నాగబాబు పవన్ మీద చేసిన వాఖ్యలు ను వక్రిస్తున్నదేవారు ?
ఈమధ్య మెగా ఫ్యామిలీ మీద బురద చల్లే వారి సంఖ్య పేరిగిపోతుంది.. ఆంధ్రజ్యోతి t.v. చానల్ లో ఇంటర్వ్యూలో నాగబాబు మాటలడిన మాటలు ను కొందరు కావాలని వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు
అసలు నాగబాబు మాట్లాడిన మాటలు చూస్తే ..... నాగబాబు తన అన్న చిరంజీవి గురించి మాట్లాడుతూ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన 24 సంవత్సరాల యువకుడు, ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా కేవలం స్వయంకృషి తో మెగాస్టార్ గా ఎదిగిన ఘనత చిరంజీవి సొంతమని అంటూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలలో ఓడిపోయినా18% ఓట్లతో తన స్థాయి ఏమిటో నిరూపించుకునీ ఒక జాతీయ పార్టీని ఆకర్షించడమే కాకుండా ఆ పార్టీ ఆహ్వానం మేరకు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపినా ఒక కీలక శక్తిగా ఇప్పటికీ చిరూ రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతున్నాడని అని అంటూ, ఇటువంటి స్థాయికి అందుకోగల నటుడు ఇప్పుడు ఎవరున్నారు అని అనడమే కాకుండా పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లుఅర్జున్ లకే కాకుండా తనకూ తన పిల్లలకూ కూడా చిరంజీవి ఆనాడు ఈనాడు రేపుకుడా గాడ్ ఫాదర్ గానే ఉంటాడు అని అన్నాడు. ఈ మాటలు లో తప్పు ఎమ్మన్నా ఉందా?
చిరంజీవి లేకుండా తమ కుటుంబమే లేదు అంటూ తన అన్న పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు నాగబాబు.దీన్ని కొందఱు వక్రీకరించి పవన్ ని నాగబాబు తక్కువ చేసి మాట్లాడడాని పుకారులు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు..