Tuesday, 4 September 2012

టాలీవుడ్‌లో 30% వాటా కోరిన తెలంగాణ బోర్డు

ఇటీవల కాలంలో రెండు సమ్మెలు, మరియు వరస ఫ్లాపులతో సతమతమవుతున్న తెలుగు చిత్రపరిశ్రమకు త్వరలో మరో ఎదురు దెబ్బ తగలనుంది, అదీ తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రూపంలో. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ త్వరలో తెలంగాణా ప్రాంతములోని అన్ని నిర్మాణ, పంపిణీ సంస్థలకు మరియు థియేటర్ యాజమాన్యాలకు లేఖలను సంధించనుంది. ఆ లేఖల సారాంశము, తెలంగాణా ప్రాంతమునకు చెందిన వారకు 30 నుంచి 40 శాతము ఉద్యోగావకాశములు కల్పించమని. అంటే 20 మంది పనిచేయుచున్న ఒక నిర్మాణ సంస్థలో కనీసము 7 నుంచి 8 మంది తెలంగాణా వారై వుండాలి.

"మేము తెలంగాణా ప్రాంతములోని అన్ని నిర్మాణ సంస్థలను, పంపిణీ సంస్థలను, మరియు అన్ని థియేటర్ యాజమాన్యాలను తెలంగాణా ప్రాంతీయులకు ఉపాధి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. 1985 తర్వాత ప్రారంభించబడిన అన్ని సంస్థలు ఇతర ప్రాంతీయులను దిగుమతి చేసుకున్నాయి కాబట్టే ఇపుడు తెలంగాణా ప్రాంతీయులకు అధిక ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా కోరడమైనది" అని తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ విజయేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణేతర ఎగ్జిబీటర్ల వ్యతిరేక ఉద్యమం గత కొద్ది కాలంగా ఊపందుకొంటున్నది. థియేటర్లను లీజుకు తీసుకున్న వారిలో 70 నుంచి 80 శాతం మంది తమ లీజులను పొడిగించుకొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం మాత్రం ఖచ్చితంగా వేర్పాటు వాదుల ఆగ్రహావేశాలకు బలి కాకూడదనే. "ఒక వేళ మే-జూన్ నెలలో ప్రత్యేక తెలంగాణాను ప్రకటిస్తే, తీవ్రంగా నస్టపోయేది మేమే. ఎటువంటి రిస్క్ తీసుకోము. లీజులను పొడిగించటం కంటే వేచి చూడడం ఉత్తమం" అని అన్నారు తెలంగాణా ప్రాంతంలో 40 పైన థియేటర్లను లీజుకు తీసుకున్న ఒకతను.

శ్రీ విజయేందర్ రెడ్డి దీనికి మరో విధంగా స్పందించారు, "అధిక నస్టాలతో 60 నుంచి 70 థియేటర్లు మూత పడిన మాట వాస్తవమే కాని మా ఫోకస్ అంతా పెద్ద పెద్ద నిర్మాణ మరియు పంపిణీ సంస్థల పైనే, ఒక్కొక్క ఆఫీసులో కనీసం 20 నుంచి 25 మందిదాకా పనిచేస్తుంటారు" అని అన్నారు. డాన్సర్లు, ఫైటర్లు, లాంటి నైపుణ్యముతో కూడిన ఉద్యోగాలపై ఎటువంటి ప్రభావము వుండబోదని ముక్తాయించారు.

డెక్కన్ క్రానికల్ సౌజన్యంతో

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .