Monday, 11 February 2013

అనుష్క‘రుద్రమదేవి’ లో రానా??


అనుష్క కు జోడీగా రానా ఎంపిక అయ్యాడు. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుద్రమదేవిగా అనుష్క నటిస్తుండగా, ఆమెకు జోడీగా దగ్గుబాటి రానా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘నిరవర్ద్యపురం (ఇప్పటి నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడితో రుద్రమదేవి వివాహం జరిగినట్లు చరిత్ర చెపుతుంది, ఈ యవరాజు పాత్రకు రానా ఖచ్చితంగా సరిపోతాడని’ చెప్పారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నటి అంజలి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.

త్రిష తొలి యాక్షన్ చిత్రం?

త్రిష కెరీయర్ లో ఇది తొలిసారి..!
ప్రసుత్త కాలంలో ఏ హీరోయిన్ కు లేని గొప్పతనాన్ని త్రిష దక్కించుకుంది. దాదాపుగా పది సంవత్సరాలుగా త్రిష కు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఎంత మంది కొత్త భామలు వచ్చి తమను నిరూపించుకున్నా త్రిష స్థానం పదిలంగానే ఉంది. అమెకు అవకాశాలు వస్తున్నాయి. యంగ్ హీరోల నుంచి, ప్రమఖ నిర్మాణ సంస్థల నుంచి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇది త్రిష ఘనతగా చెప్పుకోవచ్చు. ఇటీవల ఏ హీరోయిన్ కూడా ఇంతకాలం పరిశ్రమలో నిలబడలేదు.  కాగా, త్రిష ప్రస్తుతం ‘రమ్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష యాక్షన్ లేడీ గా కనిపించనుంది. ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో త్రిష నటిస్తుంది. త్రిష ఇప్పటి వరకూ యాక్షన్ సన్నివేశాల్లో నటించలేదు. ఇలా నటించడం త్రిష కెరీయర్ లో తొలిసారి అని చెప్పుకోవాలి. ఈ ‘రమ్’ చిత్రం కోసం త్రిషపై యాక్షన్ సన్నివేశాలను దుబాయ్, మస్కట్ లలో ఫైట్ మాస్టర్ విజయన్ నేతృత్వంలో చిత్రీకరించారు. కథానాయిక ప్రాధాన్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ లేడీ గా త్రిష నటన అందర్నీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ దీమాగా ఉంది. ఈ సినిమాలో నికీషా పటేల్, ఇషా చావ్లా, చార్మి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Friday, 8 February 2013

త్రిష పై పోలీస్ కేసు ?


ఎప్పుడూ తప్పతాగి ఒళ్లు తెలియకుండా వివాదాలకు కాలుదువ్వే త్రిష అందరికీ తెలుసే. పలు మార్లు స్నేహితులతో కలిసి తాగి తందనాలాడి వివాదాలు కొని తెచ్చుకుంది. ఎప్పుడూ పబ్బులు, క్లబ్బుల చుట్టూ తిరిగే త్రిష తాగడం అంటే తనకు ఎంత ఇష్టమే తనే తేల్చిచెప్పింది. తాను నటించే సినిమాలలో తాను మందు తాగి ఊగిపోయే సన్నివేశాలలో నటించడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పేసింది. అంతటింతో ఆగకుండా తన సినిమాల్లో మందు కొట్టే సన్నివేశాలు లేకుంటే చిత్ర నిర్మాత, దర్శకులను అడిగి మరీ అలాంటి సన్నివేశాలు ఉండేలా చూసుకుంటానని చెప్పింది.
అయితే ఈ తాగుడు వెనుక ఓ సెంటిమెంటు ఉందని కూడా చెబుతోంది చెన్నయ్ బ్యూటీ. తాను కనుక మందు కొట్టే సన్నివేశంలో నటించానంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టంట. అందుకే వెంటబడి మరీ ఆ సన్నివేశాలు పెట్టాలని కోరుతుందట. తాజాగా విశాల్ సరసన త్రిష నటించిన తమిళ చిత్రం “సమర్” హిట్టయిందట. అందులో త్రిష మందు కొట్టే సన్నివేశాలు ఉన్నాయట. ఈ చిత్రం తెలుగులో వెంటాడు..వేటాడు పేరుతో విడుదలవుతుంది. సో ఇక నుండి త్రిష తాగి ఊగే సన్నివేశాలు మనకు బాగానే కనిపిస్తాయన్నమాట.
త్రిష చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు హిందూ మన్నాయి పార్టీ మండిపడుతోంది. . ఆ పార్టీ వారు ఆమెకు క్షమాపణ డిమాండ్ చేస్తూ ఉత్తరం రాసారు. ఇలాంటి సెలబ్రేటీలు చేసే వ్యాఖ్యాలు హిందూ స్త్రీలపై ప్రభావం చూపిస్తాయని, స్త్రీల త్రాగుడుని ఎంకరేజ్ చేస్తున్నట్లు ఉందని వారు నిరసన వ్యక్తం చేసారు. ఇక త్రిష నేటి తరం యువతులు మద్యం సేవించడం మీద మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే 'ఇలాంటి వివాదాస్పద ప్రశ్నకు సమాధానం చెప్పలేను' అంటూ సమాధానం దాటవేసింది. . తొలుత నాకు 'వేటాడు వెంటాడు' కథ వినిపించనప్పుడు 'నటించాలా..?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇందులో ఒక సందర్భంలో నాకు నెగటివ్‌ షేడ్స్‌ కనిపించాయి. ఆ స్క్రిప్ట్‌ చూడగానే వెంటనే అంగీకరించాలని అనుకున్నాను. గత చిత్రాలతో పోల్చితే ఇది సవాల్‌తో కూడుకున్నది. విశాల్‌ సరసన తొలిచిత్రమే కాసులవర్షం కురిపించడం ఆనందంగా ఉంది.

మిర్చిసినిమా లో వీనీపించనీ దేవేశ్రీ గొంతు ???

కొన్ని గీతాల్లోని దేవీ వాయిస్ ట్రాక్ ని మార్చారన్న ప్రచారం ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మీడియాలో ‘మిర్చి’ గీతాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం ఆడియో మొదలైన దగ్గర్నుంచీ వివిధ టీవీ ఛానెళ్లలో దాదాపు అన్నిపాటలూ వినిపిస్తున్నాయి. వీటిల్లో అత్యధిక గీతాలకు దేవీశ్రీప్రసాద్ గొంతే వినిపించేది. అయితే, గడచిన మూడు నాలుగు రోజుల నుంచి దేవీ గొంతు మారిపోయింది. ఇంతవరకూ దేవీ పాడిన పాటలే వేరే గాయకులు ఆలపించిన క్లిప్స్ ప్రసారం అవుతున్నాయి. ఇంతకీ ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసా..? ‘మిర్చి’ ట్రైలర్ విడుదల అయ్యాక అన్ని గీతాలకూ దేవీ గొంతు సరిపోదు అన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. అది ఆనోటా ఈనోటా ఈ చిత్ర యూనిట్ కి చేరేసరికి ఇన్నాళ్లు పట్టింది. ముఖ్యంగా మెలడీల్లో దేవీ గొంతు బాలేదని చాలామంది ఘాటుగా విమర్సించారు.

Thursday, 7 February 2013

మస్కట్లో రమ్’ బ్యూటీలు.... ఫస్ట్‌లుక్

రంభ, ఊర్వశి, మేనక.... మూడు పేర్లను కలగలిపి ముగ్గురు భామల అందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించే కాన్సెప్టుతో రూపొందుతున్న సినిమా రమ్(RUM). ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రంభగా త్రిష, మేనక పాత్రలో ఇషా చావ్లా, ఊర్వశి పాత్రకు నికీషా పటేల్ చేస్తుండగా... మరో ప్రత్యేక పాత్రలో హీరోయిన్ చార్మి నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ దుబాయ్, మస్కట్లో జరుగుతోంది. షూటింగు స్పాట్లో ఈ నలుగురు భామలు కలిసి కెమెరా ముందు ఇలా ఫోజు ఇచ్చారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో విడుదల కానుంది. నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజు ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి.

జూ ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువే : పబ్లిసిటీ కోసం కాజోల్ తాపత్రయం



నాయక్ లో కాజోల్ కన్నా అమల కి ఎక్కువ పెరు రావటం తో  పబ్లిసిటీ కోసం కాజోల్ తాపత్రయం  పడుతుందీ......ఇంతకు ముందు కూడా ఫ్లాప్ సినిమా లు వచ్చినప్పుడు కాజల్ తన నడుము పైభాగాన్ని పూర్తి నగ్నంగా చూపించి బాలీవుడ్ కుర్రకారు మతి పోగొట్టింది.అలా ఎందుకు చేశావ్ అంటే... తన వక్షోజాలకు ఆచ్ఛాదన ఉందనీ, ఫోటోగ్రాఫర్ అత్యంత చాకచక్యంగా అక్కడేమీ లేనట్లుగా తీశాడని దబాయించింది. ఓ ఆంగ్ల అంతర్జాల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.... ‘నేను ఇష్టపడే తెలుగు హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. అతడు మంచి నటుడే కాదు నిజాయితీ పరుడు. అదే విధంగా అతనికి పొగరుకి కాస్త ఎక్కువే. అహం భావం అనేది నిజాయితీలో ఓ భాగం. అందుకే అతనంటే నాకు ఇప్పటికీ ఇష్టం' అని వ్యాఖ్యానించింది కాజల్. మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు కాజల్ పై విధంగా సమాధానం ఇచ్చింది. అదే విధంగా తమిళంలో విజయ్‌ తన ఫేవరెట్‌గా పేర్కొంది. ఇంకా పలు విషయాలను వెల్లడిస్తూ తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు పరిశ్రమ అంటేనే ఇష్టమని, ఇక్కడ హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ తమిళ పరిశ్రమలో హీరోకి ఉన్నంత రెస్పెక్ట్ హీరోయిన్‌కి ఉండదు అని చెప్పుకొచ్చింది కాజల్.

సిటీ సెంటర్ మాల్ లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్

పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ బుధవారం నాడు హైదరాబాద్ లోని సిటీ సెంటర్ మాల్ లో జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.