‘తుపాకి' చిత్రం పోస్టర్ కాపీ::
ఒప్పుకున్న దర్శకుడు మురగదాస్
స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ‘తుపాకి' చిత్రం తాజా పోస్టర్...హాలీవుడ్ చిత్రం పోస్టర్ An Officer and a Gentleman చిత్రం పోస్టర్ ని యాజటీజ్ గా దింపేసారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు మురగదాస్ ని మీడియా ఈ విషయమై ప్రశ్నించింది. దానికి సమాధానంగా మురగదాస్ మాట్లాడుతూ...మనం దేన్నేనే ఎక్కువగా ఇష్టపడినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతుంది. అలాగే ఈ పోస్టర్ డిజైన్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం ఈ రకంగా బయిటపడింది అని చెప్పుకొచ్చారు. ఆయన ఇలా అవును కాపీనే అని ఒప్పుకోవటం చాలా మంది మెచ్చుకుంటున్నారు.విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రం ఆడియో విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. నవంబర్ 9 న ఈ చిత్రం విడుదల అవుతోంది.
ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .