Wednesday, 31 October 2012




తక్కువ ధర ల్యాప్‌టాప్స్!

సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ల్యాప్‌టాప్ కొనుగోలు భారమవుతున్న నేపధ్యంలో ప్రముఖ కంపెనీలైన  హెచ్‌పీ, ఏసర్, అసస్, సామ్‌సంగ్, ఎమ్ఎస్ఐలు తక్కువ ధరకే అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే ల్యాపీలను అందుబాటులోకి తెచ్చాయి. ఇంచుమించు  రూ.16,000 ధరకు లభ్యమయ్యే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌లు….
హెచ్‌పీ మినీ 110- 3605టీయూ:
10.1 అంగుళాల స్ర్కీన్, ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ ఎన్455, సామర్ధ్యం 1.66గిగాహెట్జ్,  మైక్రోసాఫ్ట్ విండోస్ 7 స్టార్టర్ ఎడిషన్ 32బిట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి డీడీఆర్3 మెమెరీ, 250జీబి సాటా  హెచ్‌డిడి స్టోరేజ్,, గ్రాఫిక్స్ కార్డ్ ఇంటెల్ మీడియా యాక్సిలరేటర్ 3150, డిజిటల్ మీడియా రీడర్, ఇంటిగ్రేటెడ్ 10/100 బేస్ – టీ ఇతర్ నెట్‌లాన్, 1.66గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ఎన్570 ప్రాసెసర్, దాస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టం, ధర అంచనా రూ.15,500.
ఏసర్ ఏవోడి 270(Acer AOD 270):
10 అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లే స్ర్కీన్, స్టాండర్డ్ కీబోర్డ్, 1.6గిగాహెట్జ్ క్లాక్ స్పీడ్ సామర్ధ్యం గల ఇంటెల్ ఆటమ్ డ్యూయల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం, 320 హార్డ్‌డిస్క్ డ్రైవ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్, 0.3మెగాపిక్సల్ వెబ్ కెమెరా, వైర్‌లెస్ లాన్ IEEE 802.11 b/g/n, గిగాబిట్ ఇతర్‌నెట్, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, 6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంలట బ్యాకప్, ధర రూ.15,999.
అసస్ పీసీ 1015CX-BLK019W నెట్‌బుక్:
10 అంగుళాల WSVGA LED బాక్‌లైట్ డిస్‌ప్లే, మొబైల్ ఇంటెల్ ఎన్ఎమ్10 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,  లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం,  0.3 మెగాపిక్సల్ వెబ్ కెమెరా, 320జీబి హెచ్‌డిడి స్టోరేజ్, వైర్‌లైస్ ల్యాన్ IEEE 802.11 b/g/n, గిగాబిట్ ఇతర్‌నెట్, బ్లూటూత్ కనెక్టువిటీ, హైడెఫినిషన్ ఆడియో కోడిక్, హై క్వాలిటీ స్పీకర్, 6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంటల బ్యాకప్, ధర రూ.14,374.
సామ్‌సంగ్ NP-N100S-E01IN:
10 అంగుళాల  WSVGA ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, 1.6గిగాహెట్జ్ క్లాక్ స్సీడ్ సామర్ధ్యం గల ఇంటెల్ ఆటమ్ డ్యూయల్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్, 0.3 మెగాపిక్సల్ వెబ్ కెమెరా, దాస్ ఆపరేటింగ్ సిస్టం, వైర్‌లైస్ ల్యాన్ IEEE 802.11 b/g/n, గిగాబిట్ ఇతర్‌నెట్, బ్లూటూత్ కనెక్లువిటీ, హైడెఫినిషన్ ఆడియో కోడిక్, హై క్వాలిటీ స్పీకర్, 6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంటల బ్యాకప్, ధర రూ.15,269.
ఎమ్ఎస్ఐ యూ123 (MSI U123):
10 అంగుళాల  WSVGA స్ర్కీన్, ఇంటెల్ ఆటమ్ ఎన్270 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 166జీబి హెచ్‌డిడి స్టోరేజ్, విండోస్ ఎక్స్‌పీ హోమ్ ఆపరేటింగ్ సిస్టం, 0.3మెగాపిక్సల్ వెబ్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ, 6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంటల బ్యాకప్, ధర రూ.15,000. ...........by venkatesh.gurrala

తుపాకి' చిత్రం పోస్టర్ కాపీ::

ఒప్పుకున్న దర్శకుడు మురగదాస్

స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ‘తుపాకి' చిత్రం తాజా పోస్టర్...హాలీవుడ్ చిత్రం పోస్టర్ An Officer and a Gentleman చిత్రం పోస్టర్ ని యాజటీజ్ గా దింపేసారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు మురగదాస్ ని మీడియా ఈ విషయమై ప్రశ్నించింది. దానికి సమాధానంగా మురగదాస్ మాట్లాడుతూ...మనం దేన్నేనే ఎక్కువగా ఇష్టపడినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతుంది. అలాగే ఈ పోస్టర్ డిజైన్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం ఈ రకంగా బయిటపడింది అని చెప్పుకొచ్చారు. ఆయన ఇలా అవును కాపీనే అని ఒప్పుకోవటం చాలా మంది మెచ్చుకుంటున్నారు.
విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రం ఆడియో విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. నవంబర్ 9 న ఈ చిత్రం విడుదల అవుతోంది.
ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది.




 



 

అనుష్క మేకప్ వివాదం??                                                                                                                                                                                                                                                                                                                                      తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమలో ఓ ఊపు ఊపుతున్న భామ అనుష్క. అనుష్క కార్తితో కలిసి అలెక్స్ పాండ్యన్ అనే తమిళ చిత్రంలో నటిస్తుండగా ఆ మధ్య షూటింగు సెట్లో అరవ మేకప్ మెన్లు ఆమెతో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. స్విటీని దుర్భాషలాడటంతో రచ్చ రచ్చ చేసారు.
అనుష్క పర్సనల్ మేకప్‌మెన్‌కి తమిళ మేకప్‌మెన్స్ యూనియన్లో సభ్యత్వం లేక పోవడంతో ఈ గొడవకు కారణం. అనుష్క తనకు నచ్చిన మేకప్ మెన్‌ను తెప్పించుకుని... డబ్బులు నిర్మాతతో కట్టిస్తుండటం వారు తట్టుకోలేక పోయారు. చివరకు కార్తి కలుగజేసుకుని గొడవ సద్దుమనిగేలా చేసాడట.
ఈ నేపథ్యంలో చిర్రెత్తిన అనుష్క... ఇకపై మేకప్ మేన్‌ను సొంతం గా మెయింటేన్ చేసుకోవాలని, నిర్మాతలతో సంబంధం లేకుండా తానే మేకప్ మెన్‌ను భరించాలని నిర్ణయించుకుందట. మరి అనుష్క నిర్ణయంపై అరవ మేకప్ మెన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tuesday, 30 October 2012

Lenovo-Essential-G-Series-G560-Copy

సామ్‌సంగ్ ఆర్‌వీ509-ఏవోసీఐఎన్ ల్యాప్‌టాప్ (Samsung RV509-A0CIN Laptop):

Samsung-RV509-A0CIN-Laptop-Copy
ఇంటెల్ కోర్ ఐ3 (మొదటి జనరేషన్ ప్రాసెసర్, క్లాక్ వేగం 2.53గిగాహెట్జ్,
15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే(రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
ఇంటెల్ జీఎమ్ఏ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
0.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్,
IEEE 802.11 b/g/n వైర్‌లెస్ లాన్,
6 సెల్ బ్యాటరీ,
బరువు 2.4కిలోగ్రాములు,

ధర రూ.27,593.                                                                                                                       డెల్ వాస్ట్రో 1540 (Dell Vostro 1540):

Dell-Vostro-1540-Copy
15.6 అంగుళాల ఎల్ఈడి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, క్లాక్ వేగం 2.53గిగాహెట్జ్,
లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
ఇంటెల్ జీఎమ్ఏ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
0.3 మెగాపిక్సల్ వెబ్ క్యామ్,
IEEE 802.11 b/g/n వైర్‌లెస్ ల్యాన్,
6సెల్ బ్యాటరీ,
బరువు 2.4 కిలో గ్రాములు,

