ వీడియోలన్నిటినీ సేకరించే
పనిలో ఉంది.వాటిని అన్నిటినీ కలిపి గిన్నీస్ వారికి పంపుతున్నారు. ఆమె
తరుపున ఓ టీమ్ ఇప్పటికే ఆ సినిమాలు నుంచి ఆ సాంగ్స్ కట్ చేసే పనిలో
పడిపోయింది. అయితే కొన్ని చిత్రాలు సిడీలు లభ్యంకాకపోవటంతో వాటి నిర్మాతలను
ఆమె సంప్రదిస్తోంది.