Friday, 19 April 2013

అత్తారింటికి దారి’ పవన్ మూవీ పేరు?

‘అత్తారింటికి దారి’ పవన్ మూవీ పేరు?   గబ్బర్‌సింగ్ సినిమా హిట్ తో మంచి  జోష్  తో తెలుగు
ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నా పవర్ స్టార్ పవన్
కల్యాణ్ తరువాత రిలీజ్ అయిన  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన
కెమేరామేన్ గంగతో రాంబాబు సినిమా నిరాశపరచడంతో పవన్ తాజాగా త్రివిమ్
శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమాను నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ
నేపధ్యంలో పవన్ కల్యాణ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట.

 పవన్ కల్యాణ్‌కు జల్సాతో బ్రేక్ ఇచ్చిన
త్రివిక్రమ్‌పై నమ్మకముంచి ఈ సినిమాను పవన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ -
పవన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి చాలా రకాల టైటిళ్లు అనుకున్నారట.
‘సరదా’, హరేరామ హరేకృష్ణ మొదలగు పేర్లలను పరీశీలించినట్లు సమాచారం. అయితే
చివరిగా ‘అత్తారింటికి దారి’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లు విశ్వసనీయ
వర్గాలు చెబుతున్నారు.

సినిమాలో పవన్ సరసన సమంత నటిస్తుంది. సమంతకు తల్లిగా మిర్చి సినిమాలో
ప్రభాస్‌కు తల్లిగా నటించిన నదియా  నటిస్తుంది. ప్రణిత కీలకమైన పాత్ర పోషిస్తున్న  ఈ సినిమా కు  ‘అత్తారింటికి దారి’
అనే టైటిల్‌ను అనుకుంట్టున్నరట్ట  నదియా అత్తగా లీడ్ రోల్ పోషించనుందట. ఈ చిత్రానికి
దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. posted by venkatesh.gurrala

Monday, 15 April 2013

సానియా కీ ఇంత త్వరగా ఎలా వచ్చిందీ ??

 భారత టెన్నిస్ ఆటగాళ్ల సంఘం (ఐటీపీఏ) ఉపాధ్యక్షురాలిగా భారత స్టార్ క్రీడాకారిణి, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా ఎంపికైంది. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ సంఘంలో ఆమె కూడా ఇటీవలే సభ్యత్వం స్వీకరించారు. ఆ వెంటనే ఉపాధ్యక్షురాలిగా కూడా ఎంపికయ్యారు. ఇంత త్వరగా సానియా  ఎం
 
పిక  అవటం గూర్చి చాలామందీ గుసగుసలడుకుంటున్నారు ... 

కొత్తగా ఏర్పాటైన ఐటీపీఏలోని నలుగురు ఉపాధ్యక్షుల్లో సానియా ఒకరని ఐటీపీఏ కార్యదర్శి, జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) ఉపాధ్యక్షుడు కూడా అయిన కార్తీ చిదంబరం ఆదివారం తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఐటీపీఏ ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన సానియా ఆ పదవికి ఏకగ్రీవంగా ఎంపికైనట్టు చెప్పారు.

కాగా వెటరన్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సింగిల్స్ స్టార్ సోమ్‌దేవ్ వర్మన్‌లు మిగతా ముగ్గురు ఉపాధ్యక్షులు. భారత డేవిస్ కప్ మాజీ కెప్టెన్ జైదీప్ ముఖర్జీ ఐటీపీఏకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎంతైనా గ్లామర్ ఉంటే ఎలాంటీ పదవులకైనా
ఏకగ్రీవంగా ఎంపిక  అవచ్చు .....   ఏమమంటారు ??

10కోట్లు మార్క్ దాటీన చిన్న సినిమా కలేక్షన్స్.

10కోట్లు మార్క్  దాటీన చిన్న సినిమా కలేక్షన్స్.    హ్యాపీ డేస్ హీరో నిఖిల్ పెద్ద హిట్టే కొట్టాడు.హ్యాపీ డేస్ తరువాత పేద్దగా  హిట్లు లేనీ ఈ హీరో మూవీ స్వామీ రా రా ...   ఏలంటీ హడావీడి లేకుండా వీడుదల అయి  యావరేజ్ టాక్‌తో మొద‌లై హిట్టైపోయింది... స్వామి రారా సినిమా. ఈ సినిమా త‌ర‌వాత సుధీర్ వ‌ర్మ చుట్టూ  ఈగ‌ల్లా మూగిపోయారు నిర్మాత‌లు. ఆయ‌న పారితోషికం కాస్త  గట్టీ గా  డిమాండ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎనిమిది కోట్లు రాబ‌ట్టింది. అయిన ఖ‌ర్చు మూడేన‌ట‌. అంటే రూ.7కోట్లు లాభం తెచ్చింద‌న్న‌మాట‌. చిన్న సినిమాకి ఇది పెద్ద విజ‌య‌మే. అందుకే నిర్మాత‌లు సుధీర్ వ‌ర్మ అడిగిన బ‌డ్జెట్‌ని అందివ్వ‌డానికి ఏమాత్రం వెనుకంజ వేయ‌డం లేదు. అటు నిఖిల్‌కీ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పాపం.... సినిమాలేనిద‌ల్లా స్వాతికే .
 
స్వాతిమళ్ళీ  తమిళ్ లో  ట్రై చేయ్యటమేనా ??

Monday, 1 April 2013

మరీ ఇంత సన్నబడీతే ఎలా??

ఇలియానా లేటెస్ట్ స్టిల్స్ చూడండీ..


బాలీవుడ్ మోజులో పడిన ఇలియానా అక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని తన శక్తి మేర ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘బర్ఫీ' చిత్రం మంచి విజయం సాధించడంతో షాహిద్ కపూర్ సరసన ‘పథా పోస్టర్ నిఖ్లా హీరో' అనే చిత్రంలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. కాగా...ఒకప్పుడు ఇలియానాను సన్ననడుము సుందరి అంటూ దక్షిణాది ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే రాను రాను అమ్మడు జీరో సైజు మోజులో పడి మరీ బక్క చిక్కడంతో ఆమె అందంపై చాలా మందికి మోజు తీరి పోయింది. దీంతో ఇలియానా అందంపై విమర్శలు రావడం మొదలయ్యాయి.మరీ ఇంత సన్నబడీతే  ఎలా ఇలియానా??

Friday, 29 March 2013

సినిమా మొత్తం వర్షం లో ...

సినిమా  మొత్తం  వర్షం లో ...సినిమాల్లో వర్షం పాటలు వుండటం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అయితే, ఇప్పుడు ఏకంగా ఒక సినిమా మొత్తం వర్షం నేపథ్యంలో రూపొందుతోంది. గతం లో  '1940లో ఒక గ్రామం' చిత్రాన్ని రూపొందించి, జాతీయ అవార్డు అందుకున్న నరసింహ నంది ఇప్పుడీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  శివాజీ కథానాయకుడుగా నటిస్తున్నారు.

'మొదటి ఫ్రేం నుండి చివరి ఫ్రేం వరకూ సినిమా మొత్తం వర్షం బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఈ సినిమాకు ఇది పెద్ద విశేషం. కథ అటువంటిది. సినిమా సహజత్వంతో సాగుతుంది. నిజజీవితానికి దగ్గరగా వుండే పాత్రలే ఇందులో కనిపిస్తాయి' అని దర్శకుడు అంటున్నారు. మే నెలలో చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది.

Saturday, 23 March 2013

కొత్త డైరెక్టర్ కీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్ ...??

కొత్త డైరెక్టర్ కీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్ ...
కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంలో మిగ‌తా హీరోల‌కంటే రామ్‌చ‌ర‌ణ్ ఓ అడుగు ముందే వున్నాడు. ర‌చ్చ‌తో సంప‌ద్‌నందికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ప్ర‌యోగం స‌త్ఫ‌లితాన్ని ఇచ్చింది. మిర్చి చూసి కొర‌టాల శివ కు ఓకే చెప్పాడు. ఇప్ప‌డు గోపీ గ‌ణేష్ అనే కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌కి ప‌చ్చ‌జెండా ఊపాడు. గోపీ తొలి సినిమా రోమియో ఇంకా విడుద‌ల కానే లేదు. అయినా స‌రే.. క‌థ‌పై న‌మ్మ‌కంతో చ‌ర‌ణ్ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడ‌ట‌. క‌నీసం రోమియో సినిమా కూడా చూడ‌లేద‌ట‌. అందులో ఓ పాట చూశాడు. అంతే... గోపీ టేకింగ్‌పై గురి కుదిరింద‌ట‌. ఈ చిత్రానికి కె.ఎస్‌.రామారావు తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది. నిజానికి గోపీని చ‌ర‌ణ్‌కి ప‌రిచ‌యం చేసింది ఈయ‌నే. ఎవ‌డు త‌ర‌వాత సెట్స్‌పైకి వెళ్లే సినిమా ఇదే కావ‌చ్చు. ఆ తరవాత కొరటాల శివ సినిమా వుంటుంది. 

Tuesday, 12 March 2013

1000 అబద్ధాలు సినిమా కీ డైరెక్టర్ తేజ కాదా ?

రాజేంద్రప్రసాద్‌తో ‘సినిమాకెళ్దాం రండి’ చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ ‘వెయ్యి అబద్ధాలు’సినిమాను నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రం కథాంసం ఓ మాట్రమోనీ బ్యూరో చుట్టూ తిరగనుంది.ఐతే  ఈ సినిమా టైటీల్ ప్రకారం  అప్పుడే  ఒక  అబద్ధం ఫిలిం నగర్ లో ప్రచారం లో ఉందీ అదే ….ఎ ఫిల్మ్ నాట్ బై తేజ…ఫస్ట్  అబద్ధం భావుంధీ  కదా …!
సాధారణంగా…తమ చిత్రాలకు ఎ ఫిల్మ్ బై అని దర్శకుడు తన పేరు వేసుకోవటం ఆనవాయితీనే. అయితే దర్శకుడు తేజ ఈ సారి …ఎ ఫిల్మ్ నాట్ బై తేజ అనే నెగిటివ్ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సాయిరామ్ శంకర్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వెయ్యి అబద్ధాలు’ చిత్రానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం చర్చనీయాంసంగా మారింది.

ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ- ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి ‘1000 అబద్ధాలు’ అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం” అని చెప్పారు.———–పోస్ట్ బై …వెంకటేష్ గుఱ్ఱాల — (1)