Thursday, 2 January 2014

సమంత కు పోటీ గా కాజోల్ ఉచిత సేవ??

సమంత కు పోటీ గా కాజోల్  సమాజ సేవ??
కాజోల్  అగర్వాల్ కూడా సమాజ సేవ మొదలుపెట్టింది .. సినీమాలు తగ్గటం వల్ల  త్వరలోనే ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు కూడా చేస్తానంది.కాజోల్ ఈ  విషయం  లో తన పోటీ హీరోయిన్ సమంతను ఫాలో అవుతుంది. ఐతే, ఈ అనుచరణ సినిమాల విషయంలో కాదు సమాజసేవ విషయంలో. ఔను, హీరోయిన్‌గా సమంత వరుస సినిమాలతో దూసుకుపోతూనే మరోవైపు ఏమాత్రం విరామం దొరికినా ఆ సమయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి వెచ్చించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా సమంత కేన్సర్ బారిన పడిన పిల్లలకు సాయం అందిస్తోంది.   అలాగే ఈ మధ్య కాలంలోనే పలు సామాజిక కార్యక్రమాల్లో తను సేవలందించింది. కథానాయికగా ఎదుగుతూనే ఆమె ఇలా సామాజిక సేవ పట్ల దృష్టిపెట్టడం ఇండస్ట్రీ వర్గాలను కదిలించింది. ముఖ్యంగా సమంతను చూసి స్ఫూర్తి పొందిన కాజల్ అగర్వాల్ సమాజ సేవలో పోటీఇచ్చేందుకు రెడీ అయింది. సమంతను చూసి ఇన్స్‌పైరైన కాజల్ అనాథ బాలబాలికలకు తన వంతు సాయం చేయడానికి నడుం బిగించింది. ఇందులో భాగంగా, శిశు సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆదరిస్తానని ప్రకటించింది.   మొత్తంమీద, ఇలా సామాజిక సేవా విషయంలో ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తిని పొంది ముందుకు రావడం శుభపరిణామం. ఈ టాప్ హీరోయిన్స్‌ని చూసి ఇంకెంతమంది సినీభామలు సమాజ సేవకు రెడీ అంటారో చూడాలి. 
by venkatesh.gurrala