Friday, 29 March 2013

సినిమా మొత్తం వర్షం లో ...

సినిమా  మొత్తం  వర్షం లో ...సినిమాల్లో వర్షం పాటలు వుండటం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అయితే, ఇప్పుడు ఏకంగా ఒక సినిమా మొత్తం వర్షం నేపథ్యంలో రూపొందుతోంది. గతం లో  '1940లో ఒక గ్రామం' చిత్రాన్ని రూపొందించి, జాతీయ అవార్డు అందుకున్న నరసింహ నంది ఇప్పుడీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  శివాజీ కథానాయకుడుగా నటిస్తున్నారు.

'మొదటి ఫ్రేం నుండి చివరి ఫ్రేం వరకూ సినిమా మొత్తం వర్షం బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఈ సినిమాకు ఇది పెద్ద విశేషం. కథ అటువంటిది. సినిమా సహజత్వంతో సాగుతుంది. నిజజీవితానికి దగ్గరగా వుండే పాత్రలే ఇందులో కనిపిస్తాయి' అని దర్శకుడు అంటున్నారు. మే నెలలో చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది.

Saturday, 23 March 2013

కొత్త డైరెక్టర్ కీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్ ...??

కొత్త డైరెక్టర్ కీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్ ...
కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంలో మిగ‌తా హీరోల‌కంటే రామ్‌చ‌ర‌ణ్ ఓ అడుగు ముందే వున్నాడు. ర‌చ్చ‌తో సంప‌ద్‌నందికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ప్ర‌యోగం స‌త్ఫ‌లితాన్ని ఇచ్చింది. మిర్చి చూసి కొర‌టాల శివ కు ఓకే చెప్పాడు. ఇప్ప‌డు గోపీ గ‌ణేష్ అనే కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌కి ప‌చ్చ‌జెండా ఊపాడు. గోపీ తొలి సినిమా రోమియో ఇంకా విడుద‌ల కానే లేదు. అయినా స‌రే.. క‌థ‌పై న‌మ్మ‌కంతో చ‌ర‌ణ్ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడ‌ట‌. క‌నీసం రోమియో సినిమా కూడా చూడ‌లేద‌ట‌. అందులో ఓ పాట చూశాడు. అంతే... గోపీ టేకింగ్‌పై గురి కుదిరింద‌ట‌. ఈ చిత్రానికి కె.ఎస్‌.రామారావు తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది. నిజానికి గోపీని చ‌ర‌ణ్‌కి ప‌రిచ‌యం చేసింది ఈయ‌నే. ఎవ‌డు త‌ర‌వాత సెట్స్‌పైకి వెళ్లే సినిమా ఇదే కావ‌చ్చు. ఆ తరవాత కొరటాల శివ సినిమా వుంటుంది. 

Tuesday, 12 March 2013

1000 అబద్ధాలు సినిమా కీ డైరెక్టర్ తేజ కాదా ?

రాజేంద్రప్రసాద్‌తో ‘సినిమాకెళ్దాం రండి’ చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ ‘వెయ్యి అబద్ధాలు’సినిమాను నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రం కథాంసం ఓ మాట్రమోనీ బ్యూరో చుట్టూ తిరగనుంది.ఐతే  ఈ సినిమా టైటీల్ ప్రకారం  అప్పుడే  ఒక  అబద్ధం ఫిలిం నగర్ లో ప్రచారం లో ఉందీ అదే ….ఎ ఫిల్మ్ నాట్ బై తేజ…ఫస్ట్  అబద్ధం భావుంధీ  కదా …!
సాధారణంగా…తమ చిత్రాలకు ఎ ఫిల్మ్ బై అని దర్శకుడు తన పేరు వేసుకోవటం ఆనవాయితీనే. అయితే దర్శకుడు తేజ ఈ సారి …ఎ ఫిల్మ్ నాట్ బై తేజ అనే నెగిటివ్ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సాయిరామ్ శంకర్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వెయ్యి అబద్ధాలు’ చిత్రానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం చర్చనీయాంసంగా మారింది.

ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ- ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి ‘1000 అబద్ధాలు’ అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం” అని చెప్పారు.———–పోస్ట్ బై …వెంకటేష్ గుఱ్ఱాల — (1)

పిల్లలు తో తన్నించుకున్న తమన్నా??



హిమ్మత్ వాలా లో ఒక పాట లో హీరో ,కొంత మందీ పిల్లలు తమన్నాను టీజ్జ్ చేస్తూ సరదా  గా  తంతారు … అహ  తమన్నా …ఎన్నీ తన్నులు తీన్న  సినిమా కోసమే  గా ….ఈ సీన్  సూపర్ గా చేసిందనీ బాలీవుడ్ టాక్ …బాలీవుడ్ లో  ఒక సినిమాకూడా విడుదల కాకుండానే తమన్నాకు ఆఫర్స్ వరసగా వచ్చి పడుతున్నాయి. ఆమె తాజా చిత్రం హిమ్మత్ వాలా.. ట్రైలర్స్ చూసిన బాలీవుడ్ జనం ఆమెచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాంతో తమన్నా హిందీలో మరో అవకాశాన్ని దక్కించుకొన్నట్లు సమాచారం. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించబోయే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తుందీ . హిమ్మత్ వాలా చిత్రం మార్చి 29 న విడుదల అవుతుంది. చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి హిమ్మత్ వాలా సినిమాకు మూలం టాలీవుడ్లోనే ఉంది. తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ===posted by venkatesh.gurrala

Sunday, 10 March 2013

‘సెక్స్’ అనేది పెద్ద బూతు కాదు ;తప్పుకాదు: మంచు లక్ష్మి

సినిమాల్లో కత్తులతో నరుక్కోవడం చూపిస్తే తప్పుకాదు కానీ, ఆడామగా చేయి చేయి పట్టుకొని కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే తప్పా? సెక్స్ అనేది పెద్ద బూతు అంటారు. చేయి పట్టుకోవడమే తప్పంటారు. మళ్లీ తెగ పిల్లల్ని కనేసి జనాభాను పెంచేస్తుంటారు అలాగే … ఆ మధ్య నేను ‘సెక్స్’ గురించి మాట్లాడాను అని మీరు అన్నారు.అవును నేను అప్పుడూ నిజమే మాట్లాడాను. ‘సెక్స్’ అనేది తప్పుకాదు. అజంతా, ఎల్లోరా శిల్పాలు ఓ సారి చూడండి. వాటి ద్వారా సెక్స్‌కి సంబంధించిన చాలా అంశాలు మన పూర్వీకులు చెప్పారు. వాత్సాయన కామసూత్రాలను ప్రపంచానికి అందించింది మనవాళ్లే అన్నారు. సంచలనాల కోసం నేను మాట్లాడను. నాకు నిజం అనిపించింది మాట్లాడతాను. అది మీకు నిజం అనిపించాలని నేను అనుకోను అని ఆవేశం గా మాట్లాడ్డేరు మంచు లక్ష్మి. సాక్షి తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో…… ఆమె ఇంకా  ఇలా స్పందించారు. ఇక మనకు ఇంత పాపులేషన్ ఎలా వచ్చిందండీ.. చదువు, సంస్కారం వున్న ఎవరూ సెక్స్‌ని ఒక తప్పుగా భావించరు. ప్రపంచ జనాభాలో మన దేశం రెండో స్థానంలో ఉందంటే కారణం మనవాళ్లలో ఎక్కువమంది నిరక్షరాస్యులు కావడమే. పిల్లల్ని కంటే ‘వాళ్ళెళ్లి కూలి పనిచేసుకొచ్చి మమ్మల్ని పోషిస్తారు’ అని చీప్‌గా ఆలోచించి పిల్లల్ని కనేవాళ్లు కూడా మనదేశంలో ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలితో సరిపెట్టుకొని వారికే చదువును, సంస్కారాన్ని నేర్పి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దితే మన దేశం అన్ని దేశాల్లో అగ్రగామి అవుతుంది అని వివరించారు.by venkatesh.gurrala (12)

తెలుగు వాళ్ళు నడుం మాత్రమే చూస్తారు :ఇలియానా


అందాల తార ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ లో ఒక్క హిట్  కొట్టింధో లెధో  అప్పుడే అక్టింగ్  , పెర్ఫర్మన్స్  వంటీ  పదాలు గురించే  మాట్లాడుతుంధీ … అయితే ఇంతకాలం తెలుగు లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ టాలీవుడ్ గురించి తక్కువగా మాట్లాడ్డమే అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంది. తాజాగా ఇలియానా ఒక ప్రశ్నకు సమాధానంగా ‘టాలీవుడ్ కు తన నడుము అందాలు తప్ప, తన నటన అక్కర్లేదని’ చెప్పింది. టాలీవుడ్ లో మహిళా ప్రధాన చిత్రాల్లో మీరు ఎందుకు నటించరూ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలియానా పైవిధంగా సమాధానం చెప్పింది. టాలీవుడ్ లో తన నడుం అందాలను చూపించడం తప్ప నటనకు అవకాశం ఉన్న పాత్రలతో ఇక్కడ సినిమాలు చేయలేరని తలబిరుసుతో ఇలియానా సమాధానం చెప్పింది. ఆలా ఐతె అనుష్క అరుంధతి ,బొమ్మరిల్లు ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,ఆలా హిట్ అయైయి … బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నంత మాత్రానా ఇన్నాళ్లూ కోట్లు కట్టబెట్టిన టాలీవుడ్ ను చిన్నబుచ్చుతూ మాట్లాడ్డం సరికాదని ఇలియానా తెలుసుకుంటే  మంచిదీ…posted by venkatesh.gurrala

Thursday, 7 March 2013

మహంకాళీ లో పవన్ కళ్యాణ్ పై సెటైర్లు ఉన్నాయా ??


హీరో రాజశేఖర్ హీరో గా నటిస్తున్న మహంకాళీ రేపు రిలీజ్ అవుతుందీ …ఐతే ఈ సినిమా లో పవన్ మీద కావాలనే కొన్నీ సెటైర్లూ ను రాజశేఖర్ ఈ సినిమా లో ఉంచాడు అనీ ఫిలిం నగర్ లో కొన్నీ వర్గాల టాక్ ..దీనీ కి బలమైన కారణం … గబ్బర్ సింగ్ సినిమా లో పవన్ రాజశేఖర్ ను అనుకరీస్తూ  కొన్నీ సీన్లు లో నటించటమే …దాంతో చాలా  హార్ట్ ఐన  రాజశేఖర్ ఈ  టైపు  లో రివెంజ్  తీర్చుకుంటున్నడూ …అంటున్నారు ..హీరో రాజశేఖర్ కు మెగా కుటుంబానికి ఈమధ్య విభేదాలు ముదీరీన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విభేదాలను ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో వెండితెర మీదకు తీసుకుని వెళ్లాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో రాజశేఖర్ ను అనుకరిస్తూ పవన్ కళ్యాణ్ నటించిన విషయం చిత్రం చూసిన అందరికీ గుర్తుంటుంది. ఆ సీన్ కు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ లో తనకు జరిగిన పరాభవానికి ‘మహాంకాళి’తో రాజశేఖర్ బదులు తీర్చుకోనున్నట్లు ఫిల్మ్ నగర్ లో అంతా భావిస్తున్నారు. జీవితా రాజశేఖర్ దర్శత్వంలో రూపొందిన ‘మహాంకాళి’ సినిమాలో మధురిమ హీరోయిన్ గా నటించింది.-posted by venkatesh.gurrala 

Sunday, 3 March 2013

బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్న కీ మరో పోర్న్ స్టార్

సిగ్గులేని భామల వెంట బాలీవుడ్ పరుగు
బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్న  కీ మరో పోర్న్ స్టార్ ...  ఇది  వరుకు అవకాశాలు రావలంటే  అభినయం, అందం, డ్యాన్స్... వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే ఇటీవల కాలంలో సిగ్గు పడకుండ నటింఛే   ముద్దుగుమ్మలే బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. . అందాల ప్రదర్శనకు ఏవిధమైన అభ్యంతరం చెప్పని వారి వెంటే బాలీవుడ్ పరుగులు తీస్తుంది. అందాల అరబోతకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఉంటే అనేక అవకాశాలను దక్కించుకుంటున్నారు. మల్లికా శెరావత్ విజృంభణతో ఎలాంటి హీరోయిన్ అయినా అందాల విందు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక తరువాత వచ్చిన షెర్లిన్ చోప్రా, వీణామాలిక్, పూనం పాండేలు బాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకుని వెళ్లారు. మల్లికా శెరావత్ తన అందాల ప్రదర్శనను బ్రా, బికినీలకు పరిమితం చేస్తే వీళ్ళు మాత్రం వాటిని కూడా విడిచి పెట్టేశారు. నగ్నంగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే, బాలీవుడ్ లో అందాలబోతలో మరో శకం మాత్రం సన్నిలియోన్ తో ప్రారంభమయ్యింది. పోర్న్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ సినిమాలో నటించడం ఒక విశేషంగా మారింది. సన్నిలియోన్ బాలీవుడ్ లో ప్రవేశించడంతో మిగిలిన ముద్దుగుమ్మలు బాలీవుడ్ లో నిలబడాలంటే అందాల ప్రదర్శన తప్పకుండా చేయాల్సిందే. కాగా, బాలీవుడ్ కు మరో పోర్న్ స్టార్ ను దిగుమతి చేసుకుంటుంది. శాంతి డైనమైట్ అనే పోర్న్ స్టార్ బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. ఈ 21 సంవత్సరాల పోర్న్ స్టార్ సౌరభ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్న ‘చల్ డాక్టర్ డాక్టర్ ఖైలైన్’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటిస్తుంది. తన తల్లి భారత్ లోని పంజాబ్ కు చెందిన వ్యక్తి అని ఈ తాజా పోర్న్ స్టార్ చెపుతుంది. అమితబచ్చన్, రేఖ, శ్రీదేవి, షారుఖ్ ఖాన్ తనకు ఇష్టమైన నటులని శాంతి చెపుతుంది.  మరి ఈ కొత్త పోర్న్ స్టార్ బాలీవుడ్ లో అందాల ప్రదర్శనను ఏ రేంజ్ కు తీసుకుని వెళ్ళుతుందో చూడాలి.

Saturday, 2 March 2013

స్క్రీన్ మీద రెచ్చిపొత్తున్న వీణా మాలిక్ ??





స్క్రీన్ మీద  రెచ్చిపొత్తున్న వీణా మాలిక్ ??      పాకిస్థాన్ భామ వీణా మాలిక్ తన బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ పై నగ్నంగా ఫోజులు ఇవ్వడం ద్వారా సంచలం కలిగించిన వీణా మాలిక్  ప్రస్తుతం తన నటిస్తున్న సినిమాల లో అందాల ప్రదర్శనకు మరింత పదను పెడుతూ హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోతోంది. ప్రస్తుతం వీణా మాలిక్ కన్నడంలో ‘సిల్క్ సక్కత్ హాట్' చిత్రంలో నటిస్తోంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో వీణామాలిక్ తన గ్లామర్ ను చాల ఎక్కువుగా  చూపించబోతోంది. గతంలో ఇదే కాన్సెప్టులో హిందీలో రూపొందిన ‘డర్టీ పిక్చర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెగ డర్టీగా నటించి అందరూ కేక అనేలా  చేసింది. కానీ ఇప్పుడు వీణా మాలిక్ విద్యా బాలన్ కంటే మరింత డర్టీగా నటిస్తూ సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతోంది. త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు. . ఈ సినిమా గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ... సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్‌'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్‌ కంటే తన నటన చాల గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు.

