Wednesday, 27 February 2013

సినీ నటీ ఫై అత్యాచారం?

. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్న ఒక వర్ధమాన నటిపై స్పాట్‌బాయ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను ఫైనాన్షియర్‌నని, పెద్ద బ్యానర్ల చిత్రాల్లో పాత్రలు ఇప్పిస్తానంటూ స్పాట్‌బాయ్‌ ముస్తఫా మసూద్‌ అలీ ఖాన్‌ (23) ఆమెను నమ్మించి రేప్ చేసాడు. అయితే పోలీస్ లు అతన్ని అరెస్టు చేసారు. ఈ విషయమై గోరెగావ్‌ ఇన్‌స్పెక్టర్‌ రేకుల్‌వాడ్‌ మాట్లాడుతూ.. ఆమె సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తోంది. పాత్రకు రూ.50 వేలు కావాలనుకుంటోంది. ఇందుకోసం ముస్తఫా అంగీకరించాడు. బదులుగా తన లైంగిక వాంఛలను తీర్చుకోవాలనుకున్నాడు. వాషికి చెందిన ఈ నటి గోరెగావ్‌ స్టూడియోలో ముస్తఫాను కలుసుకుంది. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అయిదుసార్లు అత్యాచారం జరిపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముస్తఫాను అరెస్టు చేశారు.

Saturday, 16 February 2013

ప్రచారానికి దూరంగా జూనియర్ ఎన్టీఆర్:ఎందుకు??

ఎన్టీఆర్  కీ ఇటీవల కాలంలో పెద్దగా ప్లాపులు  లేవు, మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ  జూనియర్ విషయంపై ప్రచారం తగ్గడం ఆయన సన్నిహితుల్లోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు.స్టార్ హీరోల పేర్లు నిత్యం మీడియాలో ఉంటాయి. వారేం చేసినా, చేయకపోయినా వార్త అవుతుంది. అయితే టాలీవుడ్ విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఈ మధ్య అంతగా వినిపించడం లేదు..ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ బాద్‌ షా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తన సినిమా వస్తున్న టైమ్ లో కూడా ఎన్టీఆర్.. తోటి హీరోల మాదిరిగా పెద్గగా హడావిడి చేయడం లేదు. మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, ప్రభాస్ వంటి హీరోలతో పోలిస్తే జూనియర్ ప్రచారానికి దూరంగానే ఉంటున్నాడు. మహేష్‌, చరణ్‌ నటించిన చిత్రాలు మార్కెట్లో ఉండడమే కాకుండా, ఏదో ఒక కారణం చూపుతూ వారు ప్రేక్షకుల మధ్యకు వెళుతున్నారు. కార్పోరేట్‌ సంస్థలకు అంబాసిడర్‌గా కూడా వారు చాలా ముందున్నారు. వారితో పోలిస్తే జూనియర్‌ కొంత వెనకపడ్డారని ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి సహజమని, వీటన్నింటికి సినిమా హిట్సే సమాధానం చెబుతాయని వాదించే వారూ ఉన్నారు. ..

ప్రేమేకులు రోజు రానా ఎక్కడ ఉన్నాడు ??





 త్రిష ఎమ్మెస్ రాజు తో రమ్ సినిమా చేస్తోంది. ఇందులో త్రిషతోపాటు చార్మి, నికిషా పటేల్, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఈ నలుగురూ మంచి స్నేహితులైపోయారట. సో, ప్రేమికుల రోజు నేపథ్యంలో త్రిష మిగతా ముగ్గురికీ రెండురోజుల కిందట పార్టీ ఇచ్చిందట. అందులో ముగ్గురూ చాలా ఎంజాయ్ చేశారట. అయితే, ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా త్రిషకి పార్టీ ఇవ్వడానికి దుబాయ్ కి ఒక ప్రత్యేక వ్యక్తి వెళ్లాడట. అతగాడు వెళ్లింది త్రిష కోసమేనట.ఇంతకీ అ రోజు  రానా ఎక్కడ ఉన్నాడు ??

