హీరోయిన్ చార్మి ఈ మధ్య చాలా నాజ్జుగా స్లిమ్ ఐన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘ప్రేమ మైకం' చిత్రంలో చార్మి రూపం ఆంటీ లా కనిపించి
విమర్శలకు దారి తీసింది. దీంతో బరువు తగ్గాలని నిర్నయించుకున్న చార్మి చాలా కష్టపడి ఏకంగా 9 కిలోలు తగ్గింది. తన లుక్ ఇపుడు ఎలా ఉంది? అంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. బరువు తగ్గిన తర్వాత చార్మి చాలా హాట్‌గా ఉంది కదూ! ఇక ఆమె సినిమా ప్రొఫెషన్ విషయాల్లోకి వెళితే....చార్మి రాత్రి పూట షూటింగులు ఉండొద్దని కోరుకుంటోంది. వీలైనంత వరకు రాత్రి పూట షూటింగులకు దూరంగా ఉండాలనే భావిస్తోంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లనే ఆమె రాత్రి పూట షూటింగుల్లో పాల్గొనేందుకు భయ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి రాత్రి పూట చార్మికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో? అవి బయటికి చెప్పుకోలేనివా? అంటూ ఫిల్మ్ నగర్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.













