విజయ్ మంచి డాన్సర్ కదా ?
అలా అనీ ఎవరు అన్నరనుకుంటు న్నారా ... వాళ్ళు వీళ్లు అంటే పరవాలేదు .. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా
ఓ ఇంటర్వ్యూ లో నేను చూసిన డాన్స్ బాగా చేసే హీరోలు అంటూ హృతిక్ ,బన్నీ ,షాహిద్ అంటూ ఓ లిస్టు చెప్పాడు. ఆ లిస్టు లో ఇలయ దళపతి విజయ్ పేరు లేకపోవడంతో, కొందరు విజయ్ పేరు ఎందుకు చెప్పలేదు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుదేవా విజయ్ కి నా సర్టిఫికేట్ అవసరం లేదు. అతను చాలా మంచి డాన్సర్. నేను చెప్పిన మంచి విషయాలన్నీ వదిలేసి ఇంత చిన్న విషయాన్ని దయచేసి పెద్దది చెయ్యకండి. ఆ సమయంలో నేను ఎందుకు చెప్పలేదో నాకే అర్థం కావడం లేదు. దయచేసి నేను చెప్పిన లిస్టు లో మొదట విజయ్ పేరు చేర్చుకోండి అంటూ వివరణ ఇచ్చాడు. ఇంత వివరణ అవసరమా ప్రభు దేవా మాట్లాదేతప్పుడే చూసుకుని, ఆలోచించుకొని మాట్లాడొచ్చు కదా అంటున్నాయి తమిళ సినీ వర్గాలు