Sunday, 16 December 2012

ఈ నెల 17న ‘నాయక్' ఆడియో రిలీజ్

రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాయక్'. ఈచిత్రం ఫస్ట్ ట్రైలర్ రీసెంట్ గానే విడుదలైంది. ఈ ట్రైలర్ లో ఓ చిన్న తప్పు దొర్లింది. ఈ ట్రైలర్ లో మెన్షన్ చేసిన స్టేట్ మెంట్ ‘History Creates Leaders But A Real History Will Rewrite History.' లో హిస్టరీ అనే పదం రెండు సార్లు వచ్చింది. లీడర్ అని రావాలి. అయితే వెంటనే మేకర్స్ ఈ విషయం గమనించి...రెక్టిఫై చేసి ‘History Creates Leaders But A Real Leader Will Rewrite History.' తో కొత్త వెర్షన్ విడుదల చేసారు. ట్రైలర్ చూసిన వారు తప్పకుండా హిస్టరీ క్రియేట్ చేస్తుందని నమ్మకంగా అంటున్నారు. ఇక ఈ నెల 17న జరుగనున్న ‘నాయక్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు మెగా ఫ్యామిలీలో హీరోలంతా హాజరవుతున్నారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు వస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా అందని సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ ఆడియో వేడుకకు రావడం లేదని స్పష్టం అయింది. ప్రస్తుతం ఆయన తన సినిమాకు సంబంధించిన పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి స్పెయిన్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ పలు లొకేషన్లు సెలక్ట్ చేయడంతో పాటు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు రావడం లేదనే విషయాన్ని సోషల్ నెట్వర్కింగ్‌లో ఉన్న పలు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పేజీల్లో కూడా స్పష్టం చేసారు.

జీవితంలో చాలా చూడాలి-శ్రియ


తనకు జీవితంలో చాలా అందాల్ని చూడాలి. కొన్ని కోరికలు ఉన్నాయి. అవన్నీ అయ్యాక తోడుకోసం ఆలోచిస్తానని నటి శ్రియ చెబుతోంది. నాకు స్కూబా డైవింగ్‌ అంటే ఇష్టం. బంగీ జంప్‌ కూడా ఇష్టం. ప్రపంచంలో ఎన్నో అందాలున్నాయి. అవన్నీ చూడాలి.

అందుకే సాధ్యమైనంతవరకు టూర్‌లకు వెళుతుంటాను. నా పెళ్ళికి ఇంకా తొందరలేదు. ప్రస్తుతం కుటుంబసభ్యులతో హాయిగా ఉన్నాను. పెళ్లికి ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు. నేను ఏది చేసినా నా కుటుంబ సపోర్ట్‌ ఉందని చెబుతుంది.

లారెన్స్ కు . రెండున్నర కోట్లు ఫైన్

ప్రభాస్ 'రెబల్‌' సినిమాకి సంబంధించిన వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రూ.2.5 కోట్లు నిర్మాతలకు చెల్లించాలని దర్శకుడు లారెన్స్‌కి నిర్మాతల మండలి స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ సినిమాను రూ.22.5 కోట్లు వ్యయంతో రూపొందిస్తానని నిర్మాతలు భగవాన్‌, పుల్లారావులతో దర్శకుడు ఒప్పందం చేసుకొన్నారు. నిర్మాణ వ్యయం పెరిగింది. ఫలితంగా నిర్మాతలకు రూ.5 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందనీ ఆ మొత్తాన్ని లారెన్స్‌ నుంచి ఇప్పించాలని నిర్మాతల మండలిని ఆశ్రయించారు. భగవాన్‌, పుల్లారావు. దీనిపై మండలి... దర్శకుల సంఘంతో కలిసి సమన్వయ కమిటినీ ఏర్పాటు చేసి చర్చలు సాగించింది. లారెన్స్‌ రెండున్నర కోట్ల రూపాయలు నిర్మాతలకు ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది.

Saturday, 15 December 2012

ఒక్క రాత్రికి ఆండ్రియా రేటు రూ.50 లక్షలు????

చిత్ర పరిశ్రమలో మల్టీటాలెంట్ క్రేజ్ ఉన్న హీరోయిన్లకు ఎపుడూ మంచి గిరాకీ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వారు తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం..........................తమ పారితోషకాన్ని అమాంతం పెంచేస్తారు కూడా. ఈ కోవకు చెందిన మల్టీటాలెంట్ కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెరెమియా. లోగడ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో లిప్‌లాక్ కిస్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ.. మరో సందర్భంలో మరో రకంగా కెమెరాకు చిక్కి వివాదంలో చిక్కుకుంది. ఇపుడు తాజాగా.. మరో వివాదాస్పద ప్రకటన చేసింది. ఒక్క రాత్రికి నా రేటు 50 లక్షల రూపాయలు. దీనికి సై అంటే తనను సంప్రదించవచ్చని బాహాటంగా చెపుతున్నారు. 
ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఈ తరహా ప్రకటన ఇవ్వడానికి కారణమేంటనీ ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబరు 31వ తేదీన పాపులర్ క్లబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్టులు, నక్షత్ర హోటల్స్‌లలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఈ వేడుకల్లో పాల్గొని ఆడి పాడేందుకు గాను ఈ హాట్ భామ ఒక్క రాత్రికి 50 లక్షల రూపాయల రేటును ఇపుడే ఫిక్స్ చేసిందట. 

అటు నటనతో పాటు.. ఇటు గాత్రం ఉండటంతో పాటు.. అవసరమైత్ లిప్‌లాక్ కిస్‌లు ఇచ్చేందుకు ఆండ్రియా సిద్ధంగా ఉండటమే ఇంత భారీ రేటుకు కారణమట. సో... రూ.50 లక్షలు కావనుకుంటే.. బ్యాచిలర్స్‌తో కూడా ఆడిపాడేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధంగా ఉందన్నమాట.

అజిత్ ను ఫాలో అవుతూన్న సల్మాన్!



ఈ డిసెంబర్ 21 న దబాంగ్ -2 త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో ఉన్న సల్మాన్ ఖాన్ దబాంగ్ కు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమా హిట్ అయితే దబాంగ్ -3 ని కూడా రూపొందిస్తానని సల్మాన్ తెలిపాడు. దబాంగ్ తొలి వెర్షన్ బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంతో సల్మాన్ శరవేగంగా సీక్వెల్ ను పూర్తీ చేశాడు. ఇక మూడో దబాంగ్ విషయంలో సల్మాన్ ప్రకటన చూస్తే… ఆ విషయంలో ఆయన అజిత్ ను ఫాలో అవుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఇటీవలే అజిత్ కూడా బిల్లాకు ప్రీక్వెల్ పేరుతో ఒక సినిమారూపొందిచాడు.
ఆ సినిమా ఫలితాన్ని పక్కన పెడితే… ‘బిల్లా’ ఎలా తయారయ్యాడు అనే అంశాన్ని చూపారు. ఇది భారతీయ సినిమా వరకూ ఒక కొత్త ప్రక్రియ. కొనసాగింపు కథ గా కాకుండా, ఇంతకు ముందు జరిగిన కథగా ఇండియాలో వచ్చిన తొలిసినిమా అది. ఇక ఈ ఫార్ములాను దబాంగ్ -3 విషయంలో సల్మాన్ ఫాలో కానున్నాడు. దబాంగ్ -2 ప్రమోషన్ లో భాగంగా ఆయనే స్వయంగా ప్రీక్వెల్ విషయాన్ని ప్రకటించాడు. దబాంగ్ -3 ప్రీక్వెల్ గా ఉంటుందని సల్మాన్ చెప్పాడు. చుల్ బుల్ పాండే పరిణామ క్రమం గురించి ఆ సినిమా ఉంటుందని వివరించాడు. మరి ఇది కేవలం పబ్లిసిటీ స్టంటో, లేక నిజంగానే సల్మాన్ దబాంగ్ కు ప్రీక్వెల్ తీస్తాడో…కాలమే సమాధానం చెప్పాలి.

అనిరుధ్‌తో ఆండ్రియా లిప్‌లాక్ ఫోటోలు


ధనుష్ హీరోగా రూపొందిన ‘3' మూవీలోని ‘కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ హీరోయన్ ఆండ్రియాతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. వీరి సరస సల్లాపాల ఫోటోలు తాజాగా ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. కొంత కాలంగా వీరి మధ్య గాఢమైన లవ్వాయనం సాగుతుందనడానికి ఈ ముద్దు సీన్లే నిదర్శనం

అనిరుధ్ ఎవరో కాదు...రజనీకూతురు సౌందర్యకు ఖజిన్ అవుతాడు. అందుకే 3 సినిమాలో చాన్స్ వచ్చింది. అతని వయసు కేవలం 22 మాత్రమే. అయితే ఆండ్రియా వయసు మాత్రం 27. అయినా ఈ కాలంలో వయసును పెద్దగా పట్టించుకోవడం లేదనుకోండి. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెలుతుందా? ఎవరి దారి వారు చూసుకుంటారా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమే.

సిద్దార్థ్-సమంతల సినిమా పేరు ‘డుం డుం డుం పి పి పి’

 
సిద్దార్థ్-సమంతల ‘డుం డుం డుం పి పి పి’...ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ‘జబర్ధస్త్’ చిత్రంలో నటిస్తున్న సిద్దార్థ్-సమంతల కలయికలో మరో చిత్రం రూపొందనుంది. తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ చిత్రం ద్వారా నందినిరెడ్డి దర్శకత్వ శాఖలో పనిచేసిన కృష్ణవంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తిరుపతి బ్రదర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డుం డుం డుం పి పి పి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. చెన్నయ్, హైదరాబాద్, మలేషియాలో చిత్రీకరణ కొనసాగనుందని సమాచారం.