ధర రూ.27,500                                                                                                              అసస్ ఎక్స్54సీ – ఎస్ ఎక్స్ 261డీ ( Asus X54C-SX261D):

Asus-X54C-SX261D-Copy
15.6అంగుళాల స్ర్కీన్, హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
ఫ్రీ డాస్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 3000,
0.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,
IEEE 802.11 b/g/n వైర్‌లెస్ ల్యాన్,
2జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
6సెల్ బ్యాటరీ,
బరువు 2.6కిలోగ్రాములు,
ధర రూ.27,190.అసస్ ఎక్స్54సీ – ఎస్ ఎక్స్ 261డీ ( Asus X54C-SX261D):

ధర రూ.27,190.                                                                                                      లెనోవో ఎసెన్షియల్ జీ సిరీస్ జీ560:


15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి గ్గేర్ డిస్‌ప్లే,
ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, క్లాక్ స్పీడ్ 2.53గిగాహెట్జ్,
ఫ్రీ డాస్,
2జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
0.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్,
IEEE 802.11 b/g/n వైర్‌లెస్ ల్యాన్,
6సెల్ లితియమ్ బ్యాటరీ,
బరువు 1.3 కిలోగ్రాము
లు,

ధర రూహెచ్‌పీ 430 ల్యాప్‌టాప్ (HP 430 Laptop):
HP-430-Laptop-Copy

14 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్రైట్‌వ్యూ డిస్‌ప్లే,
ఇంటెల్ కోర్ ఐ3 హెచ్ఎమ్65 ఎక్స్‌ప్రెస్ ప్రాసెసర్, 2.4 గిగాహెట్జ్ క్లాక్ స్పీడ్,
ఫ్రీ డాస్,
0.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,
2జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
IEEE 802.11 b/g/n వైర్‌లెస్ ల్యాన్,
6సెల్ బ్యాటరీ,
బరువు 2.27 కిలోగ్రాములు,
ధర రూ.26,600..26,990.                                                                                                      

Sunday, 28 October 2012


నాస్థాయిని ఎవరూ తగ్గించలేరు: చిరు:అభినంధనలు తెలిపిన  పవన్ :                                                                                                             తనకు మంత్రి పదవి హోదా కాదని, బాధ్యత అని చిరంజీవి శనివారం అన్నారు. మంత్రిగా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం రావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఏ శాఖ కేటాయించినప్పటికీ తాను సమర్థవంతంగా, శక్తిమేరకు నిర్వహిస్తానని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెసు పెద్దలందరికీ కృతజ్ఞతలు అన్నారు. తన స్థాయిని ఏ పదవులు పెంచలేవనీ, అలాగే తగ్గించలేవని, చిరంజీవికి ప్రజల్లో మంచి ప్రాముఖ్యత ఉందని మెగాస్టార్ ఈ సందర్భంగా చెప్పారు.
పీఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు తాను ఎలాంటి పదవులు అడగలేదని, డిమాండ్లు పెట్టలేదని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజల మనిషినే అన్నారు. ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహించి ఆ పదవికే వన్నె తెస్తానని, కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు చెప్పారని, ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలనన్న ధీమా తనకు ఎంతో ఉందని చిరంజీవి విలేకరులతో చెప్పారు.
తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో కలసి పంచుకుంటున్నానని చిరంజీవి చెప్పారు. తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, తమ్ముడు నాగబాబులతో కలసి తాను ఢిల్లీకి వెళ్తున్నానని వివరించారు. విదేశాల్లో ఉన్న తమ్ముడు పవన్ కల్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలిపాడని.. అందుబాటులో ఉంటే ఆయన కూడా తమతోపాటు ఢిల్లీకి వచ్చేవాడని వివరించారు.
తనకు అండదండలు అందిస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, అధిష్ఠానం పెద్దలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తానని వివరించారు.

