Thursday, 31 January 2013

తారా చౌదరి లైఫ్ బేస్డ్‌గా 'నగ్నసత్యం' ??



పాకిస్తాన్‌ నటి వీణా మాలిక్‌ నటిస్తున్న 'నగ్నసత్యం' చిత్రాన్ని ఆమధ్య సెక్స్ రాకెట్ కేసులో ఇరుక్కున్న తారా చౌదరి లైఫ్ బేస్డ్‌గా తెరకెక్కించినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. సహజంగా వీణామాలిక్ తెలుగు సినిమా చేస్తుందంటే క్రేజ్‌ ఏర్పడింది. అయితే ఆ చిత్రం ఏ అగ్రహీరో చిత్రానికి సంబంధించినది అయితే మరోలా ఉండేది. కానీ లోబడ్జెట్‌ చిత్రంలో ఆమె నటించడం ఆశ్చర్యంగానూ ఉంది. సి గ్రేడ్‌ నిర్మాతలు తీస్తున్న ఈ చిత్రం పేరు 'నగ్నసత్యం'.

వీణ ఈ చిత్రంలో తన సొగసులను ప్రదర్శించే సన్నివేశాల్లో నటించింది. బ్రోతల్‌ కేసులో ఆమె అరెస్ట్‌ కావడం... అంతకుముందు ఆమె ఎవరెవరితో పంచుకున్న సంఘటనలు వంటి విషయాలను చూపిస్తుంది. ఇవన్నీ దర్శకుడు రామారావు తెరకెక్కించారు.

అయితే ఇలాంటి సినిమాలు తీయడంలో సిద్ధహస్తులైన చదలవాడ శ్రీనివాసరావు వంటి నిర్మాతలు ముందుకువచ్చి తీయడం చిత్రానికి మరో మైనస్‌. ఇటీవలే కోర్టు సీన్‌ చిత్రీకరించారు. దీంతో షూటింగ్‌ పూర్తయింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నారు.

Saturday, 5 January 2013

హైదరాబాద్ లో110 థియేటర్లలో నాయక్ విడుదల

రామ్ చరణ్ నటించిన కొత్త సినిమా నాయక్. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న సినిమాను అదే స్థాయిలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను హైదరాబాద్ మహా నగరంలో 110 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ సినిమా కూడా ఇంత భారీ స్థాయిలో విడుదల కాలేదు. ఇది ‘నాయక్’ రికార్డుగా చెప్పుకోవాలి. కాగా, నైజాం ప్రాంతంలో ఈ సినిమాను అల్లు అరవింద్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ వ్యవహరాన్ని చూస్తున్న దిల్ రాజ్ నుంచి అల్లు అరవింద్ ఈ హక్కులను తీసుకోవడం విశేషం.

పవన్ కళ్యాణ్ తో ప్రణీత?



పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సమంత నటిస్తుంది. రెండవ హీరోయిన్ గా ప్రణీతను ఎంపిక చేశారు.  ‘ఏం పిల్లొ ఏం పిల్లోడు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రణీత బావ, శకుని చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం రావడం ప్రణీతకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. కాగా, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాకు ‘హరే రామా హరే కృష్ణ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Friday, 4 January 2013

పోలీస్ కేసు లో రామానాయుడు మనవడు?

ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండవ కుమారుడు అభిరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రవితేజ అనే ఇంజనీర్ ఇంటిపై దాడి చేసినందుకు హైదరాబాద్-బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అభిరామ్ పై కేసు నమోదు అయింది. ఐపిసి 447, 223, 342 సెక్షన్ల కింద బంజార హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, అతని కోసం గాలిస్తున్నారు.ఈ కేసు గురించి రామానాయుడు కుటుంబం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.

అవును! అవును నిజంగానే కొట్టాను :ఛార్మి

కొంతమందీ ఉరుకునె సంచలనాలు సృస్తీస్తారు...ఇప్పుడు ఆ కోవలోనే ఛార్మి కూడా చేరిపోయింది. ఓ ప్రముఖ డైరెక్టర్ ని ఛార్మి కొట్టిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ, ఛార్మిని ఈ విషయం గురించి అడిగితే... మా ఇద్దరి మధ్యా అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేసింది. ఆయన్ని ఏమీ చేయలేదంటూ గొప్పలు పోయిన ఛార్మి ఇప్పుడు మాట మార్చేసింది. ఛార్మి ప్రస్తుతం జిల్లా ఘజియాబాద్ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఆ సందర్భంగా ఓ జాతీయ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టేసింది. ‘ఆయనగారు నోరు జారారు. శ్రుతి మించారు. అలా చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు. అందుకే, నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది’ అంటూ నిజం కక్కేసింది. ఎంత లేదనుకున్నా... నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తుంది చెప్పండి?

