Tuesday, 4 December 2012

రామ్ చరణ్ ని ఆశ్చర్య పరిచిన మెగాస్టార్?


 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ ‘జంజీర్' చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సమాచారం లేకుండా ఈ షూటింగ్ సెట్లోకి సడెన్‌గా ఎంటరయి అందరినీ ఆశ్చర్య పరిచారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి వస్తున్నారన్న విషయం ఆయన తనయుడు రామ్ చరణ్ కు కూడా తెలియదట.చిరంజీవి ఆకస్మికంగా వచ్చి సర్ ప్రైజ్ ఇవ్వడంతో.... దర్శకుడు అపూర్వ లఖియాతో పాటు, హీరో రామ్ చరణ్, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆయనకు సాదర స్వాగతం పలికారు. అక్కడ కొంత సేపు గడిపిన చిరంజీవి షూటింగ్ విశేషాలను దర్శకుడిని అడిగి తెలుసుకున్నారు.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన ‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు' చిత్రంలో, వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

నవనీత్ కౌర్ తాజా సంచలనం ?



శీను వాసంతి లక్ష్మీ సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి నవనీత్ కౌర్. తరువాత చాలా సినిమాల్లో నటించినా తగిన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అందాల ప్రదర్శనలో ఇతర హీరోయిన్ల కంటే ముందు ఉన్నా రేసులో మాత్రం వెనకబడి పోయింది. గత సంవత్సరం మహారాష్ర్టకు చెందిన ఎమ్మెల్యే ను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. అయితే తాజాగా ఆమె హాట్ ఫోటోలు నెట్ లో సంచరిస్తున్నాయి. దీంతో సినిమాల్లో సెకెండ్  ఇన్నింగ్స్ కు నవనీత్ రంగం సిద్ధం చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Saturday, 1 December 2012

ఆకట్టుకునే సంభాషణల తో కృష్ణం వందే జగద్గురం


తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కృష్ణం వందే జగద్గురం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా, నయనతార జంటగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సంభాషణలను సాయిమాధవ్ బుర్రా అందించారు. ఈ సినిమా కోసం ఆకట్టుకునే సంభాషణలను రాసిన సాయిమాధవ్ ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లోనూ, సినీ అభిమానులోనూ హట్ టాపిక్ గా మారారు. కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఆకట్టుకునే డైలాగ్స్ లో కొన్ని : ‘కళ అంటే బ్రతుకు నిచ్చేదే కాదు.. బ్రతుకు నేర్పేది కూడా..’ ‘అది కల నిద్దురలో కనేది.. ఇది కళ నిద్దుర లేపేది.’ ‘బ్రతుకు కోడి గుడ్డు లాంటింది భయ్యా.. ఏది పెద్దదవుతుందో, ఏది అమ్లెట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు’ ‘కొన్ని చావులు చూసి గర్వపడాలి’ ‘గర్భగుడిలో ఊరకుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు అపవిత్రం అయిపోడు.’, ‘ తొమ్మిది మాసాలు కష్ట పడి అమ్మ మనల్ని కన్నదని కొంత మంది అనుకుంటారు, నాన్న పక్కన పది నిమిషాలు సుఖ పడి మనల్ని కన్నదని మరికొంత మంది అనుకుంటారు, పడక సుఖం చూసినవాడు పశువు అవుతాడు. పురిటి కష్టం చూసిన వాడు మనిషి అవుతాడు’ ‘మా తరం వారు ఉన్నచోటనే స్వాతంత్ర్యం సంపాదించుకుంటే, ఈ తరం వారు స్వాతంత్ర్యం వెతక్కుంటూ వెళుతున్నారు.’ ‘60 హర్మోనియం పెట్టెలు ఒకేసారి ఆరున్న శృతిలో మోగితే ఎలా ఉంటుందో.. మా వాడు కొడితే అలా ఉంటుంది.’ ‘ హే అల్లా.. మళ్లి వచ్చింది పిల్ల’ ‘సర్కస్ మీడియా ఒకేలాంటివి. సర్కస్ లో బపూన్లు ఉంటారు. ఇక్కడ చూసే వారు బపూన్లు అవుతారు.’ ‘అడవిలో మనిషి చస్తే ఎవ్వరూ పట్టించుకోరు.. పట్నంలో మనిషి బ్రతుకుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు.’

నాయక్ లో వాడే కత్తి ఇదెనా

క్లైమాక్స్ ఫైట్ లోనే, లేక ఇంకేదైనా ప్రత్యేక సందర్భంలో ఆ ఆయుధంతో ఫైట్ చేస్తాడు హీరో. తాజాగా నాయక్ చిత్రంలో కూడా ఇలాంటి వెపన్ తయారు చేయించారు దర్శకుడు వివి వినాయక్. తాజాగా విడుదల చేసిన నాయక్ వర్కింగ్ స్టిల్స్ ద్వారా ఈ ఆయుధం విషయం బయట పడింది.
గతంలో రామ్ చరణ్ మగధీర సినిమాతో పాటు ఇతర చిత్రాల్లో వివిధ రకాల వెపన్స్ వాడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నాయక్' చిత్రం విషయంలో కూడా అదే ఆనవాయితీ రిపీట్ అవుతోంది. వివి వినాయ్ గత చిత్రాలైన యోగి, లక్ష్మి, బద్రినాథ్ చిత్రాల్లో ఇదే విధంగా హీరో కోసం ప్రత్యేకమైన వెపన్స్ చేయించాడు. ప్రత్యేక వెపన్ ఉందంటే మాస్ ఆడియన్స్ మెచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లే లెక్క.
నాయక్ సినిమా విశేషాల్లోకి వెళితే...
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటర్ అయింది. ఈ ఫైనల్ షెడ్యూల్ లో క్లైమాక్స్ సీన్స్, ఓ సాంగును చిత్రీకరించనున్నారు. డిసెంబర్ 18 వరకు షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది.

అనుష్క పక్కనుంటే ఎవరు ఈ లోకంలో ఉండరు : చోటా కే నాయుడు


అనుష్క... ఈమె షూటింగ్‌లో ఉన్నా... లేకున్నా... తన పనేమిటో తను చేసుకుని వెళ్ళిపోతుంది. తన పక్కనున్నవారిని కూడా చాలా ఆప్యాయంగా పలుకరిస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేదు. షూటింగ్‌లో అయితే అంతా తననే తధేకంగా చూస్తుంటే... వారిని తట్టి మరీ పలుకురిస్తుంది.

నా మొహం మీద కోతులు తిరుగుతున్నాయా? అంటూ చమత్కరిస్తుందీ ఈ ముద్దుగుమ్మ. ఒక మానవతా మూర్తి. ఏదైనా బాధలు అని చెబితే. ఇట్టే కరిగిపోయి... తగిన విధంగా ఆదుకుంటుంది. ఇవన్నీ.. ఆమెతో చిత్రాల్లో కలిసి పని చేసిన వారు అన్నమాటలు.

'ఢమరుకం'లో చిత్రంలో ఆమెతో పాటు పని చేసిన ఛోటాకెనాయుడు, రచయితలు, సహనటులు.. లైట్‌మేన్‌లు.. వీళ్ళంతా ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఢమరుకం సక్సెస్‌మీట్‌లో ఎక్కువభాగం ఆమెను పొగడ్తలతోనే సరిపోయింది. అయితే... వీరందరికీ వ్యతిరేకంగా.... ఛోటా కె నాయుడు మరో డైలాగ్‌ కూడా కొట్టాడు.

సక్సెస్‌ మీట్‌కు కాస్త ఆలస్యమైన ఛోటా కె నాయుడు వచ్చారు. అప్పటికే నాగార్జున స్టేజీపైకి వెళ్ళిపోయారు. అక్కడ అనుష్క ఉంది. ఆమెతో మాట్లాడుతుండగా.... నాగార్జునను చోటా పలుకరించారు. నాగార్జున వినిపించో వినపించకనో పట్టించుకోలేదు. దీంతో ఛోటా స్పందిస్తూ... పక్కన స్వీటీ ఉంటే... మమ్మల్ని ఎందుకు పట్టించుకున్నారంటూ... చమత్కరించారు.

ఈ విషయం చివరకు నాగ్ వరకు వెళ్ళింది... నవ్వుకుని... రా.. మిస్టర్‌.. ఛోటా.. అంటూ ఆప్యాయంగా స్టేజీపైకి తీసుకెళ్లారు. మరి అంత పబ్లిక్‌గానే ఛోటా కామెంట్‌ చేశాడంటే..... విషయం చాలానే ఉందికదూ!

డాన్స్ చెసిన రాజమౌళి

రాజమౌళి డాన్స్ చేస్తూ, యాంకరింగ్ చేస్తూ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్ లో ఒక పెళ్ళికి సంబంధించి జరిగిన ‘సంగీత్' వేడుకకు దర్శకుడు రాజమౌళి యాంకర్‌గా వ్యవహరించారు. అక్కడ హాజరైన వారందరినీ తన మాటలతో హుషారెత్తించడమే కాకుండా, కొన్ని పాటలకు ఆయన ఎంతో హుషారుగా డాన్స్ కూడా చేశారు.

రెండు గంటలపాటు సాగిన ఈ సరదా వేడుకలో ఆయన సతీమణి రమ కూడా పాల్గొన్నారు. సంగీతదర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి వల్లి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక ప్రముఖ డాక్టరు కుటుంబానికి సంబంధించి జరిగిన ఈ ‘సంగీత్' వేడుకలో గురవారెడ్డి వంటి ప్రముఖ డాక్టర్లు కూడా పాల్గొన్నారు.
ప్రస్తుతం రాజమౌళి తను త్వరలో డైరక్ట్ చేయబోయే ప్రభాస్ చిత్రంపైనే దృష్టి పెట్టారు. ఈ చిత్రం తెలుగు,తమిళ్,హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ చిత్రంలో బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ ని, మరో సీనియర్ హిందీ నటిని తీసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో రాజమౌళి చిత్రాల రీమేక్ లకు క్రేజ్ పెరగటంతో ఈ సారి స్టైయిట్ చిత్రంతో బాలీవుడ్ ని పలకరించి హిట్ కొట్టాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్ కి కూడా బాలీవుడ్ లో ఇది లాంచింగ్ సినిమా అవుతుంది.
బైలింగ్వులవ్ చిత్రాలు రెగ్యులర్ షూటింగ్ తరహాలో కాకుండా గౌతమ్ మీనన్ తరహాలో ప్రతీ సీన్ ని రాజమౌళి హిందీలో ప్రత్యేకంగా షూట్ చేయనున్నారు. గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది.

వయసెక్కువ మగాళ్ల అంటే నే ఇష్టం -ఇలియానా

బాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన ఇలియానా తన మనస్సులో భావాలను అక్కడ మీడియాతో పంచుకుంటోంది. తాజాగా ఓ బాలీవుడ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ.. తాను వయసెక్కువ మగవాళ్ల పట్ల తను ఎట్రాక్ట్ అవుతుంటానని ఈ గోవా బ్యూటీ తేల్చి చెప్పింది. ఆమె మాట్లాడుతూ... "కొంచెం వయసెక్కువ మగవాళ్లతో నేను కనెక్టవుతుంటాను. దీనికి కారణం నేనున్న వృత్తి వల్లేనని నా అభిప్రాయం'' అంది.
అలా ఎట్రాక్ట్ అవటానికి కారణం చెప్తూ... "సినీ రంగంలోని ఆడవాళ్లు చిన్న వయసులోనే బాగా ఎక్స్ పోజ్ అవుతుంటారు. అందువల్ల చాలా వేగంగా వారు పరిణతి చెందుతారు. మా అమ్మానాన్నల మధ్య వయసు తేడా పన్నెండేళ్లు. అలాగే మా అక్కా బావల మధ్య వయసు తారతమ్యం పదేళ్లు. ప్రేమలో పడ్డాక, వయసనేది పెద్ద విషయం కాదు'' అని చెప్పింది ఇలియానా.

అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించిన ‘జులాయి', రవితేజతో చేసిన ‘దేవుడు చేసిన మనుషులు' రెండూ తెలుగులో విడుదల అయ్యి మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. జూలాయి హిట్టైన దేముడు చేసిన మనుష్యులు ప్లాప్...  . ఈ విషయమై చెప్తూ... నా సినిమా విడుదల అవుతోందంటే నాకు ఒకటే కంగారు. మేం పడిన కష్టాన్ని గుర్తిస్తారో లేదో.. అనే భయం ఉంటుంది. గాల్లో దీపం పెట్టి 'దేవుడా నువ్వే దిక్కు' అంటే ఉపయోగం ఏముంది? మేం చేసిన ప్రయత్నంలో నిజాయతీ ఉంటే తప్పకుండా ఫలితం ఉంటుందని నమ్ముతాను అంది.
అలాగే తన మత విశ్వాసాలు గురించి చెపుతూ.. నేను క్రిస్టియన్‌ని అయినప్పటికీ హిందూ దేవాలయాలకు వెళతాను. మాస్క్‌లకు కూడా వెళుతుంటాను. మనకన్నా పైన ఎవరో ఉన్నారని, ఆ శక్తే మనల్ని నడిపిస్తోందని నమ్ముతాను.. అన్ని మతాల సారం ఒక్కటే అన్నది నా సిద్ధాంతం. దేవుళ్లందరినీ నమ్ముకొంటే కనీసం ఒక్క దేవుడైనా కరుణిస్తాడని నా ఆశ.. అని చెప్పింది.