                                              

Thursday, 25 October 2012

బాబు పాలనలో కరువు-కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల                                                                                                                                          తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాలనను మర్చిపోతామన్న వీలుకాని విషయమని  అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం ఎద్దేవా చేశారు. బాబు పాలనలో కరువు కరాళ నృత్యం చేసిందని విమర్శించారు. బాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి ఎనిమిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. పెంచిన ఛార్జీలు కట్టకుంటే రైతులు, పేదవారు అని చూడకుంటా వారి మీటర్లు ఎత్తుకెళ్లారన్నారు.

ఛార్జీలు కట్టాలని ఒత్తిడి తెచ్చారన్నారు. బాబు పాలన తీరును తప్పు పట్టిన తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు రైతులతో కలిసి ఆందోళనకు దిగారన్నారు. పోలీసులు కాల్పుల్లో పలువురు రైతులు మృతి చెందారని, అయితే బాబు ఆ తర్వాత పరామర్శకు వెళ్లారన్నారు. ఆ పరామర్శకు వెళ్లింది రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు కాదని, పోలీసులను పరామర్శించేందుకు అని ఎద్దేవా చేశారు.
రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారని, నాలుగు వేల మంది రైతుల ఆత్మహత్యల పాపం అన్నారు. కాంగ్రెసు, టిడిపిలకు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యమే లేదన్నారు. షర్మిల అనంతపురం జిల్లాలో మూడో రోజు పాదయాత్ర ప్రారంభించారు. తంబాపురంలో ఆమె మాట్లాడారు. తాను రాజన్న కూతురునని, జగనన్న చెల్లెల్ని అని షర్మిల మొదట పరిచయం చేసుకున్నారు. అనంత చాలా కరువు జిల్లా అని అందుకే వైయస్ ఈ ప్రాంతానికి జలయజ్ఞంలో ప్రత్యేకంగా మేలు చేయాలని అనుకున్నారన్నారు.
సాగు నీరు, తాగు నీరు ఏర్పాటు చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి మూడో పార్టీని రానివ్వవద్దని చూస్తున్నాయని ఆరోపించారు. జగన్ బయట ఉంటే తమకు మనుగడ ఉండదని భావించే ఆ రెండు పార్టీలు కలిసి కుట్రతో కేసులు పెట్టి జైలుకు పంపించాయని ఆరోపించారు. ఇప్పుడు బెయిల్ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇది అన్యాయం కాదా అని ఆమె ప్రశ్నించారు.
జగన్ ఎప్పుడు ప్రజల సమస్యల పట్ల స్పందించారని, అందుకోసం నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారన్నారు. కుటుంబంతో కంటే ప్రజలతోనే ఎక్కువగా గడిపారన్నారు. అలాంటి వ్యక్తిని జైలుకు పంపించారన్నారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు. ఒకరోజు వస్తుందని, ఆ రోజు జగన్ వస్తాడని, ఆ రోజు రామరాజ్యం దిశగా నడిపిస్తారన్నారు. ఆ రోజే రాజన్న కోరిక నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలోని సమస్యలు తీరుస్తారన్నారు.
రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా అందరికీ సొంత ఇల్లు వస్తుందని, వ్యవసాయంపై అరవై శాతం మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బడ్జెట్‌ను స్టెబులైజేషన్ ఫండ్‌గా ఉంచుతారని, వడ్డీలైని రుణాలను రైతులకు మహిళలకు ఇస్తారని, పిల్లల్ని చదివించేందుకు 'అమ్మ' అకౌంట్లో పదో తరగతి వరకు రూ.500, ఇంటర్ వరకు రూ.700, డిగ్రీ స్థాయికి రూ.1000 డబ్బులు ఇస్తారన్నారు. పెన్షన్‌ను రూ.1000కి పెంచుతారన్నారు. జగన్‌ను అందరూ ఆశీర్వదించి పార్టీని బలపర్చాలని ఆమె కోరారు. తనతో పాటు కలిసి నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి కదం తొక్కాలన్నారు.
                  

పూరి పై పవన్ కొపం???                                                                                                                                                                       కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేస్తున్న రచ్చ చూస్తుంటే.. విడుదలకు ముందు నుంచి ఉన్న గొడవలకీ ఇప్పటి రచ్చకీ సంబంధం ఉందనిపిస్తోంది. రిలీజ్ కు ముందే నిర్మాత దానయ్యకూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు మధ్య గొడవైంది. పూరీకివ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వనంటూ అప్పట్లో దానయ్య అడ్డం తిరిగాడు. దీంతో పూరీ ఫిలించాంబర్ లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో హీరో పవన్ కళ్యాణ్ కూడా ప్రొడ్యూసర్ నే సపోర్ట్ చేశాడు. అయితే చివరికి ఎలాగోలా సెటిల్ చేసి సినిమా రిలీజ్ చేశారు. అయితే అప్పటి గొడవకు కూడా సినిమా అవుట్ పుట్, పొలిటికల్ ఇష్యూలే కారణమేమో అన్న డౌట్లు మొదలయ్యాయి. రాంబాబు సినిమా విషయానికొస్తే... పూర్తిగా పొలిటికల్ స్పూఫ్ లా కనిపిస్తుంది. పూరీ జగన్నాథ్ తన భావజాలాన్ని స్క్రీన్ పై అడ్డంగా రుద్దేసినట్టు అనిపిస్తుంది. అసలిలాంటి స్టోరీని పవర్ స్టార్ ఎలా ఒప్పుకున్నాడన్నది అర్ధం కాని అంశం. గబ్బర్ సింగ్ లాంటి బంపర్ హిట్ తర్వాత పవన్ నించి ఇలాంటి సినిమాని ఊహించలేం కూడా. అసలు స్టోరీ చూడకుండానే ప్రొడ్యూసర్ దానయ్య, పవన్ కళ్యాణ్... పూరీకి జెండా ఊపేశారేమో అన్న డౌట్లు వస్తున్నాయి. పొలిటికల్ గా అయిన రగడ తప్ప రాంబాబు సినిమాకొచ్చిన రెస్పాన్స్ అంతంతమాత్రమే. తన భావజాలాన్ని తెరపై జొప్పించి అటు ప్రొడ్యూసర్ నీ, ఇటు హీరోనీ నొప్పించాడు పూరీ జగన్నాథ్. మొత్తానికి రాంబాబు సినిమాతో పూరీ లో ఓ కొత్త కోణం బైటపడింది. తను అందరూ అనుకునేటంత జోవియల్ టైప్ కాదని తేలిపోయిందంటున్నారంతా. ప్రొడ్యూసర్ డబ్బుల్నీ, పవన్ ఇమేజ్ ని పణంగా ఇలాంటి సినిమా తీయడంపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. తన సోది చెప్పడానికి ఇద్దర్నీ, డైరెక్టర్ అడ్డంగా వాడేసుకున్నాడంటున్నారంతా..    పూరి  పవన్ కి  చెప్పిన  స్టొరీ ని  పూర్తీ  గా తీయాలేదని ,టాక్                       

Friday, 19 October 2012

పవన్ కళ్యాణ్ సినిమాపై నిప్పులు చెరుగుతున్నాతెలుగుదేశం పార్టీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామేన్‌ గంగతో రాంబాబు సినిమా రాజకీయ రంగు పులుముకుంటోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సినిమాపై నిప్పులు చెరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా  చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో పవన్ కళ్యాణ్ సినిమాపై పార్టీ కార్యకర్తలు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు.పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను, కెమెరామేన్ గంగతో రాంబాబు పోస్టర్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చించేసి, వాటిని దగ్ధం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు పాదయాత్రపై సినిమాలో సెటైర్లు ఉన్నాయని, ఉద్దేశ్యపూర్వకంగానే అందులో ఆ సంభాషణలు పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని పాత్రల పేర్లు కూడా చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను పోలి ఉన్నాయని వారన్నారు. సినిమాలోని సెటైర్లను తొలగించకపోతే కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.