తెలుగు లో రుస్తుం గా రామ్ చరణ్ ?


తెలుగు లో రుస్తుం గా రామ్ చరణ్ ..రామ్  చరణ్ తాజాగా హిందీలో 'జంజీర్' రీమేక్ చేస్తూన్నడూ ..  ఈ చిత్రం తెలుగు వెర్షన్ కీ  ఇక్కడ ఆంద్రాలో  'రుస్తుం' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. 'రుస్తుం' టైటిల్ తో గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ 'జంజీర్' చిత్రాన్ని హిందీ వెర్షన్ కి అపూర్వ లఖియా డైరక్ట్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి మాత్రం దర్శకుడు యోగి పర్యవేక్షణలో చేస్తున్నారు. . వెంకటేష్ తో చింతకాయల రవి చిత్రం చేసిన యోగి ప్రస్తుతం బ్యాంకాక్ ో ఈ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కి నేటివిటీ కోసం ఈ దర్శకుడుని తీసుకున్నట్లు వినికిడి. ఇక ఈ చిత్రం విషయమై ప్రతీ దాన్ని చిరంజీవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్‌ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్‌ సమాచారం.






the creators choice: అనుష్క కీ పెళ్లి వయసు వచ్చిందా ??

the creators choice: అనుష్క కీ పెళ్లి వయసు వచ్చిందా ??: అనుష్క ఈ పెరె ఒక  ప్రభంజనం. కుర్రల్లొ గుండెల్లో మెరుపు ...      ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలి. లేదంటే బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముద...

అనుష్క కీ పెళ్లి వయసు వచ్చిందా ??



అనుష్క ఈ పెరె ఒక  ప్రభంజనం. కుర్రల్లొ గుండెల్లో మెరుపు ...      ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలి. లేదంటే బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరారన్న సామెత ఉండనే ఉంది. నిజానికి బ్రహ్మచారులేకాదు... బ్రహ్మచారిణులు ముదిరినా కష్టమే. అందుకే, తాను ఇంకా ముదిరిపోకముందే మేలుకోవాలనుకుంటోంది అనుష్క. అనుష్క... ఈ యోగా భామను చూస్తే రెండు పదుల్లోని పడుచులా కనిపిస్తుందిగానీ... మూడుపదులు దాటిపోయి రెండేళ్లు అయిపోయింది. ప్రస్తుతం అనుష్కకు 32 ఏళ్లు. హీరోయిన్ గా మంచి కెరీర్ నే ఎంజాయ్ చేసింది. బాగా డబ్బు సంపాదించింది. చాలా జిల్లాల్లో భూములు కొనుగోలు చేసింది. ఆర్థికంగా చాలా బాగా సెటిలయిందనే చెప్పాలి. ఇప్పటివరకూ సంపాదన, పేరుకోసమే ఆలోచించిన అనుష్క ఇప్పుడు తన జీవితంకోసం ఆలోచించిందట. ప్రస్తుతం అనుష్క రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా చెప్పాలంటే... ఆమె కెరీర్లోనే ఇవి పెద్ద చిత్రాలు. ఇందులో మొదటిది బాహుబలి. రెండేళ్లవరకూ పూర్తికాదని రాజమౌళే స్వయంగా చెప్పేశాడు. మరో చిత్రం రుద్రమదేవి. ఇది కూడా పూర్తికావడానికి ఏడాదికిపైనే పడుతుంది. అంటే... అప్పటికి అనుష్కకు 34ఏళ్లు వచ్చేస్తాయి. ఇంకా ఆలస్యం చేస్తే... రాజీపడి పెళ్లి చేసుకోవాలి తప్ప ప్రయోజనం ఉండదు.