Friday, 28 September 2012

బ్రౌజింగ్ చేసి డబ్బు సంపాదించడం ఎలా..?

టెక్నాలజీ గెయింట్ గూగుల్ సెర్చ్ ఇంజన్‌ని ఉపయోగిస్తున్నారా.. ఐతే గూగుల్ మీకు త్వరలో డబ్బులు చెల్లిస్తుంది.. తీసుకునేందుకు సిద్దంగా ఉండండి. గూగుల్ కొత్తగా ‘స్క్రీన్‌వైజ్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గూగుల్ $25( సుమారు Rs 1250) అమెజాన్.కామ్ గిప్ట్ కార్డ్స్‌ని యూజర్స్‌కి అందించనుంది. సెర్చ్ ఇంజన్ ద్వారా యూజర్స్  వేరు వేరు వెబ్ సైట్స్‌కి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ గిప్ట్ కార్డ్స్ లభించనున్నాయి.
గూగుల్ ప్రకారం  ప్రజలు ఇంటర్నెట్ వాడకం మరియు సాధారణ దైనందిన పోకడలు గురించి మరింత తెలుసునే భాగంగా ఈ కార్యక్రమానికి గూగుల్ శ్రీకారం చుట్టిందని సమాచారం. ఈ స్క్రీన్‌వైజ్ కార్యక్రమంలో పాల్గోనదలచిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు.. వారి యొక్క వెబ్ బ్రౌజర్స్‌లో గూగుల్ పొడిగింపులను నిక్షిప్తం చేసుకోవాలి. ఇలా యూజర్స్ గూగుల్ పొడిగింపులను నిక్షిప్తం చేసుకోవడం వల్ల యూజర్స్ ఏమేమి బ్రౌజింగ్ చేస్తున్నారో గూగుల్ ప్రతినిధులు గూగుల్ ట్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం ఈజీ.
ఎవరైతే యూజర్స్ గూగుల్ స్క్రీన్‌వైజ్‌లో  రిజస్టర్ అవుతారో వారికి $5(సుమారు Rs 250)  అమెజాన్.కామ్ గిప్ట్ కార్డు లభిస్తుంది. మూడు నెలలు పాటు జరగనున్న ఈ ప్రోగ్రామ్‌ని సక్సెస్ పుల్‌గా పూర్తి చేసిన యూజర్స్‌కు గిప్ట్ కార్డ్స్ వస్తూనే ఉంటాయి. దీని ద్వారా ఇందులో పాల్గోనే పాల్గోనదారులకు మొత్తం  $25(సుమారు Rs 1250) లను సొంతం చేసుకోనున్నారు. ఒక్కసారి ఈ స్క్రీన్‌వైజ్ లో రిజస్టర్ ఐతే మూడు నెలలు పాటు మీరు చేసే బ్రౌజింగ్ కార్యకలాపాలన్నీ గూగుల్ ట్రెండ్స్ ద్వారా మానిటర్ చేయబడతాయనే విషయాన్ని యూజర్స్ గుర్తించుకోవాలి.

కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం ఆడియో ఫంక్షన్ జరపక పోవటానికి కారణం ?

‘‘ఈ మధ్య ఏ ఆడియో ఫంక్షన్ చూసినా ఒకే విధంగా వుంటున్నాయి. పొగడ్తలు .. పొగడ్తలు .. పొగడ్తలు .. పొగడ్తలు .. హీరో ను పొగడక పొతే ఫ్యాన్స్ గెస్ట్ లను మాట్లాడానిక పోవడం. ఫ్యాన్స్ ను ఏమి అనలేక వాళ్ళ చేష్టలను అతిధులు భారంగా భరించడం. ఆ విధంగా ఆలోచిస్తే కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియో ఫంక్షన్ అవసరమా అనిపిస్తుంది. ‘ ఆడియో ఫంక్షన్ వలన సినిమాకు మంచి పబ్లిసిటి కాబట్టి, సినిమాకు ఆడియో ఫంక్షన్ చాలా అవసరం. సినిమాపై హిరో మనసులోని మాటలు వినవచ్చు '... కాని ఈ ప్రోసస్ అంతా రొటీన్ అయిపోయింది. బిజెనెస్ మెన్ ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాథ్ మహేష్ బాబు ను ర్యాగింగ్ చేసినట్టు, పవన్ కళ్యాణ్ ను కూడా పూరి జగన్నాథ్ ప్రశ్నలతో ముంచెత్తి పవన్ కళ్యాణ్ పై తెలుగు ప్రేక్షకులకు వున్న డౌట్స్ అన్ని తీరిస్తే బాగుండును. కానీ మహేష్ బాబుతో ఉన్నంత చనువు పవన్ కళ్యాణ్ తో వుండి వుండదు.'' అంటూ ఆడియో ఫంక్షన్ లేక పోవడాన్ని కొందరు పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వెబ్ పేజీలో సమర్థించుకుంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో(సెప్టెంబర్ 26) నేరుగా . ఈఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సాదీ సీదాగా నిర్వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో సీడీలను మార్కెట్‌లోకి విడుదల చేసారు. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు అభిమానులును బాగా అలరిస్తున్నాయని సమాచారం. మాస్ కోసం రెడీ చేసిన ఐటం సాంగ్ ...గ్యారెంటీగా ధియోటర్స్ లో జనం లేచి డాన్స్ చేస్తారంటున్నారు. చిత్రంలోని పాటలను భాస్కరభట్ల సింగిల్ కార్డుతో రాసారు. మధ్య ఆడియో ఫంక్షన్ రోటీన్ అయిపోయాయి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీ ఓ పోస్టు చేసింది.

Monday, 24 September 2012

ఆస్కార్ కి బర్ఫీ సినిమా ఎంపిక..

 ఇలియానా నటించిన తొలి హిందీ సినిమా 'బర్ఫీ'. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల బరిలోకి భారతదేశం తరఫున చిత్రం దిగబోతోంది. 2012 సంవత్సరానికిగానూ 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేసినట్టు శనివారం రాత్రి ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆస్కార్‌ జ్యూరీ ఛైర్‌పర్సన్‌ మంజు బోరా ఈ విషయం తెలియచేసారు. ఆస్కార్ అవార్డ్స్ విభాగంలో ‘ఉత్తమ విదేశీ చిత్రం' విభాగానికి సంబంధించిన నామినేషన్ కోసం మన భారతదేశం నుంచి ఒక సినిమాని ఎంపిక చేసింది ఎఫ్‌ఎఫ్‌ఐ. వివిధ భారత భాషల్లో రూపొందిన దాదాపు 20 చిత్రాలను వీక్షించారు.మంజు బోరా మాట్లాడుతూ ''మొత్తం 20 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేశాం. మానవ సంబంధాలకు ప్రాధాన్యమున్న చిత్రమిది. మన దేశం స్థితిగతుల్ని కూడా ప్రతిబింబించేలా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాని ఎంపిక చేశాము. మేం చూసిన అన్ని చిత్రాలు బాగున్నాయి. కానీ అకాడమీ అవార్డ్స్ కమిటీ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ మేరకు ‘బర్ఫీ'ని ఎంపిక చేశాం. ఆస్కార్ నామినేషన్‌కు పంపించడానికి సినిమా కథ, నాణ్యత ముఖ్యం. ‘బర్ఫీ'లో ఇవి మెండుగా ఉన్నాయి. మానవీయ విలువలను అద్భుతంగా చూపించిన చిత్రం ఇది'' అన్నారు.ఎప్పుడూ కూడా హిందీ సినిమాలకే అవకాశాలిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ''సినిమాలో ఉన్న విషయం, విలువల్నిబట్టే ఎంపిక జరుగుతుంది. అంతే కానీ భాషతో సం బంధమేమీ లేదు'' అన్నారు. మన సినిమాలు ఆస్కార్‌లో చివరి వరకూ నిలవలేకపోతున్నాయి కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ''సినిమాని ఎంపిక చేయడం వరకే మా బాధ్యత. అక్కడ ఆస్కార్‌ వేదికపైకి చేరడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తే బాగుంటుంద''న్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు పాల్గొన్నారు                                                                                                                                                                                                       post by venkatesh.gurrala

