Thursday, 25 October 2012

బాబు పాలనలో కరువు-కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల                                                                                                                                          తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాలనను మర్చిపోతామన్న వీలుకాని విషయమని  అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం ఎద్దేవా చేశారు. బాబు పాలనలో కరువు కరాళ నృత్యం చేసిందని విమర్శించారు. బాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి ఎనిమిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. పెంచిన ఛార్జీలు కట్టకుంటే రైతులు, పేదవారు అని చూడకుంటా వారి మీటర్లు ఎత్తుకెళ్లారన్నారు.

ఛార్జీలు కట్టాలని ఒత్తిడి తెచ్చారన్నారు. బాబు పాలన తీరును తప్పు పట్టిన తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు రైతులతో కలిసి ఆందోళనకు దిగారన్నారు. పోలీసులు కాల్పుల్లో పలువురు రైతులు మృతి చెందారని, అయితే బాబు ఆ తర్వాత పరామర్శకు వెళ్లారన్నారు. ఆ పరామర్శకు వెళ్లింది రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు కాదని, పోలీసులను పరామర్శించేందుకు అని ఎద్దేవా చేశారు.
రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారని, నాలుగు వేల మంది రైతుల ఆత్మహత్యల పాపం అన్నారు. కాంగ్రెసు, టిడిపిలకు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యమే లేదన్నారు. షర్మిల అనంతపురం జిల్లాలో మూడో రోజు పాదయాత్ర ప్రారంభించారు. తంబాపురంలో ఆమె మాట్లాడారు. తాను రాజన్న కూతురునని, జగనన్న చెల్లెల్ని అని షర్మిల మొదట పరిచయం చేసుకున్నారు. అనంత చాలా కరువు జిల్లా అని అందుకే వైయస్ ఈ ప్రాంతానికి జలయజ్ఞంలో ప్రత్యేకంగా మేలు చేయాలని అనుకున్నారన్నారు.
సాగు నీరు, తాగు నీరు ఏర్పాటు చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి మూడో పార్టీని రానివ్వవద్దని చూస్తున్నాయని ఆరోపించారు. జగన్ బయట ఉంటే తమకు మనుగడ ఉండదని భావించే ఆ రెండు పార్టీలు కలిసి కుట్రతో కేసులు పెట్టి జైలుకు పంపించాయని ఆరోపించారు. ఇప్పుడు బెయిల్ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇది అన్యాయం కాదా అని ఆమె ప్రశ్నించారు.
జగన్ ఎప్పుడు ప్రజల సమస్యల పట్ల స్పందించారని, అందుకోసం నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారన్నారు. కుటుంబంతో కంటే ప్రజలతోనే ఎక్కువగా గడిపారన్నారు. అలాంటి వ్యక్తిని జైలుకు పంపించారన్నారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు. ఒకరోజు వస్తుందని, ఆ రోజు జగన్ వస్తాడని, ఆ రోజు రామరాజ్యం దిశగా నడిపిస్తారన్నారు. ఆ రోజే రాజన్న కోరిక నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలోని సమస్యలు తీరుస్తారన్నారు.
రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా అందరికీ సొంత ఇల్లు వస్తుందని, వ్యవసాయంపై అరవై శాతం మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బడ్జెట్‌ను స్టెబులైజేషన్ ఫండ్‌గా ఉంచుతారని, వడ్డీలైని రుణాలను రైతులకు మహిళలకు ఇస్తారని, పిల్లల్ని చదివించేందుకు 'అమ్మ' అకౌంట్లో పదో తరగతి వరకు రూ.500, ఇంటర్ వరకు రూ.700, డిగ్రీ స్థాయికి రూ.1000 డబ్బులు ఇస్తారన్నారు. పెన్షన్‌ను రూ.1000కి పెంచుతారన్నారు. జగన్‌ను అందరూ ఆశీర్వదించి పార్టీని బలపర్చాలని ఆమె కోరారు. తనతో పాటు కలిసి నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి కదం తొక్కాలన్నారు.
                  

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .