పవన్ తో సినిమా కోసం మారుతీ ఎదురుచూస్తున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత క్రేజీ అనేది మళ్ళి నిరూపణ అయింది
సెలెబ్రెటీలంతా తమకు అవకాసం చిక్కినప్పుడల్లా పవన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా పిజ్జా తెలుగులో కూడా డబ్ చేయబడి విజయం సాధించింది. పిజ్జా సినిమాకు సీక్వెల్ గా ‘విల్లా’ ను నిర్మించారు. ఈ సినిమాను కూడా తెలుగులో డబ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మార్కెటింగ్ ను టాలీవుడ్ దర్శకుడు మారుతి పర్యవేక్షిస్తున్నారు. మొదటిగా ఈ సినిమాను ఈరోజు విడుదల చేయాలని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే పవన్ ‘అత్తారిల్లు’ ఈరోజుతో 50 రోజుల పండుగను చేసుకుంటోంది కాబట్టి ‘విల్లా’ సినిమాను ఈరోజు విడుదల చేస్తే పవన్ అత్తారిల్లు అర్ధ శతదినోత్సవానికి అడ్డంగా ‘విల్లా’ మారి చాలా ధియేటర్లలో పవన్ ‘అత్తారిల్లు’ ను తీసివేయవలసి వస్తుంది. పవన్ ప్రభంజనానికి అడ్డు రాకూడదు అనే ఉదేశ్యం తో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న మారుతీ తదితర వ్యక్తులు ఒక రోజు ఆలస్యంగా ‘విల్లా’ ను రేపటి నుంచి ధియేటర్లలోకి తీసుకువస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడమే జీవిత ధ్యేయంగా తిరుగుతున్న మారుతి పవన్ కోసం ఈ మాత్రం త్యాగంలో ఆశ్చర్యం ఏముంది. అల్ ది బెస్ట్ మారుతీ

.jpg)