cameraman ganga tho rambabu audio tracks list ...                                                                                                                               పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ సమర్పణలో యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఎకర్స్ లో నిర్మించిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. తాజాగా ఈచిత్రం ఆడియో ట్రాక్ లిస్టు బయటకు వచ్చింది. ఎలాంటి ఆడియో వేడక లేకుండా నేరుగా సినిమా పాటలను మార్కెట్లోకి విడుదల కానున్నాయి.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. థీమ్ సాంగ్
పాడినవారు: హేమ చంద్ర, కారుణ్య, నరేంద్ర
2. పిల్లని చూస్తే..
పాడినవారు: కారుణ్య, చిత్ర
3. జరమొచ్చింది
పాడినవారు: ఖుషి మురళి, శ్రావణ భార్గవి
4. ఎక్స్‌ట్రార్డరనీ
పాడినవారు: హేమ చంద్ర
5. మెలికల్
పాడినవారు: గీతా మాధురి, నరేంద్ర
6. తలదించుకు...
పాడినవారు: కారుణ్య, హేమచంద్ర, శ్రీకృష్ణ, నరేంద్ర...............................                                                              post by venkatesh.gurrala

Friday, 21 September 2012

వారంలో సింగ్ కేబినెట్లోకి చిరంజీవి?

తృణమూల్ కాంగ్రెసు పార్టీ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం నుండి నిష్క్రమిస్తున్న నేపథ్యంలో వారం రోజుల్లో పునర్వవస్థీకరించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం, వీరభద్ర సింగ్ వంటి వారు అవినీతి ఆరోపణలతో కేబినెట్ నుండి ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. తాజాగా టిఎంసి మంత్రులు కూడా గుడ్ బై చెప్పనున్నారు. శుక్రవారం ఏ సమయంలోనైనా వారు తమ రాజీనామాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో ఖచ్చితంగా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది.ఈసారి మార్పులు చేర్పులు భారీగానే ఉండే అవకాశముంది. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ, ఆర్థికమంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేల స్థానం పదిలమే అయినప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగినా జరగవచ్చంటున్నారు. త్వరలో గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు, లోకసభ ఎన్నికల సన్నద్ధత కోసం పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మరికొందరిని మంత్రివర్గం నుండి తొలగించి రాష్ట్రాల బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సహాయ శాఖ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఒకటికి మించి శాఖలు నిర్వహిస్తున్న పలువురు మంత్రులను అదనపు బాధ్యతల నుండి తప్పించి ఇతరులకు అప్పగించే అవకాశాలున్నాయి.
2జి కుంభకోణంలో అరెస్టైన రాజా రాజీనామా తర్వాత ఆ శాఖను సిబాల్ చూస్తున్నారు. దయానిధి మారన్ శాఖ ఖాళీగా ఉంది. టిఎంసికి చెందిన ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఆ శాఖను కాంగ్రెసు తన దగ్గరే ఉంచుకుంటుంది. .

Thursday, 20 September 2012

పవన్ కళ్యాణ్‌తో   శేఖర్ కమ్ముల

సినిమా??

 దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. ఇటీవల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన శేఖర్ కమ్ముల అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...‘నా ఫేవరెట్ హీరో చిరంజీవి. పవన్ కళ్యాణ్ నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో సినిమా చేయాలని ఉంది. నాకు అవకాశం వస్తే ఎప్పటికైనా తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని వెల్లడించారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇటీవల విడుదలైన ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా కేవలం క్లాస్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునే విధంగా ఉంది. అర్భన్ ఆడియన్స్ మాత్రమే ఈచిత్రాన్ని ఇష్ట పడతున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు ఈచిత్రాన్ని అంతగా ఇష్ట పడటం లేదు. శేఖర్ కమ్ముల త్వరలో నాగార్జున తనయుడు అఖిల్‌ను పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా హీరోయిన్. డీవీవీ దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో ఆడియో అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.