Sunday, 10 November 2013

ఒక పుస్త‌కం రాస్తే 230 కోట్లు ??

ఎవ‌రైన ఒక పుస్త‌కం రాస్తే…మ‌హ డిమాండ్ వుండే 50 ల‌క్ష‌లు రావ‌డం గొప్ప‌. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ సెలబ్రెటి జీవిత చ‌రిత్ర అయిన కోటి రూపాయ‌లు ప‌ల‌క‌డం గ్రేటే. అటువంటిది ఏకంగా ఒక హీరోయిన్ జీవిత క‌థ రాసుకుంటే.. ప‌బ్లీష‌ర్స్ పోటీ ప‌డి దాదాపు 230 కోట్లు ఇస్తామ‌ని వెంట ప‌డ‌టం ఏమిటి. ..? హాలీవుడ్ లో ఇంత వ‌ర‌కు ఏ ఫిల్మ్ సెలిబ్రిటీ జీవిత చ‌రిత్ర కు క‌నీ విని ఎర‌గ‌ని రీతిలో ధ‌ర ప‌ల‌క‌డం వెన‌క అస‌లు విష‌యం ఏమిటి …? ఒక హీరోయిన్ కు ఇంత డిమాండా..? అస‌లేంటి.. ? అంత గొప్ప‌ద‌నం..ఏముంద‌ని పబ్లిష‌ర్స్ ఆమే రాసుకున్న అత్మ‌క‌థ‌కు పోటీ ప‌డి ధ‌ర పెంచుతున్నారు. …? విష‌యం లేక‌పోతే.. అంత‌గా వెంట ప‌డ‌తారంటారా. నో వే క‌దా.?
అస‌లిదంత ఎవ‌రి గురించి అనుకుంటున్నారా.. ? హాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎంజెలీనా జోలి గురించండోయ్.. హాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా పేరున్న ఈ స్టార్ హీరోయిన్ అత్మ క‌థ కే ప‌బ్లిష‌ర్స్ 230 కోట్లు పే


చేయ‌డానికి పోటీ ప‌డుతున్నారు. తండ్రి న‌టజాన్ వాగిట్ న‌ట వార‌సురాలిగా హాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ఎంజెలీనా.. రెండు వేల ఒక‌టిలో చేసిన టూంబ్ రైడ‌ర్స్ సినిమా ..జోలిని ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ ని చేసింది. ఈ చిత్రం తో జోలి.. హాలీవుడ్ యాక్ష‌న్ హీరోల‌కు పోటీ గా క్రేజ్ ను గెయిన్ చేసింది. ఆ త‌రువాత అదే కంటిన్యూ చేసింది. ఈ చిత్రం త‌రువాత బియాండ్ బోర్డ‌ర్ … స్కై కెప్ట‌న్ ఆఫ్ ది వ‌ర్క్ ఆఫ్ టుమారో .. ఈ మ‌ద్య వ‌చ్చిన సాల్ట్ సినిమాలు .. జోలిని తిరుగులేని స్టార్ గా నిల‌బెట్టాయి. న‌టిగా అద్భుతాలు చేసిన ఎంజెలిన‌..వ్య‌క్తిగ‌తంగా కూడా ఎన్నో సేవా క్యార్య క్ర‌మాలు చేయ‌డ‌మే ఆమేకు ప్ల‌స్ పాయింట్. ఆమే న‌టిగా కంటే ఆమే చేస్తోన్న స‌మాజ సేవకు అభిమానులు ఎక్కువ‌. స్టైల్స్ ప‌రంగా కూడా ఒక స్టైల్ ఐకాన్ ..ఇలా వ‌ర్స‌టైల్ ప‌ర్స‌న్ కాబ‌ట్టే… ఆమేకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ మ‌రి. అందుకే ఆమే ఆత్మ‌క‌థ కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌ని ప్ర‌చుర‌ణ క‌ర్త‌ల గ‌ట్టిన‌మ్మ‌కం. అయితే ఏంజెలినా మాత్రం ఇంకా త‌న పుస్త‌కానికి ధ‌ర పెరుగుతుంద‌ని వెయిట్ చేస్తుంది. 

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .