Monday, 4 February 2013

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు జేమ్స్ బాండ్ సినిమా??

సీతమ్మ వాకిట్లో..’ విజయవంతంగా సాగుతున్న సందర్భంగా ఆదివారం నాడు మహేష్ బాబు విలేకరులతో మాట్లాడాడు. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ‘సీతమ్మ..’ చిత్రం చేస్తున్నప్పడే ఒక మంచి చిత్రంలోనే నటించిన అనుభూతి కలిగిందని చెప్పాడు. మంచి చిత్రంలో నటించాలనే ఉద్దేశ్యంతో వెంకేష్, తాను ఆ సినిమాలో నటించామని, సినిమాలపై దిల్ రాజుకు మంచి అవగాహన ఉందని, అందుకే అతనికి అన్ని విజయాలు దక్కుతున్నాయిని మహేష్ అన్నాడు. ‘ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నానని, సహజత్వంతో కూడిన ఈ చిత్ర కథ యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదని, జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని’ మహేష్ తెలిపాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు’ సినిమా మార్చి నెలలో ప్రారంభమౌతుందని, ఆ తరువాత క్రిష్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ ల దర్శకత్వంలో సినిమాలు చేస్తానని మహేష్ తెలిపాడు. అలాగే, ఆ చిత్రాలు పూర్తియ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని, కథ గురించే ఇది వరకే మాట్లాడుకున్నామని ప్రిన్స్ ప్రకటించాడు. ‘గతంలో మణిరత్నం గారు ‘పొన్నియన్ సెల్వన్’ చేద్దామన్నారు. కానీ బడ్జెట్ మరీ ఎక్కువవుతుందని, తర్వాత చేద్దామని చెప్పారు. భవిష్యత్తులో ఆ సినిమా కూడా ఉండవచ్చేమో’ అని మహేష్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. కాగా, ‘విశ్వరూపం’ వివాదంపై మహేష్ స్పందించాడు. ఆ సినిమాపై వివాదం రేగడం దురదృష్టమని, కమల్ హాసన్ కు తాను వీరాభిమానినని, అంత పెద్ద నటుడు ఓ ఇంటర్వ్యూలో అలా మట్లాడటం చూస్తే బాధ కలిగిందని మహేష్ చెప్పాడు. తెలుగు సినిమాల మార్కెట్ ప్రస్తుతం చాలా బాగుందని, హిట్ సినిమా పడ్డ ప్రతిసారీ టార్గెట్ రేంజ్ మారిపోతూనే ఉందని, అయితే పైరసీని కంట్రోల్ చేయాలని అన్నాడు.

కేంద్ర సెన్సార్ బోర్డు తాజా నిర్ణయం వివాదాస్పదం

కేంద్ర సెన్సార్ బోర్డు తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల కాలంలో అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు దేశంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వీటిని అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా సెన్సార్ బోర్టు నిబంధనలు మార్పులు చేయనున్నారు. ఐటెం సాంగ్ ఉంటే ఆ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డు యోచిస్తుంది. ఈ నిర్ణయం సినీమా వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. ఐటెం సాంగ్ ఉన్న ప్రతీ సాంగ్ కు A సర్టిఫికెట్ జారీ చేయడం అన్యాయమని, ఇలా చేస్తే సినిమా ప్రజాదరణకు, టీవిల్లో ప్రదర్శించడానికి ఇబ్బంది కలుగుతుందని చిత్రరంగానికి చెందిన ప్రముఖులు తమ వాదన వినిపిస్తున్నారు.

సన్నిలియోన్ బలుపు వ్యాఖ్యలు


‘రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం’ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ..ఆ జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన ముద్దుగుమ్మ సన్నిలియోన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అత్యాచారం నేరం కాదని, అది అనుకోకుండా జరిగే శృంగారమని సన్నిలియోన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ‘రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం’ అని సన్నిలియోన్ ట్వీట్ చేసింది. అయితే తొందరగానే ఈ ముద్దుగుమ్మ తన తప్పును గ్రహించింది. కొద్దిసేపటికే తన ట్వీట్ తొలగించింది. కానీ వేల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులు ఈ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. దీంతో సన్ని వ్యాఖ్యలపై ఇప్పుడు అంతా మండి పడుతున్నారు.

Sunday, 3 February 2013

టెన్నిస్ స్టార్ సానియా సంచలనల బయోగ్రఫీ???


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వీయ చరిత్ర రాయాలని నిర్ణయించుకుంది. ఈ జీవిత చరిత్రలో స్కర్ట్‌ల అంశంపై "ఫత్వా" మొదలు పాకిస్థానీతో పెళ్లి వరకు ప్రతిదీ పొందుపరుచనుంది. క్రీడాకారిణిగా ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న సానియా మీర్జా తన మనోభావాలను స్వీయచరిత్ర ద్వారా వెల్లడించాలనుకుంటోంది.

కెరీర్‌కు సంబంధించిన విశేషాలు, అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగిన తీరు, సంఘర్షణ... తదితర అంశాలతో పాటు తరచూ ఎదుర్కొన్న వివాదాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావన ఉంటుందని సానియా వెల్లడించింది.

తన ఆటో బయోగ్రఫీకి సానియా మీర్జా ‘అగెనైస్ట్ ఆల్ ఆడ్స్...’ (అడ్డంకులను అధిగమించి) అనే పేరును ఖరారు చేసింది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ పుస్తకం త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది.

సమంత 'బొడ్డు' లో ఎర్రటి రింగు ఎందుకు??


'జబర్‌దస్త్' ఆడియో రిలీజ్ ఫంక్షన్లో సమంత ధరించిన పలుచటి చీరలోంచి ఆమె బొడ్డుకు ఎర్రటి రింగు ఒకటి వేలాడుతూ కనిపించడాన్ని ఫోటోగ్రాఫర్లు క్యాచ్ చేశారు. ఇదిలావుంటే సమంత తన నాభీ ప్రదర్శనను ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా చేస్తోందంటున్నారు.

ఇప్పటికే జబర్‌దస్త్ స్టిల్స్‌లో ఆమె నాభీ ప్రదర్శనతో టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇదిలావుండగానే ఆడియోలో నేరుగా పలుచటి శారీలో బొడ్డందాలను చూపిస్తూ వచ్చేసరికి దీనిపై అక్కడున్నవారే గుసగుసలుగా మాట్లాడుకోవడం కనిపించింది.

ఇకపోతే సమంత ఇలా గ్లామర్ ప్రదర్శనలను చూపిస్తూ ఆడియో ఫంక్షన్లకు రావడం మామూలే. ఆమధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియోకు కూడా ఇలాగే ఆమె నడుము అందాలను చూపుతూ కూచోవడం చర్చకు తావిచ్చింది. ఐతే సమంత మాత్రం అవేమీ పట్టించుకునే దశలో లేదంటున్నారు. దీని వెనుక కారణం ఏంటయా.. అంటే ఆమె ఓ కుర్ర హీరో ప్రేమలో పీకల్లోతు పడినట్లు చెప్పుకుంటున్నారు.

Saturday, 2 February 2013

హీరోయిన్ మినీషా లాంబ బ్రెస్ట్‌ను టచ్ చేసిన హీరో ??

అర్షద్ వర్సీ, వివేక్ ఒబెరాయ్, సంజయ్ దత్, మినీషా లాంబా తదితరులు ప్రధాన పాత్ర దారులుగా రూపొందుతున్న చిత్రం ‘జిల్లా గజియాబాద్'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వివాదాస్పద సీన్ ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ఇందులో హీరో అర్షన్ వర్సీ...హీరోయిన్ మినీషా లాంబ రొమ్ము భాగాన్ని చేత్తో టచ్ చేసిన సన్ని వేశానికి సంబంధించిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆనంద్ కుమార్ ఈ సీన్ గురించి, దాని ప్రాధాన్యత, సినిమాకు అలాంటి సీన్ ఎందుకు? అనే విషయాలను ముందుగా వివరించి ఇద్దరినీ ఒప్పించాడు. అయితే ఆ సీన్ షూట్ చేసే వరకు యూనిట్ సభ్యులెవరికీ అలాంటి సీన్ ఉంటుందనే విషయం తెలియదు. ఉన్నట్టుండి అర్షన్ వర్సీ మినీషా లాంబ రొమ్ములపై చేయి వేయడంతో యూనిట్ సభ్యులంతా షాకయ్యారు. కొందరు ఆయన కావాలనే ఇలాంటి పని చేసాడని అనుమాన పడ్డారు.

Thursday, 31 January 2013

తారా చౌదరి లైఫ్ బేస్డ్‌గా 'నగ్నసత్యం' ??



పాకిస్తాన్‌ నటి వీణా మాలిక్‌ నటిస్తున్న 'నగ్నసత్యం' చిత్రాన్ని ఆమధ్య సెక్స్ రాకెట్ కేసులో ఇరుక్కున్న తారా చౌదరి లైఫ్ బేస్డ్‌గా తెరకెక్కించినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. సహజంగా వీణామాలిక్ తెలుగు సినిమా చేస్తుందంటే క్రేజ్‌ ఏర్పడింది. అయితే ఆ చిత్రం ఏ అగ్రహీరో చిత్రానికి సంబంధించినది అయితే మరోలా ఉండేది. కానీ లోబడ్జెట్‌ చిత్రంలో ఆమె నటించడం ఆశ్చర్యంగానూ ఉంది. సి గ్రేడ్‌ నిర్మాతలు తీస్తున్న ఈ చిత్రం పేరు 'నగ్నసత్యం'.

వీణ ఈ చిత్రంలో తన సొగసులను ప్రదర్శించే సన్నివేశాల్లో నటించింది. బ్రోతల్‌ కేసులో ఆమె అరెస్ట్‌ కావడం... అంతకుముందు ఆమె ఎవరెవరితో పంచుకున్న సంఘటనలు వంటి విషయాలను చూపిస్తుంది. ఇవన్నీ దర్శకుడు రామారావు తెరకెక్కించారు.

అయితే ఇలాంటి సినిమాలు తీయడంలో సిద్ధహస్తులైన చదలవాడ శ్రీనివాసరావు వంటి నిర్మాతలు ముందుకువచ్చి తీయడం చిత్రానికి మరో మైనస్‌. ఇటీవలే కోర్టు సీన్‌ చిత్రీకరించారు. దీంతో షూటింగ్‌ పూర్తయింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నారు.