2014 ఎలక్షన్లు లో.. పోటీ చెయ్యనున్న మంచు లక్ష్మి



టైమ్ బాగన్నప్పుడే మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కదా. అదే చేస్తోంది మంచు లక్ష్మి. మోహన్ బాబు కూతురిగా తెలుగువాళ్లకు సుపరిచితురాలైన లక్ష్మి... విదేశాల్లో చాలా సీరియళ్లలో నటించింది. ఆ సీరియళ్లు ఎప్పుడు ప్రసారమైనా... ఆ జీతం చెక్కులు ఇప్పటికీ ఆమెకు వస్తుంటాయట. అలా రచ్చగెలిచిన లక్ష్మి ఇంట గెలిచే ప్రయత్నం చేసింది. టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. టీవీ షోల ద్వారా... సినీ దర్శకుల దృష్టినీ ఆకర్షించి... సినిమాల్లోకీ అడుగుపెట్టింది. కేవలం నటనతోనే సరిపెట్టుకోలేదు. నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టింది. చేతులు కాలినా... ఫర్వాలేదనిపించుకుంది. ఇలా తెలుగు ప్రజలకు బాగా పరిచయమైన లక్ష్మి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటోంది. నిజానికి ఈ ఆలోచన ఆమెది కాదు. వాళ్ల నాన్న మోహన్ బాబుది. ఇటీవలి కాలంలో అటు కూతురి సినిమాలూ, ఇటు కొడుకుల సినిమాలూ కలిసిరాకపోవడంతో ఖాళీగా, ఫెయిల్యూర్లను చవిచూస్తున్న ఆయన... కనీసం రాజకీయాల్లోకి వెళ్లి ఒక సీటు రిజర్వు చేసుకుందామనుకున్నారు. కానీ, తాను వెళ్తే లాభం లేదనుకుని... అందరికీ పరిచయమైన తన కుమార్తెను అడుగుపెట్టించాలని చూస్తున్నారు. ఇందుకోసం తెలుగు దేశం పార్టీ నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన కుమార్తెకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కోరారట. తెలుగుదేశం స్పందన ఏంటో ఇంకా తెలియరాలేదు. ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి కాబట్టీ... త్వరలోనే ఆ స్పందన తెలుస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఫ్యాన్స్ ఇలా కూడా ఉంటారా??


ఫ్యాన్స్ ఇలా కూడా ఉంటారు!


మల్దోవాకి చెందిన వేరా అనే ఒక రష్యన్ యువతి అమితాబ్ బచ్చన్ కి వీరాభిమాని ...

(పాత సోవియట్ యూనియన్ నుంచి 1991 లో విడిపోయిన దేశాల్లో మల్దోవా ఒకటి.)

ఇక్కడే ఇంకో విషయం చెప్పుకోవాలి. ఒకప్పుడు రష్యా లో నెహ్రూ కంటే రాజ్ కపూరేపాప్యులర్! దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల నుంచే, రష్యన్ దేశస్థులకు మనహిందీ సినిమాలూ, మన హీరోలూ బాగా తెలుసు.


అమితాబ్ ను చూడ్డం కోసం - తను ఇండియా రావటానికి అవసరమయిన డబ్బు సమకూర్చుకోవటానికీ, తన ఈ ట్రిప్ కోసంనిత్య జీవితంలో ఉండే ఇతర అడ్డంకుల నుంచి కొద్ది రోజులు తనని తను ఫ్రీ చేసుకోడానికీ, వేరా కు 27 ఏళ్లు పట్టింది. ఈ మధ్యేముంభై వచ్చి అమితాబ్ ను కలవాలన్న తన కల నెరవేర్చుకుంది వేరా. తన రేంజ్ లో తనకి వీలయిన గిఫ్ట్ లతో పాటు,అమితాబ్ కోసం రష్యా నుంచి 27 గులాబీలను కూడా తెచ్చింది వేరా. అదీ ఆమె అభిమానం.