: ఏడ్చిన ఆస్కార్?l

జోహన్నస్‌‍బర్గ్: ప్రియురాలిని దొంగగా భావించి తుపాకితో కాల్చి చంపిన దక్షిణాఫ్రికాకు చెందిన ఒలింపిక్ అండ్ పారాలింపిక్ అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ కోర్టులో ఏడ్చాడు. బ్లేడ్ రన్నర్ అస్కార్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. విచారణ సమయంలో పిస్టోరియస్ ముఖానికి చేతులు పెట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. దంతో జడ్జి అతనిని ఊరడించి విచారణ ప్రారంభించాడు. రీవాను తాను హత్య చేయలేదని, పొరపాటున జరిగిందని చెప్పాడు. అమ్మాయిల పిచ్చి అందరూ అనుకుంటున్నట్టు పిస్టోరియలస్ అంత ఉత్తముడేమీ కాదని ఆయన మాజీ ప్రియురాలు సమంత టేలర్ గత ఏడాది ఓ సందర్భంలో చెప్పింది. పిస్టోరియస్‌తో సమంత ప్రేమాయణం కొద్దిరోజులు కొనసాగింది. ఆ తర్వాత బెడిసికొట్టింది. ఆ తర్వాత పిస్టోరియస్ రీవాతో ప్రేమలో పడ్డాడు. రీవా మృతి అనంతరం సమంత స్పందిస్తూ... అస్కార్ అమ్మాయిలకు దూరంగా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంటుందని, ఆ సమయంలో అతనితో ఆమె కాకుండా మరెవరో ఉండి ఉండవచ్చునని సందేహం వ్యక్తం చేసింది. అస్కార్‌కు అమ్మాయిల పిచ్చి అని సమంత చెప్పకనే చెప్పింది. అస్కార్ గర్ళ్ ఫ్రెండ్స్ లిస్టులో రీవా, సమంతలతో పాటు జెన్నా ఎడ్కిన్స్, అనస్తాసియా కోజిసోవా, మెలిస్సా రోమ్, చానెల్లీ డుప్లెసిస్.. ఇలా పెద్ద జాబితానే ఉందట. అతనికి అమ్మాయిలతో పాటు బైక్, రేసు కార్ల పిచ్చి కూడా ఉందట. అతనికి ఫాస్ట్ కార్లంటేనే ఇష్టం. అస్కార్‌కు వేగంగా దూసుకెళ్లే కార్లంటే ఇష్టమని ట్రయినర్ జానీ బ్రూక్స్ తెలిపారు. కాగా ఫిబ్రవరి 14న ప్రియుడి చేతిలో మృతి చెందిన రీవా ప్రేమికుల దినోత్సవం రోజు ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ప్రేమ కోసం ఈ రోజు మీరెలాంటి సర్ ప్రైజ్ చేయబోతున్నారని ట్వీట్ చేసింది. అదే రోజు పిస్టోరియస్‌ను ఆటపట్టించబోయి హత్య గావించబడింది.

Friday, 15 February 2013

వీణామాలిక్ ఓవర్ డోసు



 వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్‌ నటీమణి వీణామాలిక్. ఈమె 'డర్టీ పిక్చర్స్‌' కన్నడ వెర్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం బరువు పెరిగిన ఈమె తాజాగా బరువు తగ్గి తన తదుపరి చిత్రం ది సిటీ దట్ నెవర్ స్లీప్స్ చేస్తోంది. దాంతో తను బరువు తగ్గాననే విషయం ప్రపంచానికి, ముఖ్యంగా సినీ ప్రపచానికి తెలియచేసేందుకు ఫోటో షూట్ చేయించుకుని మీడియాకు వదిలింది. విద్యాబాలన్‌ హీరోయిన్ గా, ఏక్తాకపూర్‌ నిర్మించిన 'డర్టీ పిక్చర్స్‌'తో కన్నడ చిత్రం ప్రవేశం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కోసం ఎటువంటి వేషానికైనా రెడీ అంటుంది. ఎటువంటి వివాదానికైనా సై అంటుంది. ఇక దక్షిణ భారత కథానాయిక, ప్రముఖ నర్తకి సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్క్రిప్ట్‌ను వినగానే వీణామాలిక కన్నీరు కార్చానని చెప్తోంది. భారతీయ ఆచార వ్యవహారాల గురించి, సంప్రదాయాల గురించి, సిల్క్‌ స్మిత లైఫ్‌ స్కెచ్‌ను వీణామాలికకు త్రిశూల్‌ వివరించి ఆమెను ఎడ్యుకేట్‌ చేసి మరీ ఈ చిత్రంలో నటింపజేయడం విశేషం. వీణామాలిక నటించే సన్నివేశాలను పూర్తి చేసేందుకు త్రిశూల్‌కు 30 రోజులు లభించాయి,

Wednesday, 13 February 2013

గ్లామర్ తో కేక పుట్టిస్తున్న తెలుగమ్మాయి ?



 మహేష్ తో కలిసి హిట్  దూకుడు కొట్టిన సోనియా...ఈ  హాట్ లుక్ తో   ఆడియోన్స్స్ నీ ఆకట్టుకుంధీ  ... రోజు రోజుకీ పోటీ పెరుగుతోంది. కొత్త హీరోయిన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్నారు. ఈ నేపధ్యంలో కొద్దిగా ఆమె కండిషన్స్ సడలించుకుని దర్శక,నిర్మాతలకు సహకరిస్తోంది.

Monday, 11 February 2013

అనుష్క‘రుద్రమదేవి’ లో రానా??


అనుష్క కు జోడీగా రానా ఎంపిక అయ్యాడు. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుద్రమదేవిగా అనుష్క నటిస్తుండగా, ఆమెకు జోడీగా దగ్గుబాటి రానా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘నిరవర్ద్యపురం (ఇప్పటి నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడితో రుద్రమదేవి వివాహం జరిగినట్లు చరిత్ర చెపుతుంది, ఈ యవరాజు పాత్రకు రానా ఖచ్చితంగా సరిపోతాడని’ చెప్పారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నటి అంజలి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.