వేరా ఒకప్పటి సోవియట్ తరానికి చెందింది కాబట్టి అమితాబ్ పైన తన అభిమానాన్ని అలా చాటుకుంది. ఇప్పటి అత్యాధునికరష్యా కు చెందిన మరొక యువతి (ఆనా) అదే అమితాబ్ ను కలవటం కోసం ఫాస్ట్ ట్రాక్ మార్గం ఎన్నుకొంది. తన ఇండియాట్రిప్ కోసం అవసరమయిన డబ్బు కోసం, డ్రగ్స్ డీల్ చేస్తూ పట్టుబడింది. జైలుకెళ్లింది. ఎంత బాధాకరం!

ఈ విషయం తెలిసిన అమితాబ్ - టీవీ క్రూ ద్వారా ఒక వీడియో  మెసేజ్ పంపిచాట్ట జైల్లో ఉన్న ఆ అమ్మాయికి. ఇలాంటి పనిచేసే ముందు ఆలోచించాల్సింది అని. కనీసం తనకు ముందే తెలిస్తే, ఆ అమ్మాయిని ఇండియా రప్పించే ఏర్పాటు మరొకలాగాచేసి ఉండేవాణ్ణి అని ఆయన భావన.

ఈ రెండు ఉదాహరణల్లో ఉన్న పాజిటివ్, నెగెటివ్ కోణాల్ని పక్కనపెడితే - ఈ ఇద్దరు రష్యన్ ఫ్యాన్స్ ని మన తెలుగు హీరోలఫ్యాన్స్ తో ఒక సారి పోల్చిచూడండి

Wednesday, 2 January 2013

కోటి ఇరవై లక్షల మంది తెలుగువారి ఉత్తమ నటుడు పవన్ కళ్యాణ్

ప్రపంచ స్థాయి సాంకేతికతతో, అనుభవజ్ఝులైన జర్నలిజం మిత్ర బృందంతో, తాజా, సంచలన వార్తా విశ్లేషణలతో... ప్రారంభించిన అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న ఎపిహెరాల్డ్.కామ్ పోర్టల్, వెబ్ జర్నలిజం రంగంలో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోటి ఇరవై లక్షల మంది తెలుగువారిని  పోర్టల్ [ఎపిహెరాల్డ్.కామ్] ద్వారాను, సోషల్ నెట్ వర్కింగ్ [ఫేస్ బుక్, ట్విట్టర్] తోనూ అనుసంధానిస్తూ నిర్వహించిన అన్ లైన్ సర్వే తెలుగు వెబ్ జర్నలిజం చరిత్రలోనే సరికొత్త విధానంలో సాగింది. 2012  తెలుగు సినిమా ఉత్తమ నటుడు విభాగంలో 10 మంది హీరోలు పోటీపడగా... రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబులను మించి పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ను ఉత్తమ నటుడిగా ప్రపంచ వ్యాప్త తెలుగు సినిమా అభిమానులు ఎన్నుకున్నారు.   సర్వే వివరాలు : ఉత్తమ నటుడు ‘పవర్ స్టార్’  పవన్ కళ్యాణ్   ‘గబ్బర్ సింగ్’ కలెక్షన్స్ పవన్ స్టామినా నిరూపిస్తే, ‘గబ్బర్ సింగ్’ నటన పవన్ కళ్యాణ్ మేనియాను చాటి చెప్పింది. ‘ఖుషీ’ సినిమా నాటి జోష్, ఎనర్జీ, పవన్ ట్రేడ్ మార్క్  మ్యానరిజమ్స్, ‘నాకు కొంచెం తిక్కుంది - కానీ దానికో లెక్కుంది’ వంటి డైలాగ్స్ తో పవర్ స్టార్  అభిమానులు 'పవన్ మేనియాలో' మునిగిపోయారు. టాలీవుడ్ రికార్డు విజయంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా మరోసారి చూపించి అన్నీ వర్గాలవారిని అకట్టుకున్న ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ 2012  ఉత్తమ నటుడుగా ఎన్నికయ్యారు.   మహేష్ బాబు ‘బిజినెస్ మ్యాన్’ సినిమాలో నటనకు గాను మహేష్ బాబు ఈ సర్వేలో రెండవ ఉత్తమ నటుడుగా నిలిచారు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ చూపిన హైఓల్టేజ్ నటన ఈ టాలీవుడ్ ప్రిన్స్ ను ఈ సర్వేలో రెండవ స్థానంలో నిలిపింది. ఈ సర్వేలో పవన్ కళ్యాణ్ కు గట్టిపోటీ ఇచ్చిన మహేష్ స్వల్ప తేడాతో ఫస్ట్ ప్లేస్ ను మిస్ అయ్యారు. courtsy by ఎపిహెరాల్డ్.కామ్